గనుల మంత్రిత్వ శాఖ
బెంగళూరులోని మా ‘రిమోట్ సెన్సింగ్ అండ్ ఏరియల్ సర్వేస్’ కార్యాలయంలో 80 శాతం సిబ్బందికి హిందీ భాషలో పనిచేయగల కనీస పరిజ్ఞానం ఉంది: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన
Posted On:
20 MAR 2024 6:39PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వశాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన బెంగళూరులోని రిమోట్ సెన్సింగ్.. ఏరియల్ సర్వేస్ కార్యాలయం 2024 మార్చి 20న ఒక ప్రకటన విడుదల చేసింది. అధికార (కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల కోసం ఉపయోగించే) భాషా నియమావళి-1976లోని 10(4) నిబంధన ప్రకారం- తమ సిబ్బందిలో 80 శాతం హిందీ భాషలో పనిచేయగల కనీస పరిజ్ఞానం సంపాదించి ప్రత్యేకతను చాటుకున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.
పైన పేర్కొన్న నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన లేదా ఉన్నత పరీక్షలో హిందీని ఒక పాఠ్యాంశంగా స్వీకరించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే హిందీలో పని చేయగల పరిజ్ఞానం గలవారుగా పరిగణిస్తారు. లేదా కేంద్ర ప్రభుత్వ హిందీ బోధన పథకం కింద నిర్వహించే ‘ప్రజ్ఞ’ పరీక్షలో ఉత్తీర్ణత లేదా ఏదైనా నిర్దిష్ట కేటగిరీ పోస్టుకు సంబంధించి ప్రభుత్వ నిర్దేశం మేరకు ఆ పథకం కింద ఏదైనా తక్కువస్థాయి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి; లేదా కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఇతర పరీక్ష; లేదా మరేదైనా నిర్దేశిత రూపంలో అలాంటి పరిజ్ఞానంపై ధ్రువీకరణ కలిగి ఉండాలి. రిమోట్ సెన్సింగ్-ఏరియల్ సర్వే కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇది పైన పేర్కొన్న 1976 నిబంధనల కింద దేశంలోని హిందీయేతర ప్రాంతంలోగల ‘సి’ విభాగంగా వర్గీకరించబడింది.
****
(Release ID: 2015877)
Visitor Counter : 84