జాతీయ ఆర్థిక నివేదన ప్రాధికార సంస్థ
‘పారదర్శక ఆర్థిక రిపోర్టింగ్, ఆడిట్ నాణ్యత– కార్పొరేట్ పాలనకు స్తంభాలు”పేరుతో జరిగిన ఎన్.ఎఫ్.ఆర్.ఎ ప్రారంభ అంతర్జాతీయ సదస్పు న్యూఢిల్లీలో విజయవంతంగా ముగింపు..
ఆర్థిక రిపోర్టింగ్లో జవాబుదారిత్వం, పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కేంద్ర సహాయమంత్రి శ్రీ రావ్ ఇంద్రజిత్ సింగ్.
కార్పొరేట్ పద్దతుల పాటింపులో పారదర్శకత, జవాబుదారిత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి.
బలమైన కార్పొరేట్ పాలనాయంత్రాంగం, వ్యాపార కార్యకలాపాలలో నిష్పాక్షికత, సమగ్రతకు వీలుకల్పిస్తుంది.: ఎన్సిఎల్ఎటి ఛైర్మన్
బలమైన కార్పొరేట్ సుపరిపాలనా ప్రమాణాలను పాటించడంలో, పారదర్శక ఆర్థిక రిపోర్టింగ్, నాణ్యమైన ఆడిటింగ్ ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించిన ఎన్.ఎఫ్.ఆర్.ఎ ఛైర్ పర్సన్
కార్పొరేట్ పరిపాలన ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది.ఇది జాతీయ లక్ష్యాల సాధనకు ఉపకరిస్తుంది: శ్రీ ఉదయ్ కోటక్
प्रविष्टि तिथि:
07 MAR 2024 5:30PM by PIB Hyderabad
‘పారదర్శక ఆర్థిక రిపోర్టింగ్, ఆడిట్ నాణ్యత– కార్పొరేట్ పాలనకు స్తంభాలు”పేరుతో జరిగిన ఎన్.ఎఫ్.ఆర్.ఎ ప్రారంభ అంతర్జాతీయ సదస్పు న్యూఢిల్లీలో మార్చి5– 6న విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు విధాన నిర్ణేతలకు, అంతర్జాతీయ నిపుణులకు, ప్రొఫెషనల్స్‌కు పరిశ్రమ నాయకులకు ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడింది పారదర్శక.ఆర్థిక రిపోర్టింగ్, ఆడిట్ నాణ్యత,మెరుగైన కార్పొరేట్ పాలనకు సంబంధించి పరిశ్రమ వర్గాలు కీలక చర్చలు జరిపేందుకు ఇది ఎంతగానో దోహదపడింది.
ఈ సదస్సు ముఖ్యోద్దేశం ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి సమకాలీన సవాళ్లు, అవకాశాల గురించి చర్చించడం. కీలకోపన్యాసాలు, చర్చాకార్యక్రమాలు, ప్రెజెంటేషన్ల ద్వారా ఈ సదస్సు విలువైన సమాచారాన్ని అందించడమే కాక, కార్యాచరణకు అనువైన వ్యూహాలను ప్రతిపాదించింది. ఇది పారదర్శకత బలోపేతానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆడిటింగ్ విధానాలలో సమగ్రతకు ఉపకరిస్తుంది.
