గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జియోస్పేషియల్ టెక్నాలజీ, కృతృమ మేథ అప్లికేషన్‌లలో తమ భాగస్వామ్యాన్ని అధికారికం చేసుకోవడానికి ఐఐటీ ఢిల్లీతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం
- ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద ఆస్తులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు భూమి మరియు అంతరిక్ష-ఆధారిత జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో అవగాహన ఒప్పందం
Posted On:
12 MAR 2024 5:26PM by PIB Hyderabad
గ్రామీణాభివృద్ధిలో సాంకేతిక పురోగతికి గాను జియోస్పేషియల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతృమ మేథ) యొక్క అప్లికేషన్లలో తమ భాగస్వామ్యాన్ని అధికారికం చేసుకోవడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీతో ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయు)కుదుర్చుకుంది. ఎంఓఆర్‌డీ జాయింట్ సెక్రటరీ శ్రీ అమిత్ కటారియా మరియు ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ మనబేంద్ర సహారియా ఎంఓయు పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ మరియు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ కూడా పాల్గొన్నారు. సహకారంపై చర్చలో ఎంజీఎన్ఆర్ఈజీఏ డైరెక్టర్ శ్రీమతి అదితి సింగ్, ఐఐటీ ఢిల్లీ డీన్ ఆర్ &డీ ప్రొఫెసర్ నరేష్ భట్నాగర్ మరియు సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ వసంత్ మత్‌సాగర్ నేతృత్వంలో జరిగాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీ ఎన్ఆర్ఈజీఏ) కింద ఆస్తులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు భూమి మరియు అంతరిక్ష-ఆధారిత జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక చొరవ "భూప్రహరి" ప్రాజెక్ట్ చుట్టూ ఎమ్ఒయు కేంద్రీకృతమై ఉంది. ప్రొ. మనబేంద్ర సహారియా నేతృత్వంలోని హైడ్రోసెన్స్ ల్యాబ్ ద్వారా ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు. ఈ సహకారం గ్రామీణ అభివృద్ధి ప్రక్రియల మెరుగుదలకు సాంకేతిక శక్తిని ఉపయోగించుకునే నిబద్ధతను చాటుతుంది. ఈ ఒప్పందపు సంతకాల కార్యక్రమంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రాజెక్ట్‌ల కార్యాచరణ సామర్థ్యం మరియు పారదర్శకతను పెంపొందించడంలో గ్రామీణాభివృద్ధి మరియు ఐఐటీ ఢిల్లీ అధికారు భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అత్యాధునిక సాంకేతికతల ఏకీకరణ, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక, పర్యవేక్షణ మరియు అమలు, జవాబుదారీతనం, వనరుల కేటాయింపును అనుకూలపరచడం వంటి వాటిని ఆధునీకరించగలదని భావిస్తున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో, ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ సామాజిక ప్రయోజనాల కోసం శాస్త్రీయ పరిశోధన మరియు సాంకేతిక ఆవిష్కరణలను వర్తింపజేయడంలో ఇన్స్టిట్యూట్ యొక్క అంకితభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ సమాజాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషించడానికి మరియు అన్వయించడానికి సహకార ప్రయత్నానికి ఈ ఒప్పందం నాంది పలికింది. ఈ భాగస్వామ్య ద్వారా, ఐఐటీ ఢిల్లీ మరియు మోర్డ్ విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు సామాజిక-ఆర్థిక పురోగతిని నడపడానికి ఎలా కలిసి పని చేయవచ్చు అనేదానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. భూప్రహరి ప్రాజెక్ట్ తక్షణ ప్రభావంతో ప్రారంభం కానుంది. ఈ దృక్పథాన్ని వాస్తవంలోకి అనువదించడానికి రెండు పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి.
****
(Release ID: 2013985)
Visitor Counter : 126