నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

38 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న ఐఆర్‌ఇడిఎ


వరుసగా మూడోసంవత్సరం అద్భుత రేటింగ్‌ సాధించిన ఐఆర్‌ఇడిఎ: సి.ఎం.డి

Posted On: 12 MAR 2024 11:49AM by PIB Hyderabad

భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్‌ (ఐఆర్‌ఇడిఎ) 2024 మార్చి 11న 38 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగాగత 37 సంవత్సరాలలో సంస్థ పురోగతిని సమీక్షించుకోవడంఅది సాధించిన విజయాలను నెమరు వేసుకోవడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. అంకితభావం కలిగిన సంస్థ ఉద్యోగులుస్టేక్‌హోల్డర్లువ్యాపార భాగస్వాములకు కృతజ్ఞతలు తెలుపుకునే సమయం ఇది. వీరందరి సమష్టి సహకారం మద్దతుతో ఐఆర్‌ఇడిఎ దేశంలో హరిత ఫైనాన్స్‌ రంగంలో అతి పెద్ద సంస్థగా అవతరించింది.
ఐఆర్‌ఇడిఎ 38 వ వ్యవస్థాపక దినోత్సవంలో సంస్థ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీ ప్రదీప్‌ కుమార్‌ దాస్‌డైరక్టర్‌ (ఫైనాన్స్‌ª డాక్టర్‌ బిజయ్‌ కుమార్‌ మొహంతిఛీఫ్‌ విజిలెన్స్‌ అధికారి అజయ్‌కుమార్‌ సమానితదితరులు పాల్గొన్నారు. వీరు సంస్థ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ సంస్థ సాధించిన విజయాలుభవిష్యత్‌ ప్రణాళికల గురించి ప్రస్తావించారు.

సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ సి.ఎం.డి శ్రీ ప్రదీప్‌ కుమార్ దాస్‌ తమ సంతోషం వ్యక్తం చేస్తూవ్యవస్థాపక దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. అలాగే సంస్థముందున్న సవాళ్లుభవిష్యత్‌ ప్రణాళికలను పేర్కొన్నారు. ఇండియా ఇంధన పరివర్తనలో ఐఆర్‌ఇడిఎ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. 

ఇండియా ఇంధన పరివర్తన కు ఆర్ధిక సహాయం అందించడంలో ఐ.ఆర్.డి.ఎ. కీలక  పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యేకించి ఈ సంస్థ జాతీయ ఇంధన లక్ష్యాలను నెరవేర్చడంలోవాతావరణ కార్యాచరణలోసుస్థిరాభివృద్దిలో కీలక పాత్ర వహిస్తున్నదన్నారు.

ఐఆర్ఇడిఎ సంస్థ, 2022–23 సంవత్సరానికి నూతనపునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం విషయంలో అద్భుత ఫలితాలు సాధించిందన్నారు.తమ సంస్థ వరుసగా మూడవ ఆర్ధిక సంవత్సరంలో 93.50 స్కోరు సాధించిందనితుది రేటింగ్ ఎక్సలెంట్ ను పొందిందని తెలిపారు. ఇదుకు సంస్థ  సిబ్బంది అంకితభావంకష్టించి పనిచేయడం,అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేయడం కారణమని ఆయన తెలిపారు. ఐఆర్ఇడిఎ వారి రిటైల్ డివిజన్ను ప్రారంభించడం గురించి సిఎండి ప్రస్తావించారు. ఇది ఇంటి పైకప్పున సౌర   పలకలు ఏర్పాటుచేసుకునేందుకు రుణం పొందేవారికిప్రధానమంత్రి కుసుమ్ పథకం వారికి ఉపయోగపడుతుందన్నారు. కంపెనీ వృద్ధికి ఈ విభాగం ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు.

ఆవిష్కరణలు తమ కీలక వ్యూహం అంటూ సి.ఎం.డికొత్త ఫైనాన్షియల్ ప్రాడక్ట్లను ప్రవేశపెట్టడంతోపాటు నూతన హరిత సాంకేతికతలుకన్సార్టియం ఫైనాన్సింగ్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్టు తెలిపారు.

ఐఆర్ఇడిఎ గత మూడున్నర సంవత్సరాలుగా సాధించిన విజయాలపట్ల సిఎండి సంతృప్తి వ్యక్తంచేశారు.రుణ  పోర్టుఫోలియోలో అద్భుత వృద్ధి ఉందనిక్రెడిట్   రేటింగ్ పెరిగిందనిస్టాక్ ఎక్సేంజ్లలో లిస్టింగ్ జరిగడం  చరిత్రాత్మకమనిషెడ్యూలు బి నుంచి షెడ్యూలు ఎ స్థాయికి ఎదిగామనిఆర్.బి.ఐ నుంచి మౌలిక  సదుపాయాల ఫైనాన్స్ (ఐఎఫ్సి) కంపెనీ స్థాయికి ఎదిగామని తెలిపారు.ప్రస్తుతం మినీ రత్ననుంచి నవరత్న స్థాయికి ఎదిగేదశలో ఉన్నామన్నారు. వైవిధ్యతతో కూడిన వివిధ రంగాలలోకి విస్తరణకొత్త వ్యాపారాలలోకి  అడుగుపెట్టడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. గుజరాత్లోని జి.ఐ.ఎఫ్.టి సిటీలో పూర్తి సబ్సిడరీ సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సి) ను ఏర్పాటు చేసే అంశాన్నిపరిశీలిస్తున్నట్టు తెలిపారు.

సంస్థ సాధించిన విజయాలను స్వాగతిస్తూసంస్థ పనితీరులో ఉన్నతప్రమాణాలు పాటించేందుకుకస్టమర్ సంతృప్తి మేరకు పనిచేసేందుకు కృషి చేయాలని శ్రీ దాస్ సంస్థ సిబ్బందికి పిలుపునిచ్చారు.ఐఆర్ఇడిఎ ఇంధన పరివర్తనలో తన   నాయకత్వవ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్ వృద్ధికి దార్శనిక దృష్టిని ఆయన ప్రస్తావించారు.పునరుత్పాదక ఇంధన రంగంలో అపార అవకాశాలగురించి ఆయన తెలియజేశారు.డిజిటలైజేషన్ప్రాసెస్ ఆటోమేషన్,ద్వారా రుణఖర్చును తగ్గించడంకార్యనిర్వహణ సామర్ధ్యాన్ని పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యల గురించి శ్రీ దాస్ వివరించారు.కస్టమర్ కేంద్రిత విధానాలుఅధునాతన   సాంకేతికతను  అందిపుచ్చుకోవడానికి ఐఆర్ఇడిఎ కట్టుబడి ఉందని కూడా ఆయన తెలిపారు.

మరింత సమర్థత దిశగా సాంస్కృతిక పరివర్తనఉద్యోగులు  మరింత బాధ్యతతో పనిచేయడంమహిళాసాధికారత గురించి ప్రస్తావించారు. ప్రతి నలుగురు సిబ్బందిలో ఒకరు మహిళ అని వీరిలో ఎంతో మంది ఆయా విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంపై ఆలోచనల దృష్టి కోణంలో మార్పు తీసుకురావడంలో ఐఆర్ఇడిఎ కీలక పాత్ర గురించి ప్రస్తావించారు. సంస్థ యాజమాన్యం  ముఖాముఖి కమ్యూనికేషన్ ను క్రియాశీలంగా ముందుకు తీసుకువెళుతుందనిఉద్యోగులురుణగ్రహీతల సమస్యలను వారితో చర్చించి పరిష్కరిస్తోందని అలాగే వివిధ వర్గాల అభిప్రాయాలను ,స్పందనలను తెలుసుకుని సంస్థ పనితీరును మరింత మెరుగు పరుస్తుననదని ఫలితంగా ఇటీవలి సంవత్సరాలలో సంస్థ అద్భుత పలితాలు సాధించిందని తెలిపారు.

సంస్థ ఫైనాన్స్ డైరక్టర్ డాక్టర్ బిజయ్ కుమార్ మొహంతీ ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ అజయ్ కుమార్ సహాని తదితరులు   ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. కంపెనీ సాధించిన వియాలను ఆవిష్కరణలనుసంస్థ అనుసరిస్తున్న విలువలతో కూడిన వ్యాపార విధానాలను వివరించారు.

కార్యక్రమ ముగింపులో సంస్థ సి.ఎం.డి ఐఆర్ఇడిఎకు ఉజ్వల భవిష్యత్తు ఉండగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. గొప్ప దార్శనికతతగినవ్యూహంవనరులులక్ష్యాలను సాధించచచగల బృందం తమకు  ఉన్నాయన్నారు. టీమ్ వర్క్ ప్రాధాన్యతనుకస్టమర్ పై దృష్టిసవాళ్లను అధిగమించడంలో సామాజిక దృష్టివిజయాలు సాధించడంలో ఎప్పటికప్పుడు నూతన శిఖరాలను అందుకోవడం వంటి వాటిగురించి సిఎండి ప్రస్తావించారు.

****



(Release ID: 2014878) Visitor Counter : 131