సదస్సు రెండో రోజు ముగింపు సందర్భంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహరాల శాఖ సహాయమంత్రి, గణాంకాలు , కార్యక్రమ అమలు శాఖ ఇంఛార్జ్ మంత్రి శ్రీ రావ్ ఇంద్ర జిత్ సింగ్ ముగింపు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో జవాబుదారిత్వం, పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మార్కెట్ ఇంటిగ్రిటీని కాపాడడానికి ఎన్.ఎఫ్.ఆర్.ఎ కీలకపాత్రను శ్రీ సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తన మద్దతు కొనసాగిస్తుందని శ్రీ సింగ్ తెలిపారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ మనోజ్ గోవిల్ మాట్లాడుతూ, కార్పొరేట్ రంగంలో జవాబుదారిత్వం, పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదానికి సంబంధించి విలువైన సమాచారం అందించారు. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యూనల్ (ఎన్.సిఎల్.ఎ.టి) ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషన్ కీలకోపన్యాసం చేస్తూ, బలమైన కార్పొరేట్ సుపరిపాలనా యంత్రాంగం ఉండాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పారు. ఇది వ్యాపార కార్యకలాపాలలో సమగ్రతకు, నిష్పాక్షితకు ఉపకరిస్తుందన్నారు. ఎన్.ఎఫ్.ఆర్.ఎ ఛైర్ పర్సన్ డాక్టర్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ, ఈ రెండు రోజుల సదస్సు నేపథ్యం గురించి వివరించారు. పారదర్శక ఆర్థిక రిపోర్టింగ్ ప్రాధాన్యత గురించి, నాణ్యమైన ఆడిటింగ్, అద్భుతమైన కార్పొరేట్ సుపరిపాలనా ప్రమాణాలు వంటి వాటి గురించి ప్రస్తావించారు. కోటక్ మహీంద్ర బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శ్రీ ఉదయ్ కోటక్ మాట్లాడుతూ కార్పొరేట్ సుపరిపాలన గురింది, ఆర్ధికాభివృద్ధికి , జాతీయ లక్ష్యాల సాధనకు అది ఏవిధంగా తోడ్పడుతుందన్న విషయాన్ని గురించి వివరించారు.సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లిలిత్ మాట్లాడుతూ, ప్రజాప్రయోజన పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వడం, జవాబుదారిత్వం, పారదర్శకతలో ఎన్.ఎఫ్.ఆర్.ఎ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కార్పొరేట్ రంగంలో విలువలను కాపాడడం గురించి మాట్లాడారు. నియంత్రణా ఫ్రేమ్వర్క్, స్టేక్హోల్డర్ల విశ్వాసాన్ని కాపాడేందుకు సమర్ధ యంత్రాంగం, ఆర్ధిక కార్యకలాపాలలో విశ్వసనీయత వంటివాటిని వారు ప్రస్తావించారు.
ఈ సదస్సు పారదర్శకత, జవాబుదారిత్వం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందుకు సంబంధించిన అంశాలు కిందివిధంగా ఉన్నాయి.
–ఆడిట్ సమర్థతను పెంపొందిచేందుకు అత్యధునాతన సాంకేతికత,
–పటిష్ట రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ద్వారా ఇన్వెస్టర్లకు రక్షణ.
–ఆడిటింగ్ ప్రమాణాలలో ఇటీవలి సంస్కరణల ద్వారా మారుతున్న కాలానికి అనుగుణంగా సమకాలీన పరిణామాలతో మిళితం కావడం,
–ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ విధానాలను నిరంతరం మెరుగుపరుచుకోవడం,
–ఆడిట్ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం,
––కార్పొరేట్ విధానాల లో సుస్థిర రిపోర్టింగ్ విధానాలను మిళితం చేయడం
ఈ సదస్సు లో జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు క్రియాశీలంగా పాల్గొన్నారు. అలాగే రెగ్యులేటరీ వ్యవస్థలు,ఆడిట్ సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ రంగం ఇందులో పాల్గొన్నాయి. ఈ సదస్సుద్వారా వీరు తమ అభిప్రాయాలను కలబోసుకున్నారు. ఆర్ధిక కార్యకలాపాలలో మరింత పారదర్శకత, జవాబుదారిత్వాన్ని సాధించేందుకు ఉమ్మడి కృషి అవసరాన్ని ఈ సదస్సు నొక్కి చెప్పింది.
****
(रिलीज़ आईडी: 2012914)
आगंतुक पटल : 131