రక్షణ మంత్రిత్వ శాఖ
కోల్‌కతాలోని టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో 25టీ బొల్లార్డ్ పుల్ టగ్ బాహుబలి ప్రారంభం, 4వ బీటీ టగ్ యువన్‌కు కీల్ నిర్మాణం ప్రారంభం
Posted On:
12 MAR 2024 6:46PM by PIB Hyderabad
కోల్‌కతాలోని టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఈ రోజు రెండు కీలక కార్యక్రమాలు జరిగాయి. రెండో 25టీ బొల్లార్డ్ పుల్ టగ్ బాహుబలిని ప్రారంభించిన ఎస్‌ఎస్‌బీ (కోల్‌కతా) ప్రెసిడెంట్ & కమాండర్ అతుల్ మైనీ, 4వ 25టీ బొల్లార్డ్ పుల్ టగ్ యువన్‌కు కీల్ వేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. భారత ప్రభుత్వం చేపట్టిన "భారత్‌లో తయారీ" చొరవలో ఇదొక మైలురాయి వంటి ఆవిష్కరణ.
భారత ప్రభుత్వ “ఆత్మనిర్భర్ భారత్” చొరవకు అనుగుణంగా, ఆరు 25టీ బీపీ టగ్‌ల నిర్మాణం కోసం టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ టగ్‌లను 'ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్' (ఐఆర్‌ఎస్) నిబంధనల ప్రకారం నిర్మిస్తారు. టగ్‌లు అందుబాటులోకి రావడం వల్ల భారత నౌకాదళం నౌకల కార్యకలాపాల్లో మరింత సౌలభ్యం చేకూరుతుంది. జలాంతర్గాముల రాకపోకలకు ఇవి సాయంగా నిలుస్తాయి. ఓడలను నిలపడంతో పాటు అగ్నిమాపక సాయాన్ని కూడా ఈ టగ్‌లు అందిస్తాయి. పరిమిత స్థాయిలో గాలింపు & సహాయక చర్యలు చేపట్టే సామర్థ్యం కూడా వీటికి ఉంది.
____
(Release ID: 2013963)
Visitor Counter : 123