శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డీ జీ - సీఎస్ఐఆర్ సీఎస్ఐఆర్- ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ ని సందర్శించారు. కొత్తగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ మెయిన్ గేట్ ప్రారంభించారు. స్వస్తిక్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు
Posted On:
21 MAR 2024 8:59PM by PIB Hyderabad
సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్) మార్చి 21, 2024న పూసా క్యాంపస్‌లో ప్రధాన ద్వారం ప్రారంభోత్సవంతో ఒక ముఖ్యమైన మైలురాయిని జరుపుకుంది. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ మరియు సెక్రటరీ డాక్టర్. ఎన్. కలైసెల్వి డీఎస్‌ఐఆర్ వేడుకలను ప్రారంభించారు.
సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన అగర్వాల్ స్వాగతోపన్యాసం చేస్తూ, “సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ ఇటీవలి కాలంలో అనేక కార్యక్రమాలను చేపట్టింది. సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ స్థాపన భారతీయ ల్యాబ్‌లలో ఆర్ & డీ పురోగతుల వ్యాప్తిని క్రమబద్ధీకరించడానికి ఒక కీలకమైన అడుగు. ఈ ప్రయోజనం కోసం ఏక గవాక్షాన్ని సృష్టించడం చాలా కీలకమైనది మరియు ఈ పాత్రను నెరవేర్చడంలో ఎస్ ఎం సీ సీ అత్యుత్తమంగా ఉంది. నేషనల్ నాలెడ్జ్ రిసోర్స్ కన్సార్టియం మరియు స్వస్తిక్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇతర మంచి కార్యక్రమాలు.
డాక్టర్ కలైసెల్వి తన ప్రసంగంలో ఇన్‌స్టిట్యూట్ సాధించిన విజయాలను హైలైట్ చేశారు. డీ జీ సీఎస్ఐఆర్ మాట్లాడుతూ, “సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ అన్ని ల్యాబ్‌ల మధ్య అనుసంధానాన్ని పెంపొందిస్తోంది, దాని సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ (ఎస్ ఎం సీ సీ) ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తోంది. దాని విజయానికి నిదర్శనంగా 'ఎంప్లాయ్‌మెంట్ న్యూస్' (ఐ & బీ మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖ ప్రచురణ) ఎస్ & టీ కాలమ్ లో ఇప్పుడు ప్రముఖంగా ప్రదర్శించబడుతుంది. ఇది ప్రజలకు ముఖ్యంగా యువతకు సైన్స్‌ని వ్యాప్తి చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 'ఎంప్లాయ్‌మెంట్ న్యూస్'లో ఎస్ & టీ కాలమ్ ద్వారా ఉద్యోగార్ధులు కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగ సృష్టికర్తలుగా మారవచ్చు.
డా. కళైసెల్వి మాట్లాడుతూ, “సమగ్రమైన సాధనాలు మరియు అత్యాధునిక డేటా టెక్నాలజీలను ఉపయోగించి, సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ ఒక వినూత్న సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను లేదా పరివర్తన సాధనాలను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. శాస్త్రీయ రంగాలలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు సహకారాన్ని సులభతరం చేస్తూ పరిశోధన వ్యాప్తి ప్రయత్నాలను అభివృద్ధి చేస్తుంది. ”
డాక్టర్ కలైసెల్వి స్వస్తిక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించడం ద్వారా మరియు మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించడం ద్వారా సంస్థ యొక్క కార్యక్రమాల పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించారు. సైన్స్ కమ్యూనికేషన్ పట్ల సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ యొక్క తిరుగులేని నిబద్ధతను ఈ సంఘటన నొక్కి చెప్పింది. సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) క్రింద పనిచేస్తున్న ఒక ప్రధాన సంస్థ, ఇది సైన్స్ కమ్యూనికేషన్ మరియు సాక్ష్యం-ఆధారిత సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ (ఎస్ టి ఐ) పాలసీ రీసెర్చ్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్) మరియు సీఎస్ఐఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ (సీఎస్ఐఆర్-నిస్తాడ్స్) విలీనంతో 2021లో స్థాపించబడింది.
సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్) భారతదేశం యొక్క శాస్త్రీయంగా ధృవీకరించబడిన సాంప్రదాయ పరిజ్ఞానాన్ని స్వస్తిక్ (శాస్త్రీయంగా ధృవీకరించబడిన సామాజిక సాంప్రదాయ నాలెడ్జ్)గా బ్రాండ్ చేయబడిన సొసైటీ పర్యవేక్షణ కమిటీని సమావేశాన్ని మార్చి 21, 2024న మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించింది. ఈ సమావేశానికి సీఎస్ఐఆర్ & సెక్రటరీ డీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ (శ్రీమతి) ఎన్.కలైసెల్వి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ రంజన అగర్వాల్, సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ డైరెక్టర్, నిపుణులను స్వాగతించారు మరియు స్వస్తిక్ కార్యకలాపాలపై ఆమె పరిచయ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ ఎ. రఘు (డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ), డాక్టర్ సుభాసిస్ చౌదరి (డైరెక్టర్, ఐఐటి బాంబే), డాక్టర్ అనితా అగర్వాల్ (సీడ్ హెడ్ అండ్ స్టేట్ ఎస్ అండ్ టి ప్రోగ్రాం, డిఎస్‌టి), డాక్టర్ అనిల్ కుమార్ (ఏ డీ జీ, కోఆర్డినేషన్ ఐకార్) తో సహా పలువురు ప్రముఖ నిపుణులు సమావేశానికి హాజరయ్యారు.
కోఆర్డినేటర్ స్వస్తిక్ డాక్టర్ చారు లత స్వస్తిక్ కార్యకలాపాలు మరియు దాని డిజిటల్ పాదముద్రపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ఈ సమావేశంలో, స్వస్తిక్ కథలు: ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ త్రూ ది లెన్స్ ఆఫ్ సైన్స్ పుస్తకం యొక్క రెండవ సంపుటం మరియు సాంప్రదాయ నాలెడ్జ్ కమ్యూనికేషన్ & డిస్సెమినేషన్‌పై ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రత్యేక సంచిక కూడా విడుదలయ్యాయి. మానిటరింగ్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలను ప్రశంసించారు. వివిధ రంగాలలో భారతీయ సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి మరియు వ్యాప్తి చేయడానికి చర్యలను సూచించారు. సీఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సీ పీ ఆర్ శాస్త్రవేత్త డా.పరమానంద బర్మాన్ వందన సమర్పణ తో సమావేశం ముగిసింది.
***
(Release ID: 2016304)
Visitor Counter : 153