మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మూడు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ, విద్య కోసం పాఠ్య ప్రణాళికను మరియు జన్మించిన నాటి నుంచి మూడు సంవత్సరాల వరకు పిల్లలకు ప్రారంభ బాల్య ప్రేరణ కోసం జాతీయ పాఠ్యాంశాల రూపకల్పన కోసం జాతీయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న కేంద్ర .మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొత్త పాఠ్యాంశాలు వ్యవస్థపై పై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించనున్న ఎన్ఐపిసిసిడి
పోషన్ ట్రాకర్‌లో భాగం కానున్న పాఠ్యాంశాలు, వ్యవస్థ
Posted On:
11 MAR 2024 4:54PM by PIB Hyderabad
భారతదేశంలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో జాతీయ విద్యా విధానం 2020 కి ప్రభుత్వం రూపకల్పన చేసింది. దేశ భవిష్యత్తు లో పిల్లలకు సముచిత పాత్ర కల్పించాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి రూపకల్పన చేసింది. ఆరు సంవత్సరాల లోపు లోగా పిల్ల మెదడు 85% వరకు అభివృద్ధి చెందుతుంది. ఈ కాలాక అంశాన్ని గుర్తించిన మంత్రిత్వ శాఖ బాల్య సంరక్షణ, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ECCE) వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రారంభించింది. ఈ కృషిలో భాగంగా మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ను , జన్మించిన నాటి నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ప్రారంభ బాల్య ప్రేరణ కోసం జాతీయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
మిషన్ శక్తి పల్సా, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకాలతో పాటు మిషన్ సాక్ష్యం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 ద్వారా మిషన్ శక్తి కింద ఆరేళ్లలోపు వయస్సు లోపు పిల్లలు ఉన్న తల్లులు పిల్లలకు సాధికారత కల్పించడానికి మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తుంది. దీనిలో భాగంగా శిక్షణ పొందిన సిబ్బంది రోజంతా అందుబాటులో ఉండే విధంగా తగిన విద్యా వనరులు, పోషకాహార ,సంపూర్ణ పిల్లల అభివృద్ధి కోసం పిల్లలకు సమగ్ర సంరక్షణ కార్యక్రమాలు అమలు చేస్తారు. దేశవ్యాప్తంగా 13.9 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ, ఆరేళ్లలోపు 8 కోట్ల మంది చిన్నారుల అవసరాలు తీరుస్తోంది.
మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించిన ఈసిసిఈ 2024 జాతీయ పాఠ్యాంశాలు ఫౌండేషన్ స్టేజ్ 2022 (NCF-FS) కోసం నేషనల్ పాఠ్య ప్రణాళిక ప్రకారం పిల్లలకు భౌతిక, అభిజ్ఞా, భాష, అక్షరాస్యత, సామాజిక-మానసిక, సాంస్కృతిక అంశాలు, సానుకూల అలవాట్లు లాంటి అంశాలు కలిగి ఉంటాయి. సరళంగా ఉపయోగించడానికి సులువుగా ఉండే విధంగా పాఠ్య ప్రణాళికలు, కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తూ బోధన సామగ్రిని సిద్ధం చేసి అంగన్‌వాడీ కేంద్రంలో ఈసిసిఈ నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యలకు పిల్లలను తీర్చిదిద్దడానికి సన్నాహకంగా ఆటల ద్వారా పిల్లలకు ఆనందం, ఆహ్లాదం కలిగించే విధంగా పాఠాలు నేర్పిస్తారు. . దీనివల్ల ప్రారంభ సంవత్సరాల్లో పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని తెలుస్తుంది. 8 వారాల రీన్‌ఫోర్స్‌మెంట్, 4 వారాల ప్రారంభ అంశాలతో 36 వారాల బోధన జరిగేలా ప్రణాళిక అమలు చేస్తారు. ఒక వారంలో 5+1 రోజుల ఆటలు, ఒక రోజులో మూడు బ్లాక్‌ల యాక్టివిటీలతో కూడిన వారపు క్యాలెండర్ తో పాఠ్యప్రణాళిక రూపొందిందింది. కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం, గృహం, ఇండోర్ మరియు అవుట్‌డోర్ విధానంలో పిల్లలు, శిక్షకులు కలిసి విద్యా కార్యక్రమాలు అమలు చేస్తారు. పురోగతిని ,సమీక్షించడం, బోధన విధానాలు, పిల్లలు సాధించిన విజయాలు గుర్తించడం కోసం ప్రత్యేకమైన బలమైన అంచనా సాధనాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కార్యకలాపంలో దివ్యాంగుల పిల్లలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వారికి అవసరమైన మరింత శిక్షణ అందించే అంశానికి ప్రత్యేకప్రాధాన్యత ఇస్తారు. నెలవారీ ఈసిసిఈ కార్యక్రమాల నిర్వహణలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తారు. దీనివల్ల ఇళ్లల్లో పిల్లలు సులువుగా నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది.
