సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైక‌ల్యం క‌లిగిన వ్య‌క్తుల‌కు ప్రాప్య‌త‌ను పెంచేందుకు డిఇపిడ‌బ్ల్యుడి, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ స‌హ‌కారం

Posted On: 13 MAR 2024 4:49PM by PIB Hyderabad

బ‌హిరంగ ప్ర‌దేశాలు, భ‌వ‌నాల‌లో శారీర‌క వైక‌ల్యాలు క‌లిగిన వ్య‌క్తుల కోసం విక‌లాంగుల సాధికార‌త విభాగం (డిఇపిడ‌బ్ల్యుడి), చేరిక‌ను, ప్రాప్య‌త‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ (సిఒఎ)తో ఒక వినూత్న స‌హ‌కారాన్ని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల హ‌ర్షాన్ని వ్య‌క్తం చేసింది. 
డిఇపిడ‌బ్ల్యుడి, సిఒఎల మ‌ధ్య సంత‌కాలు చేసిన అవ‌గాహ‌నా ప‌త్రం(ఎంఒయు) వ‌ర్క్‌షాపులు, సెమినార్లు, శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ ప‌ట్ల ఉమ్మ‌డి నిబ‌ద్ధ‌త‌ను సూచిస్తుంది. ఈ కార్య‌క్ర‌మాలలో బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ పాఠ్యాంశాల్లో త‌ప్ప‌నిస‌రి కోర్సు మాడ్యూళ్ళ‌ను చేర్చ‌డం, పిడ‌బ్ల్యుడీల కోసం అందుబాటులో ఉండే వాతావ‌ర‌ణాన్ని సృష్టంచ‌డం గురించి అవ‌గాహ‌న పెంపొందించ‌డం వంటివి ఉంటాయి. 
సార్వ‌త్ర‌క ప్రాప్య‌త‌పై మాస్ట‌ర్ ట్రైన‌ర్ల స‌ర్టిఫైడ్ శిక్ష‌ణ‌ను ఈ భాగ‌స్వామ్యంలో భాగంగా, సిఒఎ, డిఇపిడ‌బ్ల్యుడి ఇటీవ‌లే పూర్తి చేశాయి. ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మ ప్రాథ‌మిక ల‌క్ష్యం, నిర్మించిన వాతావ‌ర‌ణానికి ప్రాప్య‌త ఆడిట‌ర్లుగా ఆర్కిటెక్ట్‌లు, విద్యావేత్త‌లు త‌దిత‌రులు సేవ‌లందించేందుకు తోడ్పాటునందిస్తుంది. 
సార్వ‌త్రిక ప్రాప్య‌త‌పై మాస్ట‌ర్ ట్రైన‌ర్ల‌కు శిక్ష‌ణ‌ను రెండు ద‌శ‌ల‌లో నిర్వ‌హించారు. మొద‌టి ద‌శ శిక్ష‌ణ సెప్టెంబ‌ర్ 2023లో ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించ‌గా, రెండ‌వ ద‌శ మార్చి 11 &12, 2024లో పూర్తి చేశారు. ఇందులో పాల్గొన్న వారి  ఆచ‌ర‌ణాత్మ‌క నైపుణ్యాలు, అవ‌గాహ‌న‌ను పెంపొందించేందుకు భ‌వ‌నాల ప్రాప్య‌త ఆడిట్‌లు స‌హా ప్ర‌యోగాత్మ‌క అభ్యాసాల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. 
ఈ స‌హ‌కార‌పు ప్రాముఖ్య‌త‌ను ప‌ట్టి చూపుతూ, మాస్ట‌ర్ ట్రైన‌ర్ల‌ను,ప్రాప్య‌త‌ను ప్రోత్స‌హించ‌డంలో త‌మ అమూల్య‌మైన సేవ‌ల‌ను అందించినందుకు ప్ర‌ముఖ వ‌క్త‌ల‌ను డిఇపిడ‌బ్బ్యుడి కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ అగ‌ర్వాల్‌, సిఒఎ అధ్య‌క్ష‌డు అభ‌య్ పురోహిత్‌ను ఉమ్మ‌డిగా స‌త్క‌రించారు. 

***


(Release ID: 2014432) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi