సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
హైదరాబాద్‌లోని జాతీయ ఎంఎస్ఎంఇ (ఎన్ఐ-ఎంఎస్ఎంఇ) సంస్థలో ఎంఎస్ఎంఇ ఎనేబుల్మెంట్ ఆఫ్ టెక్నాలజీ (సిఒఎంఇటి) కోసం ఎగుమతుల పెంపు & అనుభవ కేంద్రం (ఇఎఇసి)ని, ఉత్కృష్ట కేంద్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపిన శ్రీ నారాయణ్ రాణె
Posted On:
13 MAR 2024 5:47PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఇ (ఎన్ఐ- ఎంఎస్ఎంఇ) 16వ పాలక మండలి, 15వ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి శ్రీ నారాయణ్ రాణె అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి హైదరాబాద్‌లోని ఎన్ఐ-ఎంఎస్ఎంఇలో ఉద్యమ్ాలోక్ లో దిగువన పేర్కొన్న కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదాన్ని తెలిపారుః
1) ఎగుమతుల పెంపు & అనుభవ కేంద్రం (ఇఎఇసి) ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా ఉండేందుకు, ఎగుమతులను పెంచుకునే దిశగా ఎంఎస్ఎంఇలకు తోడ్పాటును అందిస్తుంది. అంతేకాకుండా, ఇఎఇసి మార్కెట్ పరిశోధన, లాజిస్టిక్స్ పరిష్కారాలు, డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ, నిధుల ప్రాప్యత, విద్యా- పారిశ్రామిక సమన్వయ ప్రత్యేక సమ్మిళితం ద్వారా సాఫీ అయిన ప్రపంచ మార్కెట్ వేదిక సహా సమగ్ర సహాయక సేవలను కూడా అందిస్తుంది.
2) ఎంఎస్ఎంఇలకు బహుశాస్త్రాంతర, నమూనా కేంద్రీకృత సాంకేతికతలతో వారు ప్రపంచ వ్యాపారులుగా ఉండేందుకు వీలుగా హైదరాబాద్‌లోని ఎన్-ఎంఎస్ఎంఇలో ఐఐటి హైదరాబాద్ సహకారంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎంఎస్ఎంఇ ఎనేబుల్మెంట్ ఆఫ్ టెక్నాలజీ (సిఒఎంఇటి - ఎంఎస్ఎంఇలకు సాంకేతిక తోడ్పాటు కోసంఉత్కృష్ట కేంద్రాల) ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ సాంకేతిక అభివృద్ధితో ప్రపంచ పోటీదారులుగా మారేందుకు సహాయపడుతుంది. ఈ ప్రతిపాదిత కేంద్రం సాంకేతిక అభివృద్ధి, పరీక్ష, ప్రదర్శన & ఎంఎస్ఎంఇలకు సర్టిఫికేషన్‌కు, డిజిటల్ కేటలాగింగ్‌కు, సాంకేతికతలకు బి2బి మార్కెట్ వేదికగా వ్యవహరిస్తుంది. ఇది ఉనికిలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఇంధన సమర్ధవంతమైన సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఎంఎస్ఎంఇలకు సౌలభ్యతను కల్పిస్తుంది. ఇది అధునాతన సాంకేతికతలపై ఎంఎస్ఎంఇలకు అవగాహన కల్పించడమే కాక, శిక్షణను, నైపుణ్యాభివృద్ధిని అందించి, వ్యవస్థాపక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది.
***
(Release ID: 2014429)
Visitor Counter : 119