నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఐఆర్‌ఈడిఏ సెలబ్రేట్స్ లెగసీ: భవిష్యత్తు కోసం తమ ఆలోచనలను పంచుకున్న పూర్వ ఉద్యోగులు

Posted On: 12 APR 2024 10:41AM by PIB Hyderabad

ఏప్రిల్ 10, 2024న "పబ్లిక్ సెక్టార్ డే" సందర్భంగా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్‌ఈడిఏ) గత వారసత్వాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు భవిష్యత్తుకు మార్గాన్ని అందించేందుకురిటైర్డ్ ఉద్యోగులను ఒకచోట చేర్చి ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ సీఎండీలు, డైరెక్టర్‌లతో పాటు పదవీ విరమణ పొందిన చాలామంది ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్థ భవిష్యత్తు పథం కోసం అవసరమైన విలువైన అంశాలను ఈ సందర్భంగా వారంతా పంచుకున్నారు.

 

image.png


అనుభవజ్ఞులు తమ అనుభవాలను వివరించడానికి మరియు ఐఆర్‌ఈడిఏ ప్రయాణాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ఇన్‌పుట్‌లను అందించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడింది. మాజీ సిఎండీలు మరియు డైరెక్టర్లు ఐఆర్‌ఈడిఏ యొక్క వేగవంతమైన వృద్ధి పథాన్ని మెచ్చుకున్నారు మరియు వ్యాపార విజయాన్ని పెంపొందించడం మరియు పనిలో పనిగా పనిచేసిన వారి శ్రేయస్సును నిర్ధారించడం పట్ల యాజమాన్యం యొక్క సమగ్ర విధానాన్ని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత గురించి ఐఆర్‌ఈడిఏ సిఎండి శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ మాట్లాడుతూ"ఈ సమావేశానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది మన విలువైన గత ఉద్యోగులు మరియు ఉన్నతమైన సహోద్యోగుల సహకారాన్ని గౌరవించడమే కాకుండా అందరిని కలుపుకొనిపోయే సంస్కృతిని పెంపొందించడానికి మన నిబద్ధతను చాటుతుంది. వారి అనుభవం మరియు ఆలోచనలు అమూల్యమైన ఆస్తులు. అవి పునరుత్పాదక ఇంధన అభివృద్ధి దిశగా మనల్ని ముందుకు నడుపుతాయి.మన వృద్ధి కథ కేవలం సంఖ్యలు మరియు విజయాల గురించి మాత్రమే కాదు ఇది మనకు పునాదిగా నిలిచిన వ్యక్తుల విజయం గురించి కూడా. మన పూర్వీకుల జ్ఞానం మరియు మార్గదర్శకత్వానికి కృతజ్ఞులం మరియు అదే శ్రేష్ఠత మరియు సహకారంతో ఐఆర్‌ఈడిఏని కొత్త శిఖరాలకు నడిపించడానికి మేము కృషిచేస్తున్నాము" అని తెలిపారు.

 

image.png


ఈ వేడుకలో మరో ముఖ్యాంశం హాస్య కవి సమ్మేళనం. కార్యక్రమానికి హాజరైన వారికి ఇది వినోదాన్ని అందించడమే కాకుండా వేడుక వాతావరణాన్ని మరింత అహ్లాదపరిచింది. శ్రీమతి మనీషా శుక్లా, శ్రీ చిరాగ్ జైన్ మరియు శ్రీ సుందర్ కటారియా కవిత్వం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం తన శ్రామికశక్తిలో సంఘం మరియు కొనసాగింపు భావాన్ని పెంపొందించడంలో  ఐఆర్‌ఈడిఏ నిబద్ధతకు నిదర్శనం.

 

image.png


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఫైనాన్స్) డాక్టర్ బిజయ్ కుమార్ మొహంతి, ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీ రామ్ నిషాల్ నిషాద్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ అజయ్ కుమార్ సహాని మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. బ్రాంచ్ కార్యాలయాల్లోని ఐఆర్‌ఈడిఏ అధికారులు వర్చువల్ మోడ్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

***



(Release ID: 2017926) Visitor Counter : 132