జన్మించిన నాటి నుంచి మూడు సంవత్సరాల వరకు వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 2024 నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టిమ్యులేషన్ 2024లో సంరక్షకులు, అంగన్‌వాడీ కార్యకర్తల కోసం సమగ్ర ప్రణాళిక అమలు జరుగుతుంది. సంపూర్ణ ముందస్తు ఉద్దీపన కోసం, ప్రతిస్పందించే సంరక్షణ మరియు ప్రారంభ అభ్యాసానికి అవకాశాల ద్వారా, పిల్లల శరీరం మరియు మెదడు యొక్క సరైన అభివృద్ధి కోసం సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సంరక్షణ మరియు ఉద్దీపన పూర్తి అవగాహన కల్పించి, సమస్యలు పరిష్కరించి ఆచరణాత్మక ప్రణాళిక అందిస్తారు. పిల్లలు ఎలా ఎదుగుతారు, అభివృద్ధి చెందుతారు, మెదడు అభివృద్ధి , ప్రాముఖ్యత ,సంరక్షణ , ఆవశ్యకతపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రాథమిక అవగాహనను అందించడానికి ప్రణాళిక అమలు జరుగుతుంది. ప్రేమ, చర్చ, ఆట, సానుకూల మార్గదర్శకత్వం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తారు. . ఇంటి సందర్శనలు, నెలవారీ సమావేశాలు, కమ్యూనిటీ ఆధారిత ఈవెంట్‌లు మొదలైనవాటితో సహా అన్ని సంప్రదింపు కార్యక్రమాల ద్వారా ఇంటి లోపల అలాగే అంగన్‌వాడీ కేంద్రం లేదా క్రీష్ వద్ద నిర్వహించే 36 నెలల వారీగా వయస్సు-ఆధారిత కార్యకలాపాలు అమలు జరుగుతాయి.ప్రతి కార్యకలాపంలో దివ్యాంగుల పిల్లలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వారికి అవసరమైన మరింత శిక్షణ అందించే అంశానికి ప్రత్యేకప్రాధాన్యత ఇస్తారు.
పత్రాలను అంతర్గత కమిటీ , అభివృద్ధి భాగస్వామి సహకారంతో మద్దతుతో పత్రాలనునేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ( ఎన్ఐపిసిసిడి ) సిద్ధం చేసింది. పాఠ్యాంశాలను మరింత సరళంగా, కార్యాచరణ ఆధారితంగా, ఎక్కువ దృష్టాంతాలు,తక్కువ వచనాన్ని ఉపయోగించి అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త పాఠ్యాంశాలు, వ్యవస్థపై అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎన్ఐపిసిసిడి శిక్షణ ఇస్తుంది.
పోషన్ ట్రాకర్‌లో పాఠ్యాంశాలు, వ్యవస్థ భాగంగా మారుతాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం కమ్యూనిటీలో ఒక శక్తివంతమైన అభ్యాస కేంద్రంగా ఉండేలా, పిల్లలందరికీ అధిక-నాణ్యత ఈసిసిఈ సేవలు అందించడానికి అంగన్‌వాడీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి, తగిన సహకారం అందించడానికి మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తుంది.
***
(Release ID: 2013857)
Visitor Counter : 168