గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సహకార భాగస్వామ్యాల ద్వారా గిరిజనుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి యూఎన్‌ ఏజెన్సీలతో పాటు ఇతర ప్రపంచ సంస్థలతో సమావేశాన్ని నిర్వహించిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Posted On: 12 MAR 2024 10:05PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విభు నాయర్ నేతృత్వంలో ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో యూఎన్‌ ఏజెన్సీలు మరియు ఇతర ప్రపంచ సంస్థలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. " విక్షిత్ భారత్ @2047 - యాక్సిలరేటింగ్ ట్రైబల్ డెవలప్‌మెంట్: కొలాబరేటివ్ గ్లోబల్ పార్టనర్‌షిప్స్"  పేరుతో జరిగిన ఈ కార్యక్రమం సర్వీస్ డెలివరీ, ట్రైబల్ హెల్త్, ట్రైబల్ ఎడ్యుకేషన్, ట్రైబల్ లైవ్‌లీహుడ్, ట్రైబల్ సోషియో-కల్చరల్ హెరిటేజ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాలలో భాగస్వామ్యాన్ని ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

 
image.png


గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి.ఆర్‌. జయ తన స్వాగత ప్రసంగంలో సమావేశ ఎజెండాను వివరించారు.గిరిజన వ్యవహారాలు మరియు గిరిజన అభివృద్ధి రంగంలో యూఎన్‌ మరియు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని అన్వేషించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

 
image.png


గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ ఏజెన్సీల మధ్య వివరించిన నేపథ్య రంగాలలో సంభావ్య సహకారాలపై ఈ సమావేశంలో సానుకూల చర్చలు జరిగాయి. భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను శ్రీ విభు నాయర్ వివరించారు మరియు దేశ అభివృద్ధిలో గిరిజన సంఘాల పాత్రను నొక్కి చెప్పారు.

 
image.png
image.png


ఈ కార్యక్రమానికి స‌హ‌కారం అందించి విజ‌యవంతం చేయాల‌ని భాగ‌స్వామ్యదారుల‌ను కోరుతూ శ్రీ విభు నాయ‌ర్ స‌మావేశాన్ని ముగించారు. ఐదు థీమాటిక్ రంగాలలో చర్చలు మరియు భాగస్వామ్యం పెరగవలసిన అవసరాన్ని వివరించారు.  రాష్ట్రాలలో ఒకే విధమైన ప్రాంతాలలో సంస్థల మధ్య సహకారం మరియు సమన్వయాన్ని తీసుకురావడానికి కార్యకలాపాల గుర్తింపు మరియు విస్తరణకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ గిరిజన విజయాలను ప్రదర్శించడం మరియు ఉత్తమ ప్రపంచ అభ్యాసాల నుండి నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేశారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ,యూఎన్‌ ఏజెన్సీలు మరియు అంతర్జాతీయ ఫౌండేషన్‌ల మధ్య సంభాషణను సులభతరం చేయడం ద్వారా గిరిజన అభివృద్ధిని పెంపొందించడానికి వివిధ రంగాలలో సంభావ్య సహకారాలు మరియు భాగస్వామ్యాలను అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ అంశంలో చర్యలు చేపట్టాల్సిన  కీలక రంగాలను గుర్తించడం, సాధ్యమయ్యే ప్రాజెక్టులు మరియు చొరవలను చర్చించడం మరియు గిరిజన సంఘాలకు స్థిరమైన ఫలితాలను నిర్ధారించడానికి సహకారం మరియు భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

 
image.png


ఈ కార్యక్రమంలో యూనిసెఫ్‌,యూనెప్‌,డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచబ్యాంకు,యూఎన్‌డిపి,యూఎన్‌ హాబిటాట్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ వాలంటీర్, యూఎన్‌ ఉమెన్,యూనెస్కో,జైకా,ఐఎఫ్‌ఏడి,ఐఎల్‌ఓ,డబ్ల్యూఎస్‌పి వంటి ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు/గ్లోబల్ సంస్థలు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో మిస్టర్‌. శోంబి షార్ప్, భారతదేశంలోని యూఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్; శ్రీమతి. పేడెన్, డిప్యూటీ హెడ్ ఆఫ్ కంట్రీ ఆఫీస్, డబ్ల్యూహెచ్‌ఓ; శ్రీమతి కైట్లిన్ వీసెన్, కంట్రీ హెడ్, యూఎన్‌డిపి; మిస్టర్‌. ఆగస్టే టానో కౌమే, కంట్రీ డైరెక్టర్, ప్రపంచ బ్యాంక్; మిస్టర్‌. స్టీవ్ హో యున్ జియోంగ్, డిప్యూటీ కంట్రీ డైరెక్టర్, ఏడిబి; మిస్టర్ అర్జన్ డి వాగ్ట్, డిప్యూటీ రిప్రజెంటేటివ్ ప్రోగ్రామ్ - ఓఐసీ ప్రతినిధి, యూనిసెఫ్‌; మిస్టర్ ఉలక్ డెమిరాగ్, డైరెక్టర్, ఐఎఫ్‌ఏడి మరియు అనేక ఇతర ప్రతినిధులు తమ సంస్థల అనుభవాలను పంచుకున్నారు.

 
123.jpg
***


(Release ID: 2014303) Visitor Counter : 67


Read this release in: English , Urdu , Hindi