ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మశూచీ, రుబెల్లా వ్యాధి నివారణలో ఆదర్శప్రాయమైన కృషి చేసినందుకు మీజిల్స్ (మశూచీ) అండ్ రుబెల్లా చాంపియన్ అవార్డును అందుకున్న భారత్
Posted On:
08 MAR 2024 2:54PM by PIB Hyderabad
మశూచీ, రుబెల్లా (గజ్జి పొక్కుల వంటివి)తో పోరాడేందుకు దేశం చేస్తున్న అవిశ్రాంత కృషికి గుర్తింపుగా, మార్చి 6, 2024న యుఎస్ఎలోని వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయంలో మశూచీ, రుబెల్లా భాగస్వామ్యం ద్వారా ప్రతిష్ఠాత్మక మశూచీ, రుబెల్లా ఛాంపియన్ అవార్డును భారత్ అందుకుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య&కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరఫున వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ శ్రీప్రియా రంగనాథన్ అందుకున్నారు.
మశూచీ, రుబెల్లా భాగస్వామ్యంలో ప్రపంచ మశూచీ మరణాలను తగ్గించేందుకు, రెబెల్లా వ్యాధిని నిరోధించడానికి అంకితమైన అమెరికన్ రెడ్ క్రాస్, బిఎంజిఎఫ్, జిఎవిఐ, యుఎస్ సిడిసి, యుఎన్ఎఫ్, యూనిసెఫ్, డబ్ల్యుహెచ్‌వోతో కూడిన బహుళ సంస్థల ప్రణాళికా కమిటీ ఉంది.
పిల్లల్లో ఈ అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో అత్యుత్తమ నాయకత్వాన్ని వహిస్తూ ప్రజారోగ్యం పట్ల భారతదేశపు తిరుగులేని నిబద్ధతకు అభినందనలు అందుకుంటోంది. దేశం చేపట్టిన సార్వత్రిక టీకాకరణ కార్యక్రమం (యుఐపి) కింద సాధారణ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మసూచీని ఒక గుర్తు లేదా జాడగా ఉపయోగించడం ద్వారా మశూచీ& రుబెల్లా నిర్మూలన కార్యక్రమానికి ప్రాంతీయ నాయకత్వాన్ని అందించినందుకు భారతదేశాన్ని ఇది గుర్తించింది. అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశం మశూచీ, రుబెల్లా కేసులను తగ్గించడంలో, సమగ్ర జోక్యాల శ్రేణి ద్వారా అవి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో అద్భుతమైన పురోగతిని ప్రదర్శించింది.
అధిక- ప్రమాదకర ప్రాంతాలలో భారత ప్రభుత్వపు సానుకూల, చురుకైన ఎంఆర్ టీకా ప్రచారం, తక్కువగా సేవలు అందుకుంటున్న ప్రజానీకాన్ని చేరుకునేందుకు వినూత్న వ్యూహాలు, పటిష్టమైన నిఘా వ్యవస్థలు, సమర్ధవంతమైన ప్రజా అవగాహన చొరవలు అన్నీ కూడా తన ప్రజానీకపు ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాయి. దేశంలోని ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విధాన రూపకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్న సంఘాల అంకితభావం, కృషికి ఈ అవార్డు నిదర్శనం. ఈ ప్రయత్నాల ఫలితంగా 50 జిల్లాలు స్థిరంగా మశూచీ కేసులను చూడలేదు, కాగా 226 జిల్లాలలో గత 12 నెలలుగా రుబెల్లా కేసులను నివేదించలేదు.
మశూచీ, రుబెల్లా టీకా ద్వారా నివారించగల వ్యాధులు (విపిడిలు). ఎంఆర్ వాక్సిన్ 2017 నుంచి భారతదేశ సార్వత్రిక టీకాకరణ కార్యక్రమంలో భాగం. దేశం నుంచి మశూచిని, రుబెల్లాను నిర్మూలించే దిశగా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
***
(Release ID: 2013371)
Visitor Counter : 147