కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గ్రామీణ భారతదేశం డిజిటల్ సాధికారతకు ముందడుగు : యుఎస్ఓఎఫ్, ప్రసారభారతి, ఓ ఎన్ డి సి మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం
Posted On:
12 MAR 2024 5:49PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా సరసమైన, అందుబాటులో ఉండే డిజిటల్ సేవలను విస్తరించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఈ మేరకు డిజిటల్, కమ్యూనికేషన్ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆధ్వర్యంలోని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఓఎఫ్), ప్రసార భారతి (సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందినది), డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్‌వర్క్ (కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ చొరవ) త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. యుఎస్ఓఎఫ్ కింద భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తో గ్రామీణ భారతదేశంతో అనుసంధానమైన ఓటిటి, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం ఎంఓయూ లక్ష్యం. డిజిటల్ ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించాలనే ప్రధాన మంత్రి దార్శనికతతో, అచంచలమైన నిబద్ధత ఈ నిజమైన విశిష్ట సహకారాన్ని సమీకృతం చేస్తుంది. గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి కనెక్టివిటీ, కంటెంట్,వాణిజ్యం కీలక పాత్ర పోషిస్తున్నాయి.
సెక్రటరీ (టెలికాం) డాక్టర్ నీరజ్ మిట్టల్ సమక్షంలో యుఎస్ఓఎఫ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ నీరజ్ వర్మ, ; ఓ ఎన్ డి సి ఎండీ, సీఈఓ శ్రీ టి. కోశి, ప్రసార భారతి, ప్లాట్‌ఫారమ్‌లు ఏడిజి శ్రీ ఏకే ఝా, డాట్ జాయింట్ సెక్రటరీ శ్రీ సునీల్ కుమార్ వర్మ సంతకాలు చేశారు.
దేశంలోని గ్రామ పంచాయతీలు, గ్రామాలలో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ కనెక్షన్‌లను ప్రారంభించడంలో యుఎస్ఓఎఫ్ కీలకపాత్ర పోషించింది. ఈ అవగాహనా ఒప్పందము గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సమర్థవంతమైన, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిర్ధారిస్తుంది, అయితే యుఎస్ఓఎఫ్ తుది వినియోగదారుల మధ్య లీనియర్ ఛానెల్‌లు, లైవ్ టీవీ మరియు ఆన్-డిమాండ్ కంటెంట్‌తో సహా కలిపి మిళితం చేసిన ప్రసార భారతి ఓటిటిని సేవల ద్వారా ప్రసారం అవుతుంది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రసార సేవ విభాగమైన, ప్రసార భారతి, తనకున్న అసమానమైన కంటెంట్, వినియోగదారుల చేరువ, బ్రాండ్ రీకాల్‌తో, దాని ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమయ్యే కంటెంట్ కు మూలంగా ఉంది సేవలను అందిస్తుంది. అదనంగా, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అగ్రగామిగా ఉన్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్ డిసి), ఉత్పత్తులు, సేవల్లో డిజిటల్ వాణిజ్యాన్ని ప్రారంభించడంలో సాంకేతిక నైపుణ్యం, అవసరమైన విధాన చట్రాన్ని అందిస్తుంది. విద్య, ఆరోగ్యం, శిక్షణ, క్రెడిట్, బీమా, వ్యవసాయం వంటి మరిన్ని సేవలను కవర్ చేయడానికి దీనిని ఇంకా విస్తరించడం జరుగుతుంది.
***
(Release ID: 2013990)
Visitor Counter : 136