విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ను విజయవంతంగా ప్రారంభించిన ఎస్ జేవీఎన్
1500 మెగావాట్ల నత్ప జాక్రి హైడ్రో పవర్ స్టేషన్, 412 మెగావాట్ల రాంపూర్ హైడ్రో పవర్ స్టేషన్ లలో కేంద్రీకృత కార్యకలాపాలు ప్రారంభించిన ఎస్ జేవీఎన్
Posted On:
25 APR 2024 2:30PM by PIB Hyderabad
దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ను ఎస్ జేవీఎన్ లిమిటెడ్ విజయవంతంగా ప్రారంభించింది. హిమాచల్ ప్రదేశ్ లోని జాక్రిలో ఎస్ జెవిఎన్ లిమిటెడ్ భారతదేశంలో తొలిసారిగా నెలకొల్పిన బహుళ ప్రయోజన (కంబైన్డ్ హీట్ , పవర్) 1,500 మెగావాట్ల నత్ప జాక్రి హైడ్రో పవర్ స్టేషన్ (ఎన్ జెహెచ్ పిఎస్) లో ఉత్పత్తి ప్రారంభమైంది. దేశంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా ఎస్ జెవిఎన్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన మైలురాయి సాధించింది. ఈ ప్రాజెక్టు లో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్ ను ఎస్ జెవిఎన్ నెలకొల్పిన హై వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ (HVOF) కోటింగ్ ఫెసిలిటీ ఇంధన అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఉపయోగించబడుతుంది. అంతేకాకుండా 25 కిలోవాట్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ సెల్ ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది.
దేశంలో మొట్టమొదటి బహుళ ప్రయోజన (కంబైన్డ్ హీట్ , పవర్) గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ప్లాంట్ ను ఎస్ జేవీఎన్ చైర్ పర్సన్ , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గీతా కపూర్ ఏప్రిల్ 24న ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడిన శ్రీమతి గీతా కపూర్ “భారత ప్రభుత్వ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఎస్ జేవీఎన్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు అయ్యింది. దీంతో విద్యుత్ రంగంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం అవుతుంది. దీనివల్ల పరిశుద్ధ ఇంధన ఉత్పత్తిలో గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది." అని పేర్కొన్నారు.
అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ 8 గంటల సమయంలో ప్రతిరోజూ 14 కిలోగ్రాముల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి అయిన హైడ్రోజన్ ను మొత్తం 12 m3 నిల్వ సామర్థ్యం గల ఆరు నిల్వ ట్యాంకులలో 30 బార్ల ఒత్తిడితో నిల్వ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ 20 Nm3/గంట సామర్థ్యం గల ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్‌ని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనికి అవసరమైన ఇంధనం సిమ్లాలోని వధాల్‌లో ఎస్ జెవిఎన్ నెలకో;ల్పిన 1.31 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నుంచి పునరుత్పాదక శక్తిగా సరఫరా అవుతుంది.
గ్రీన్ హైడ్రోజన్ ను ఇంధన ఉత్పత్తి తో పాటు టర్బైన్ నీటి అడుగున భాగాన ఏర్పాటైన హై వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ (HVOF) కోటింగ్ ఫెసిలిటీ ఇంధన అవసరాల కోసం ఉపయోగిస్తారు
రామ్‌పూర్‌లోని యూనిట్-2 రిమోట్‌గా ఆపరేట్ చేయడం ద్వారా 1,500 మెగావాట్ల నాత్‌పా ఝక్రి హైడ్రో పవర్ స్టేషన్ ( ఎన్ జెహెచ్ పిఎస్ ),412 మెగావాట్ల రాంపూర్ హైడ్రో పవర్ స్టేషన్ (రాంపూర్ హెచ్ పిఎస్ ) కేంద్రీకృత కార్యకలాపాలను కూడా సంస్థ చైర్ పర్సన్ ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని జాక్రి వద్ద ఉన్న న్ జెహెచ్ పిఎస్ కంట్రోల్ రూమ్ నుండి హెచ్ పిఎస్ . రాంపూర్ హెచ్ పిఎస్ విజయవంతంగా ఎన్ జెహెచ్ పిఎస్ తో టాండమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నిర్వహించబడుతోంది.
ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసిన ఎన్ జెహెచ్ పిఎస్ , రాంపూర్ హెచ్ పిఎస్, ఎస్ జేవీఎన్ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఎలక్ట్రికల్ డిజైన్ బృందాన్ని శ్రీమతి కపూర్ అభినందించారు. మొత్తం రాంపూర్ హెచ్‌పిఎస్‌ను ఎన్‌జెహెచ్‌పిఎస్ నుంచి నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆమె కోరారు.
కార్యక్రమంలో ప్రాజెక్ట్ హెడ్ ( న్ జెహెచ్ పిఎస్ ), శ్రీ మనోజ్ కుమార్; ప్రాజెక్ట్ హెడ్ (రాంపూర్ హెచ్ పిఎస్ ), శ్రీ వికాస్ మార్వా; విభాగాధిపతి (ఎలక్ట్రికల్ డిజైన్), శ్రీ హరీష్ కుమార్ శర్మ; ఎన్ జెహెచ్ పిఎస్ రాంపూర్ హెచ్ పిఎస్, కార్పొరేట్ ప్రధాన కార్యాలయాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2018934)
Visitor Counter : 245