ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
పీఐబీ నిజ నిర్ధరణ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వ నిజ నిర్ధరణ విభాగంగా ప్రకటించిన మైటీ
Posted On:
20 MAR 2024 8:27PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (మైటీ), 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ & డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021'ను (ఐటీ నిబంధనలు 2021) నవీకరించింది, దానిని 2023 ఏప్రిల్ 6న నోటిఫై చేసింది. వాటిలో నిజ నిర్ధరణ విభాగం గురించి వివరించింది:
…మధ్యవర్తి, తన నియమాలు & నిబంధనలు, గోప్యత విధానం, వినియోగదారు ఒప్పందం గురించి వినియోగదారుకు ఆంగ్లంలో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చిన ఏదైనా భాషలో తెలియజేయాలి. ప్రదర్శించడానికి, అప్‌లోడ్ చేయడానికి, సవరించడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి, నిల్వ చేయడానికి, నవీకరించడానికి లేదా పంచుకోవడానికి ఏదైనా సమాచారం ఈ కింది విధంగా ఉంటే (నిజాన్ని వెల్లడించడానికి స్వయంగా సహేతుకమైన ప్రయత్నాలను చేస్తుంది & తన కంప్యూటర్ వనరుల వినియోగదార్లను హోస్ట్ చేయకుండా చేస్తుంది) —.
(v) మూలం గురించి వినియోగదార్లను మోసగించేలా లేదా తప్పుదారి పట్టించేలా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించేలా లేదా అస్పష్టమైన లేదా అసత్యపూరిత లేదా అబద్ధపు స్వభావం కలిగిన సమాచారం [లేదా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి, మంత్రిత్వ శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ద్వారా నకిలీ లేదా తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేదిగా గుర్తించిన సమాచారం];
- కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖతో (ఎంఐబీ) సంప్రదింపుల తర్వాత, ఐటీ నిబంధనలు 2021లోని 3(1)(బి)(వి) నియమం ప్రకారం, 20.03.2024 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా, ఎంఐబీ ఆధ్వర్యంలోని 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో'కు (పీఐబీ) చెందిన నిజ నిర్ధరణ విభాగాన్ని (ఎఫ్‌సీయూ) కేంద్ర ప్రభుత్వ నిజ నిర్ధరణ విభాగంగా నోటిఫై చేసింది.
- 2019 నవంబర్‌లో పీఐబీ కింద ఏర్పాటైన ఎఫ్‌సీయూ, కఠినమైన వాస్తవ-తనిఖీ విధానం ద్వారా, ప్రభుత్వ విధానాలు, పథకాలు, నియమనిబంధనలు, కార్యక్రమాలు, చొరవలు మొదలైన వాటికి సంబంధించిన నకిలీ వార్తలను అడ్డుకోవడానికి సమర్థవంతంగా పని చేస్తోంది. పీఐబీ నిజ నిర్ధరణ విభాగం అపోహలు, పుకార్లు, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో చురుగ్గా పని చేస్తోంది, ప్రజలకు ఖచ్చితమైన & నమ్మదగిన సమాచారాన్ని అందిస్తోంది.
***
(Release ID: 2015876)
Visitor Counter : 150