రక్షణ మంత్రిత్వ శాఖ
మైసూరులో ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం మొట్టమొదటి సారిగా స్వదేశీంగా తయారు చేసిన 1500 హెచ్పీ ఇంజిన్ మొదటి టెస్ట్-ఫైరింగ్ చేపట్టిన బీఈఎంఎల్
పరీక్ష విజయవంతం కావడాన్ని భారత సైనిక సామర్థ్యాలను పెంపొందించే పరివర్తనాత్మక క్షణంగా పేర్కొన్న రక్షణ కార్యదర్శి
Posted On:
20 MAR 2024 5:00PM by PIB Hyderabad
మార్చి 20, 2024న తన మైసూరు కాంప్లెక్స్లోని బీఈఎంఎల్ ఇంజన్ విభాగంలో ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం భారతదేశం మొట్టమొదటిసారి స్వదేశీంగా తయారు చేసిన 1500 హార్స్పవర్ (HP) ఇంజిన్ని తొలిసారిగా టెస్ట్-ఫైరింగ్ జరిపింది. ఈ కార్యక్రమానికి రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే అధ్యక్షత వహించారు. ఈ ఘనత దేశం యొక్క రక్షణ సామర్థ్యాలలో కొత్త శకానికి నాంది పలికింది. సాంకేతిక నైపుణ్యాన్ని మరియు రక్షణ సాంకేతికతలలో స్వావలంబనకు నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 1500 హెచ్పీ ఇంజిన్ మిలిటరీ ప్రొపల్షన్ సిస్టమ్లలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. అధిక శక్తి-బరువు నిష్పత్తి, అధిక ఎత్తులు, ఉప-సున్నా ఉష్ణోగ్రతలు మరియు ఎడారి వాతావరణాలతో సహా తీవ్రమైన పరిస్థితులలో కార్యాచరణ చేపట్టేలా అత్యాధునిక లక్షణాలను కలిగి ఉంది. అధునాతన సాంకేతికతలతో కూడిన ఈ ఇంజన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక ఇంజన్లతో సమానంగా నిలుస్తుంది. టెస్ట్ సెల్ను ప్రారంభిస్తూ, రక్షణ కార్యదర్శి సాయుధ బలగాల సామర్థ్యాలను పెంపొందించే పరివర్తనాత్మక క్షణమని అభివర్ణించారు. బీఈఎంఎల్ సంస్థ సీఎండీ శ్రీ శంతను రాయ్ మాట్లాడుతూ.. ఈ క్లిష్ట రక్షణ పరిస్థితులలో దేశ అవసరాలను తీర్చడంలో ఈ కొత్త ఆవిష్కరణ నిబద్ధతను నొక్కిచెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి కీలక సహకారిగా బీఎంఈఎల్ నిలుస్తోందని అన్నారు. ఇలాంటి ప్రయోగాలు సంస్థ స్థానాన్ని ఈ సాఫల్యత పటిష్టతను చేకూర్చుతుందని పేర్కొన్నారు. 1500 హెచ్పీ ఇంజిన్ యొక్క మొదటి టెస్ట్-ఫైరింగ్.. టెక్నాలజీ స్థిరీకరణపై దృష్టి సారించి ఈ దిశగా జనరేషన్ వన్ పూర్తి కావడాన్ని సూచిస్తుంది. జనరేషన్ టూ, పోరాట వాహనాల పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డీఆర్డీఓ ప్రయోగశాలలో వివిధ ట్రయల్స్ కోసం బీఈఎంఎల్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయడాన్ని గురించి పర్యవేక్షిస్తుంది. వినియోగదారు (సైన్యం) పరీక్ష కోసం వాస్తవ వాహనాల్లో వాటి ఏకీకరణపైనా దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2025 మధ్యలో పూర్తవుతుంది. ఆగష్టు 2020లో ప్రారంభించబడిన ప్రాజెక్ట్, సకాలంలో పూర్తి చేయడం మరియు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా నిర్ధారిస్తూ ఐదు ప్రధాన మైలురాళ్లుగా సూక్ష్మంగా నిర్మితమైంది. బీఈఎంఎల్ బృందం యొక్క అసాధారణ ప్రయత్నాలను గుర్తించడానికి రక్షణ కార్యదర్శి 'వాల్ ఆఫ్ ఫేమ్'ని కూడా ప్రారంభించారు. ఇది దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలలో మైలురాళ్లను సాధించడంలో వారి సహకారాన్ని సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సీనియర్ సివిల్ మరియు సైనిక అధికారులు పరిశ్రమ భాగస్వాములు మరియు బీఈఎంఎల్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2015820)
Visitor Counter : 196