రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

.వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో 79 వ స్టాఫ్ కోర్సును ఉద్దేశించి ప్రసంగించిన ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ వి.ఆర్.చౌధురి


సమకాలీన, భవిష్యత్ సన్నద్ధత కలిగిన వైమానిక దళంగా ఐఎఎఫ్ పరివర్తన గురించి ప్రముఖంగా ప్రస్తావించిన ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్.

Posted On: 22 MAR 2024 1:40PM by PIB Hyderabad

ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ఎయిర్ ఛీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి2024 మార్చి 22న వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాప్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా సిఎఎస్  భారత సాయుధ దళాలకు చెందిన విద్యార్తులుస్నేహ పూర్వక దేశాలనుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్న 79 వ స్టాఫ్ కోర్స్డిఎస్ఎస్సి శాస్వత సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఛీఫ్ ఆఫ్ ఎయిర్స్ఠాఫ్ (సిఎఎస్)భారత వైమానిక దళం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. అలాగే అభివృద్ధి ప్రణాళిక గురించిసంయుక్తంగా కార్యకలాపాల నిర్వహణ గురించి మాట్లాడారు. ఐఎఎఫ్ సమకాలీన భవిష్యత్ సన్నద్ధత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఐఎఎఫ్ దార్శినక పత్రంలో పేర్కొన్న అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇవి సమర్దమైన వైమానిక దళ శక్తికి వీలు కల్పిస్తాయనినిర్ణయాథ్మక వైమానిక శక్తిగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. 

భారత సంతతికి   చెందిన వారిని సంక్షుభిత ప్రాంతాలనుంచి  సురక్షితంగా తరలించడంలోవిపత్తులు తలెత్తినపుడు సహాయ కార్యకలాపాలు చేపట్టడంలో భారత వైమానిక దళం పాత్ర గురించి సిఎఎస్ ప్రముఖంగా ప్రస్తావించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ద:ఇజ్రాయిల్– హమస్ యుద్ధాల నుంచి వైమానికదళ శక్తికి సంబంధించి నేర్చుకున్న పాఠాల గురించి ఆయన ప్రస్తావించారు.ప్రస్తుతం కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాల గురించిడిఎస్ఎస్సి లో సంయుక్త కార్యకలాపాల నిర్వహణ ను మరింత ముందుకు తీసుకుపోవడం గురించి వివరించారు. వారి ప్రసంగానికి మంచి స్పందన లభించింది.



(Release ID: 2016306) Visitor Counter : 64