కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉనికిలో ఉన్న టెలికాం సేవలను పెంచేందుకు, ఆ సేవల కొనసాగింపును నిర్వహించేందుకు స్పెక్ట్రమ్ వేలానికి శ్రీకారం చుట్టి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటీసులు జారీ చేసిన టెలికాం విభాగం (డిఒటి)
Posted On:
08 MAR 2024 6:47PM by PIB Hyderabad
ఉనికిలో ఉన్న టెలికాం సేవలను పెంచేందుకు, ఆ సేవల కొనసాగింపును నిర్వహించేందుకు టెలికాం విభాగం (డిఒటి) స్పెక్ట్రమ్ వేలానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నేడు (08.03.2024)న డిఒటి నోటీసును జారీ చేసింది. తన పౌరులందరికీ అత్యాధునిక నాణ్యత కలిగిన టెలికాం సేవలను సరసమైన ధరలో అందించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.
స్పెక్ట్రం వేలంలో విశేషాంశాలుః
- స్పెక్ట్రమ్‌ను వేలం వేయడంః అందుబాటులో ఉన్న 800ఎంహెచ్‌జెడ్, 900ఎంహెచ్‌జెడ్, 1800ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్‌జెడ్, 2500ఎంహెచ్‌జెడ్, 3300 ఎంహెచ్‌జెడ్, 26 జిగాహెడ్జ్ బ్యాండ్‌లలో గల స్పెక్ట్రమ్ అంతా వేలంలో భాగంగా ఉంటుంది.
- వేలం ప్రక్రియః వేలం ఏకకాలంలో బహుళ రౌండ్ ఆరోహక (ఎస్ఎంఆర్ఎ) ఇ-వేలంగా ఉండనుంది.
- రిజర్వ్ ధరః వేలం వేయనున్న 10523.15మెగా హెర్ట్జ్‌ల స్పెక్ట్రమ్ సంచిత రిజర్వ్ ధర రూ.96317.65 కోట్లు
- స్పెక్ట్రమ్ కాల వ్యవధిః ఇరవై ఏళ్ళకాలానికి స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తారు
- చెల్లింపులుః విజయవంతమైన బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తూ, ఎన్‌పివిని 8.65% వడ్డీ రేటును తగినట్లుగా పరిరక్షిస్తారు.
- స్పెక్ట్రమ్ అప్పగింతః ఈ వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌ను కనీసం పది సంవత్సరాల తర్వాత తిరిగి అప్పగించవచ్చు.
- స్పెక్ట్రమ్ వినియోగ వెలః ఈ వేలంలో పొందిన స్పెక్ట్రమ్‌కు స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు (ఎస్‌యుసి) ఉండదు.
- బ్యాంకు హామీలుః విజయవంతమైన బిడ్డర్లు ఆర్ధిక బ్యాంకు గ్యారెంటీ / హామీ (ఎఫ్‌బిజి)ని, పనితీరు బ్యాంకు గ్యారెంటీ (పిబిజి) సమర్పించనవసరం లేదు.
స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర వివరాలైన రిజర్వ్ ధర, అర్హతకు ముందస్తు షరతులు, బయానా డబ్బు డిపాజిట్ (ఇఎండి), వేలం నియమాలు తదితరాలతో పాటు పైన పేర్కొన్న ఇతర నిబంధనలు, షరతులను ఎన్ఐఎలో పేర్కొనడం జరిగింది. ఇవి డిఒటి వెబ్ సైట్- https://dot.gov.in/spectrum లో అందుబాటులో ఉన్నాయి.
****
(Release ID: 2012913)
Visitor Counter : 147