కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రేపటి సాగుః ఐఒటి & ఎఐల ద్వారా డిజిటల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అన్న అంశంపై ఐటియు/ ఎఫ్ ఎ ఒ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్న టిఇసి, డిఒటి & ఐసిఎఆర్
అనంతరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ - కృత్రిమ మేధ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఎటి) ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ (ఎఫ్‌జి-ఎ14ఎ)పై ఐటియు/ ఎఫ్ ఎఒ ఫోకస్ గ్రూప్ 9వ సమావేశం
Posted On:
17 MAR 2024 7:34PM by PIB Hyderabad
రేపటి సాగుః ఐఒటి & ఎఐల ద్వారా డిజిటల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అన్న అంశంపై ఐక్యరాజ్య సమితికి చెందిన, ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఒఎ) సహకారంతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటియు) ఒక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (డిఒటి) చెందిన టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్ (టిఇసి), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్), కేంద్ర వ్యవసాయ, రైతాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం (డిఎఆర్ఇ) కలిసి నిర్వహిస్తున్నాయి.
ఈ వర్క్‌షాప్ జాతీయ రాజధానిలోని ఇకార్ (ఐసిఎఆర్)కు చెందిన నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్ ఎఎస్‌సి - జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయం )లో 18 మార్చి 2024న జరుగనుంది. ఈ వర్క్‌షాప్ అనంతరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ - కృత్రిమ మేధ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఎటి) ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ (ఎఫ్‌జి-ఎ14ఎ)పై ఐటియు/ ఎఫ్ ఎఒ ఫోకస్ గ్రూప్ 9వ సమావేశం 19 మార్చి 2024న అదే ఆవరణలో జరుగనుంది.
అంతర్జాతీయ భాగస్వాములు సహా దాదాపు 200మంది ప్రతినిధులు ఇందులో పాలుపంచుకుంటారని అంచనా. వ్యవసాయంలో సంపూర్ణ పరివర్తనను తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నవ్యవసాయం 4.0గా తరచు ప్రస్తావనకు వచ్చే ఈ ఉద్భవిస్తున్న క్షేత్రంలో తమ అనుభవాలను వారు పంచుకోనున్నారు. ఇందులో ఐటియు సభ్య దేశాలు, రంగ సభ్యులు, అసోసియేట్లు, ఐటియు విద్యావేత్తలు, ఐటియులో సభ్యులైన దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయ సంస్థలు హైబ్రిడ్ పద్ధతిలో ఇందులో పాల్గొనేందుకు అందుబాటులో ఉంటుంది.
సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు పెరుగుతున్న ప్రపంచ జనాభా, పర్యావరణ మార్పులు సవాళ్ళు విసురుతున్న నేపథ్యంలో స్థిరమైన ఆహారోత్పత్తికి సాంకేతికతను ఉపయోగించడం తప్పనిసరి అవుతున్నది. ఈ వర్క్‌షాప్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / మెషీన్ లెర్నింగ్ (ఎఐ/ ఎంఎల్), అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యుఎవిలు- మానవరహిత వాయుగత వాహనాలు - డ్రోన్ల వంటివి), ఇతర అత్యాధునిక సాంకేతికతలను వ్యవసాయంలో పంటకోతల నిర్వహణ నుంచి మార్కెటింగ్ సహా ఉత్పత్తి నుంచి వినిమయం వరకూ విలువ గొలుసు వ్యాప్తంగా అనువర్తింప చేసేందుకు అవకాశాలను అన్వేషించనున్నారు. రైతులకు వాస్తవ సమయ డేటా, ప్రెడిక్టివ్ అనలెటిక్స్, ఆచరణీయ అంతర్దృష్టులను రైతుకు అందించడం ద్వారా వ్యవసాయాన్ని ఈ సాంకేతికతలు ఎలా విప్లవీకరించగలదనే విషయంపై ఈ వర్క్‌షాప్ పరిశోధించనుంది.
అంతేకాకుండా, ఈ వర్కషాప్ సందర్భంగా, వ్యవసాయాన్ని విప్లవీకరించడంః వ్యవసాయ డిజిటల్ పరివర్తనపై సాంకేతిక నివేదికను విడుదల చేయనున్నారు. ఈ నివేదిక వ్యవసాయ రంగంలోని భాగస్వాములకు ఆహార ఉత్పత్తిలో స్థిరత్వం, సామర్ధ్యం, స్థితిస్తాపకతని ముందుకు తీసుకువెళ్ళేందుకు సాంకేతిక శక్తిని ఉపయోగించుకోవడంపై నిర్ణయాలు తీసుకునేందుకు మార్గదర్శనం చేసే ఒక ఉల్లేఖన పత్రంలా ఉపయోగపడనుంది.
***
(Release ID: 2015354)
Visitor Counter : 184