సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు పున‌రుద్ధ‌రించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించి, అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 కింద పురాస్తు ప్ర‌దేశాలు/ క‌ళాఖండాల ద‌త్త‌త తీసుకునేందుకు ఎంఒయుల‌పై సంత‌కాలు చేయ‌నున్న ఎఎస్ఐ

Posted On: 11 MAR 2024 12:50PM by PIB Hyderabad

భార‌తీయ సుసంప‌న్న‌మైన సాంస్కృతిక వార‌స‌త్వ అందుబాటును పెంచేందుకు, దానితో సంబంధాల‌ను పెంచడం అన్న బ్యాన‌ర్ కింద దేశ‌వ్యాప్తంగా ఉన్న పౌరుల చ‌ల‌న‌శీల అవ‌స‌రాల‌కు అనుగుణంగా పున‌రుద్ధ‌రించిన త‌మ సంస్థ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు ఆర్కియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ- భార‌త పురావ‌స్తు శాఖ‌) సిద్ధంగా ఉంది. ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో మార్చి 12, 2024న నిర్వ‌హించ‌నున్నారు. న‌వీనంగా ఆధునీక‌రించిన ఈ వేదిక విభిన్న కార్యాచ‌ర‌ణ‌ల‌ను అందిస్తుంది. ఎఎస్ఐకి సంబంధించిన‌ ప్ర‌తి దిగంశం తోడ్పాటుతో యూజ‌ర్లు శ్ర‌మ‌లేకుండా చారిత్రిక ప్ర‌దేశాల నుంచి విద్యా వ‌న‌రుల వ‌ర‌కు భార‌త‌దేశ సుసంప‌న్న సాంస్కృతిక చిత్ర య‌వ‌నిక‌కు సంబంధించిన వివిధ కోణాల‌ను నిశితంగా అన్వేషించేందుకు వీలుగా రూపొందించారు. 
అంతేకాకుండా, స‌మాచారాన్ని తెలుసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ను  విలువైన వ‌న‌రుగా విద్యార్ధులు భావించేలా రూపొందించారు. స‌మ‌గ్రంగా మ‌ర‌మ్మ‌త్తు చేసిన ఈ డిజిట‌ల్ వేదిక, దేశ సాంస్కృతిక సంప‌ద విస్త్ర‌త ప్రేక్ష‌కులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు, అంద‌రికీ ల‌బ్ధి చేకూర్చేలా సాంకేతిక‌త‌ను ఎఎస్ఐ ఉప‌యోగించుకోవ‌డం అన్న‌ది దాని నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌తిబింబిస్తుంది.
భార‌తీయ సాంస్కృతిక వార‌స‌త్వ ప‌రిర‌క్షించ‌డం, ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా చేస్తున్న విశేష కృషిలో భాగంగా భార‌త పురావ‌స్తు శాఖ (ఎఎస్ఐ) అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 (వార‌స‌త్వాన్ని స్వీక‌రించ‌డం/ ద‌త్త‌త 2.0) కార్య‌క్ర‌మాన్ని రూపొందించి, పురావ‌స్తు క‌ళాఖండాలు/  ప్ర‌దేశాల‌ ద‌త్త‌త కోసం వివిధ ఏజెన్సీల‌తో అవ‌గాహ‌నా ఒప్పందాల (ఎంఒయు)పై సంత‌కాలు చేసేందుకు ప్ర‌స్తుతం సిద్ధంగా ఉంది.  
దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎఎస్ఐ ప‌రిర‌క్ష‌ణ కింద 3600 పురావ‌స్తువుల‌కుపైగా ఉన్నాయి.  ఈ సాంస్కృతిక సంప‌ద వ‌ద్ద వాటి భ‌ద్ర‌త‌ను, సంద‌ర్శ‌కుల అనుభ‌వాన్ని, అనుభూతిని, పెంపొందించ‌డంలో బాహ్య భాగ‌స్వాముల‌తో స‌హ‌కార ప్రాముఖ్య‌త‌ను ఎఎస్ఐ గుర్తిస్తుంది. 
నిర్ధిష్ట క‌ళాఖండాల‌ను, ప‌ర‌దేశాల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డానికి, వాటి నిర్వ‌హ‌ణ‌, మెరుగ్గా వాటిని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ద‌ర్శించేందుకు దోహ‌ద‌ప‌డే బాధ్య‌త‌ను చేప‌ట్ట‌డానికి ఈ ఏజెన్సీల నిబ‌ద్ధ‌త‌ను ఎంఒయుల‌పై సంత‌కం అధికారికం చేస్తుంది. 
భార‌త‌దేశ వైవిధ్య‌భ‌రిత‌మైన వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించ‌డం కోసం భాగ‌స్వామ్యాల‌ను పెంపొందించ‌డంలో ప్ర‌భుత్వ అంకిత‌భావాన్ని నొక్కి చెప్పే ఈ కార్య‌క్ర‌మంలో స‌హాయ మంత్రి శ్రీ‌మ‌తి మీనాక్షీ లేఖి, ఇత‌ర ప్ర‌ముఖులు, వివిధ ఏజెన్సీల స‌మ‌క్షంలో ఎంఒయుల‌పై సంత‌కాలు జ‌రుగుతాయి. 
ప్ర‌తి స్మార‌క సార‌థి/  సాథి ఎంపిక ప్ర‌క్రియ‌లో త‌గిన శ్ర‌ద్ధ, వివిధ ప‌క్షాల‌తో చ‌ర్చ‌లు, ప్ర‌తి పురావ‌స్తు స్థ‌లం/ క‌ళాఖండం, స్మార‌క‌చిహ్నం వ‌ద్ద వారి నిబ‌ద్ధ‌ను, సామ‌ర్ధ్యాన్ని అంచ‌నా వేయ‌డం జ‌రిగింది. ఎంపికైన స్మార‌క సార‌థి/  సాథి పరిశుభ్ర‌త‌, ప్రాప్య‌త‌, భ‌ద్ర‌త‌, విజ్ఞాన వ‌ర్గాల‌లో సౌక‌ర్యాల‌ను అందించి, నిర్వ‌హించ‌డంతో పాటు వాటిని బాధ్య‌తాయుత‌మైన‌, వార‌స‌త్వ‌- స్నేహ‌పూర్వ‌క సంస్థ‌లుగా ఉంచ‌డానికి బాధ్య‌త వ‌హిస్తాయి. 
ఈ చొర‌వ ఇప్ప‌టికే ఉనికిలో ఉన్న అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0కి అద‌నంగా ఉంటూ, భ‌విష్య‌త్ త‌రాల కోసం మ‌న వార‌స‌త్వాన్ని కాపాడ‌డంలో, సంద‌ర్శ‌కుల‌కు సంపూర్ణ అనుభ‌వాన్ని ఇవ్వ‌డాన్ని పెంపొందించ‌డంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థ‌ల స‌మిష్టి బాధ్య‌త‌ను నొక్కి చెబుతుంది. 
ఇందులో కుతుబ్‌మినార్‌, పురానా ఖిలా, ఉగ్గ‌ర్ సేన్ బావోలీ, హుమాయూన్ స‌మాధి, ఎగువ అగువాదా కోట‌, ఎలిఫెంటా గుహ‌లు, ఆగ్రా కోట‌, భింబేత్క‌, బౌద్ధ స్థూపం, కైలాస‌నాథ ఆల‌యం, ఖ‌జురాహులో ఆల‌యాల స‌మూహం, స‌ఫ్ద‌ర్‌జంగ్ స‌మాధి, అనేక పురావ‌స్తువులు, మామ‌ళ్ళ‌పురం, జ‌మాలి క‌మాలి- బాల్బ‌న్ స‌మాధి, కోణార్క సూర్య ఆల‌యం స‌హా ప‌లు ప్ర‌దేశాలు ఉన్నాయి. 

 

***
 




(Release ID: 2013860) Visitor Counter : 74