యు పి ఎస్ సి
కేంద్ర పారిశ్రాహిక భద్రతాదళం అసిస్టెంట్ కమాండెంట్ (ఎగ్జిక్యుటివ్)లిమిటెడ్ డిపార్టమెంట్ పోటీ పరీక్ష ,2023
Posted On:
13 MAR 2024 6:13PM by PIB Hyderabad
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అసిస్టెంట్ కమాండెంట్(ఎగ్జిక్యుటివ్)లిమిటెడ్ డిపార్టమెంటల్ పాటీ పరిక్ష 2023 ను కేంద్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ 01.10.2023న నిర్వహించింది. ఇంటర్వ్యూలు, వ్యక్తిక్త్వ వికాస పరీక్షలు 26.02.2024 నుంచి 07.03. 2024 వరకు జరిగాయి. మెరిట్ ప్రాతిపదికన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో అసిస్టెంట్ కమాండెంట్స్ (ఎగ్జిక్యుటివ్)లుగా నియామకానికి ఎంపికైన వారి జాబితా కింద ఇవ్వబడింది.
వివిధ కేటగిరీల కింద నియామక ఉత్తర్వులకోసం సిఫార్సుచేయబడిన వారు కింది విధంగా ఉన్నారు.
జనరల్
|
ఎస్సి.
|
ఎస్టి
|
Total
|
24
|
04
|
01
|
29
|
పరీక్ష నిబంధనలు, ఖాళీల ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడతారు. ప్రభుత్వం పేర్కొన్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
జనరల్
|
ఎస్.సి.
|
ఎస్.టి
|
Total
|
24
|
04
|
01
|
29
|
ఎంపికైన ,నియామకానికి సిఫార్సు చేయబడిన అభ్యర్థుల ఎంపిక ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ (సి) నెంబర్లు 5877/2022 అలాగే 5832/2022 కు సంబంధించిన తుది తీర్పునకు లోబడి ఉంటాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, క్యాంపస్లో పరీక్షాకేంద్రానికి దగ్గరలో పెసిలిటేషన్ కౌంటర్ ఉంది. అభ్యర్థులు తమ పరీక్షకు, రిక్రూట్మెంట్కు సంబంధించిన ఏదైనా సమాచారం, లేదా వివరణ కోసం కార్యలయ అన్ని పనిదినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య వ్యక్తిగతంగా లేదా టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. టెలిఫోన్ ద్వారా సంప్రదించదలచుకున్నవారు 011–23385271 లేదా 23381125 నెంబర్లను సంప్రదించవచ్చు. అలాగే ఈ పరీక్షా ఫలితాలు కమిషన్ వెబ్ సైట్www.upsc.gov.in.లో అందుబాటులో ఉన్నాయి.
***
(Release ID: 2014444)
Visitor Counter : 104