ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అభివృద్ధి, పరిశోధన రెండూ ఆర్థిక వ్యవస్థకు, దేశానికి వెన్నెముక బలం లాంటివి - ఉపరాష్ట్రపతి

కార్పొరేట్ దిగ్గజాలు... అభివృద్ధి పరిశోధన సంస్థలకు ఊతం ఇవ్వాలన్న ఉపరాష్ట్రపతి

వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో ఆర్థిక జాతీయవాదం ఉండాలని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి

ఇటీవల కాలంలో పద్మ పురస్కారాలకు విశ్వసనీయత పెరగడం ప్రశంసనీయమన్న శ్రీ ధన్కడ్

పద్మ అవార్డులు ఇకపై ఈవెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రాపకాలకు లేదా కీర్తిని పెంచేవిగా ఉండవు - ఉపరాష్ట్రపతి

భవిష్యత్తు .. భారత్ దే - ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ని సందర్శించిన ఉప రాష్ట్రపతి

Posted On: 26 APR 2024 8:52PM by PIB Hyderabad

ఆర్థిక వ్యవస్థ, దేశం రెండింటికీ వెన్నుముక బలంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ అన్నారు. ఔషధ అభివృద్ధిలో ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఆర్ అండ్ డి ప్రయత్నాలు కేవలం ఆవిష్కరణలు, వాటి ఆచరణలో పెట్టడమే కాకుండా, మానవాళికి అత్యున్నత సహకారాన్ని కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. "సైన్స్ మరియు పరిశోధనల ద్వారా మానవాళికి సేవ చేయాలనే మన ప్రయత్నాన్ని తాత్కాలిక వైఫల్యాలు అడ్డుకోకూడదు" అని ఆయన సూచించారు. 

వాక్సిన్ మైత్రి చొరవ ద్వారా కోవాక్సిన్ విరాళంతో సహా అంతర్జాతీయ టీకా ప్రయత్నాలకు భారతదేశ సహకరించడం, "వసుధైవ కుటుంబం" సూత్రానికి దేశ నిబద్ధత, దీర్ఘకాల సహకారాన్ని ప్రతిబింబిస్తుందని అయన ప్రముఖంగా ప్రస్తావించారు. 

విఘాతం కలిగించే సాంకేతికతలపై దృష్టి సారించి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పరిశోధన, అభివృద్ధికి మరిన్ని మార్గాలు వేసేందుకు కార్పొరేట్‌ దిగ్గజాలు ఆ సంస్థలకు చేయూత నివ్వాల్సిన అవసరాన్ని శ్రీ ధన్కడ్ మరింత స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఫెసిలిటీలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ధన్కడ్ ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో పద్మ అవార్డుల విశ్వసనీయతను కొనియాడారు. పద్మ అవార్డులు ఇప్పుడు చాలా ప్రామాణికమైనవి, అర్హులైన వ్యక్తులకే చెందుతున్నాయని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. " ఈ అవార్డులు ఇకపై ప్రాపకాలకు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా వచ్చే కీర్తి ద్వారా నడవవు" అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. 

ఆర్థిక సమస్యలను ప్రస్తావిస్తూ, అనవసరమైన దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్యం గణనీయంగా తగ్గిపోతుందని శ్రీ ధన్కడ్ ప్రముఖంగా ప్రస్తావించారు. స్థానిక ఉత్పత్తులను, సామాజిక నిబద్ధతను ప్రోత్సహించే తత్వానికి ఈ పద్ధతి విరుద్ధమని విమర్శిస్తూ, మూడు తీవ్రమైన పరిణామాల గురించి ప్రజలను అయన హెచ్చరించారు: విదేశీ మారక నిల్వలను నివారించడం, స్థానికంగా లభించే వస్తువులను దిగుమతి చేసుకోవడం ద్వారా దేశీయ తయారీకి ఆటంకం, ఇంకా, వ్యవస్థాపక అవకాశాలను అణిచివేయడం పై దృష్టి సారించాలన్నారు. 

ప్రపంచంలోని అనేక అగ్రశ్రేణి సంస్థలు తమ విస్తృతమైన పూర్వ విద్యార్థుల నుండి తమ బలాన్ని ఇంకా పెంచుకుంటున్నాయని ఆయన అన్నారు. పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని, థింక్ ట్యాంక్‌ల ద్వారా బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ను

 

ఏర్పరచుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దేశ వృద్ధి, అభివృద్ధికి దోహదపడాలని కోరారు.

విఘాతం కలిగించే సాంకేతిక పరిజ్ఞానాల వాహకీకరణ కోసం మాట్లాడుతూ, వారి పరివర్తన సామర్థ్యాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు, వారి నియంత్రణ లేని విస్తరణ విషయంలో కూడా ఆయన హెచ్చరించారు.

బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ పరిశోధనలపై భారతదేశం అచంచలమైన అంకితభావం కారణంగా ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా దాని ఖ్యాతిని పెంపొందించడానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

వేగవంతమైన పురోగతి, చురుకైన ముందడుగు కారణంగా భారత్ ఆరోహణ క్రమం, ఒక సూపర్ పవర్‌గా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారత్ భవిష్యత్తుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ, నిద్రాణ స్థితి నుండి వేగవంతంగా కదిలే శక్తిగా పరివర్తన చెందడాన్ని ఉపరాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. 

****



(Release ID: 2018987) Visitor Counter : 109


Read this release in: English , Urdu , Hindi