ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
మానవవనరుల నైపుణ్యాలను పెంపొందించడానికి, ఉపాధిని ప్రోత్సహించడానికి, నైపుణ్య అంతరాలను పరిష్కరించడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి భారత్ కి చెందిన నీలిట్, ఈజిప్టు ఐటిఐ మధ్య కుదిరిన ఒప్పందం
Posted On:
12 MAR 2024 9:00PM by PIB Hyderabad
మానవ వనరుల నైపుణ్యాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం, నైపుణ్యాల అంతరాలను పరిష్కరించడం మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం కోసం పరస్పర సహకారం అందించుకునే దిశగా ఈజిప్ట్ - భారత్ ఒప్పందం చేసుకున్నాయి. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి గల సైంటిఫిక్ సొసైటీ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్), అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) మధ్య 12 మార్చి, 2024న ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈజిప్ట్‌లోని కైరోలో ఆ దేశ కమ్యూనికేషన్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి డా. అమ్ర్ తలాత్, భారత రాయబారి శ్రీ అజిత్ గుప్తే సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు.
సంతకం చేసిన వారిలో నీలిట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎం. త్రిపాఠి, ఈజిప్టు ఐటీఐ చైర్‌వుమన్ డాక్టర్ హెబా సలేహ్ ఉన్నారు. ఐఈసిటి డొమైన్‌లో సహకారం ప్రోత్సహించడానికి ఈ ఎమ్ఒయు ఉద్దేశించబడింది.
సహకారంలో భాగంగా ఇరు దేశాలు పలు కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతాయి. పాఠ్యాంశాలు, శిక్షణా సామగ్రి అభివృద్ధి, శిక్షకులు, నిపుణుల మార్పిడి, ధృవీకరణ పరస్పర గుర్తింపు ఉంటుంది. వర్చువల్ ల్యాబ్స్ సౌకర్యాన్ని పంచుకోవడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిప్లొమాలు/ ఈజిప్ట్ నామినేట్ చేసిన ఇంటర్న్‌లకు టెక్నికల్ సర్టిఫికేట్‌లను అందించడం, ఈజిప్ట్, .టెక్/ ఈజిప్షియన్ విద్యార్థులకు ఎం.టెక్ ప్రోగ్రామ్‌లు, నీలిట్ వర్చువల్ అకాడమీ ద్వారా ఈజిప్షియన్ విద్యార్థులకు ఉచిత డిజిటల్ అక్షరాస్యత ఫ్లాగ్‌షిప్ కోర్సు మొదలైనవి ఈ ఒప్పందం ప్రకారం నిర్వహిస్తారు.
***
(Release ID: 2014318)
Visitor Counter : 115