భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో టీపీజీ గ్రోత్ వీఎస్ఎఫ్ మార్కెట్స్ పీటీఈ మరియు వేవర్లీ పీటీఈ లిమిటెడ్ సంస్థలు ఏషియన్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ పీటీఈ ద్వారా వాటాలను కొనేందుకు సీసీఐ అనుమతి
Posted On:
12 MAR 2024 8:34PM by PIB Hyderabad
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో టీపీజీ గ్రోత్ వీఎస్ఎఫ్ మార్కెట్స్ పీటీఈ మరియు వేవర్లీ పీటీఈ లిమిటెడ్ సంస్థలు ఏషియన్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ పీటీఈ ద్వారా వాటాలను కొనేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతి జారీ చేసింది. ప్రతిపాదిత కలయిక ఆసియా హెల్త్కేర్ హోల్డింగ్స్ పీటీఈలో (ఎ) తాజా రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను (కొత్త ఆర్పీఎస్ల) టీపీజీ గ్రోత్ వీఎస్ఎఫ్ మార్కెట్స్ పీటీఈ మరియు వేవర్లీ పీటీఈ లిమిటెడ్ (వేవర్లు) (పార్ట్-1), మరియు (బి) ఎ.హెచ్.హెచ్. (పార్ట్ II) ద్వారా ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎ.ఐ.ఎన్.యు.)లో మెజారిటీ వాటాను పొందడానికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించినది. గ్రోత్ వి అనేది ఇన్వెష్ట్మెంట్ ఫండ్, ఇది అంతిమంగా టీపీజీ ఐఎన్సీ. (టీపీజీ)చే నిర్వహించబడుతుంది నియంత్రించబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్త, విభిన్నసంస్థలలో పెట్టుబడులు కలిగిన పెట్టుబడి సంస్థ. టీపీజీ అనేది టీపీజీ గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ, ఇది కొనుగోలు/నియంత్రణ పరిస్థితులు, వృద్ధి & సాంకేతిక పెట్టుబడులు మరియు ఆర్థిక సేవలు, సాంకేతికత, వినియోగదారు, ప్రయాణం, మీడియా వంటి బహుళ రంగాలలో పెట్టుబడి పెట్టడం (వాతావరణంతో సహా) వంటి బహుళ వ్యూహాల ద్వారా నిర్వహించబడుతుంది. రియల్ ఎస్టేట్ మరియు ఆరోగ్య సంరక్షణలో నిమగ్రమైన సంస్థ. టీపీజీ గ్రూప్ న్యూక్వెస్ట్ క్యాపిటల్లో నియంత్రణ వాటాను కలిగి ఉంది, ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రావెల్ మరియు రియల్ ఎస్టేట్ వంటి బహుళ రంగాలలో పెట్టుబడులను కలిగి ఉన్న మరొక ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి సంస్థ. వేవర్లీ అనేది లాత్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ, ఇది పూర్తిగా జీఐసీ (వెంచర్స్) కి చెందినది. వేవర్లీ అనేది సింగపూర్లోని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నిర్వహించబడే స్పెషల్ పర్పస్ వెహికల్ ఇది జీఐసీ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడే పెట్టుబడి హోల్డింగ్ కంపెనీల సమూహంలో భాగం. ఎ.హెచ్.హెచ్. అనేది సింగపూర్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ మరియు ప్రధానంగా దీర్ఘకాలిక పెట్టుబడి హోల్డింగ్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది మరియు దాని ప్రత్యక్ష/పరోక్ష అనుబంధ సంస్థల ద్వారా భారతదేశంలో తల్లి, పిల్లలు మరియు ఇతర సంబంధిత ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో చురుకుగా ఉంది. ఎ.హెచ్.హెచ్ టీపీజీ గ్రూప్ మరియు వేవర్లీ సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది మరియు నియంత్రించబడుతుంది. ఎ.ఐ.ఎన్.యు. దక్షిణ భారతదేశంలో ఒకే-ప్రత్యేక కేంద్రంగా, ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను అందింస్తోంది. (i) యూరాలజీ కేర్, (ii) నెఫ్రాలజీ కేర్ మరియు (iii) డయాలసిస్ మరియు కిడ్నీ మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరు తమ రోగులకు రేడియాలజీ మరియు పాథాలజీ సేవలను కూడా అందిస్తారు. దీనికి హైదరాబాద్ (సికింద్రాబాద్తో సహా), విశాఖపట్నం, సిలిగురి మరియు చెన్నై అంతటా ఏడు ఆసుపత్రులు ఉన్నాయి. ఈ కోనుగోలు ప్రక్రియకు సంబంధించి సీసీఐ యొక్క వివరణాత్మక ఆర్డర్ వెలువడాల్సి ఉంది.
***
(Release ID: 2013989)
Visitor Counter : 111