రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌లో 114ఏ జాతీయ రహదారిపై టవర్ చౌక్ నుంచి బసుకినాథ్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.292.65 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2024 12:41PM by PIB Hyderabad

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఉన్న 114ఏ జాతీయ రహదారిపై టవర్ చౌక్ నుంచి బసుకినాథ్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.292.65 కోట్లు మంజూరైనట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్‌ చేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల దేవఘర్, బసుకినాథ్ వంటి కీలక పుణ్యస్థలాలకు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని శ్రీ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రహదారి శ్రావణి మేళా సమయంలో రాకపోకలకు సరిపోదు. భక్తులు దేవఘర్, బసుకినాథ్ సందర్శించడానికి ఆ మార్గాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న 2 వరుసల రహదార్లను నాలుగు వరుసలుగా మార్చాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రద్దీ తగ్గడంతో పాటు ఆ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2013958) సందర్శకుల సూచీ సంఖ్య : : 107
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil