రైల్వే మంత్రిత్వ శాఖ
9% మహిళా సిబ్బందితో భారతదేశంలోని ఇతర సెంట్రల్ పారామిలిటరీ బలగాల తో పోలిస్తే అత్యధిక మహిళా సిబ్బంది కలిగిన వ్యవస్థగా రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్)
2023లో 206 మంది గర్భిణీ ప్రయాణికులకు ప్రసవానికి సహకరించిన ఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బంది
అప్రమత్తం గా, చురుగ్గా వ్యవహరించి 2023 సంవత్సరంలో 3973 మంది ఆడపిల్లలను రక్షించిన ఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బంది
మహిళా సాధికారతకు చిహ్నాలుగా మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రత, సంరక్షణ కోసం కృషి చేస్తున్న ఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బంది.
Posted On:
08 MAR 2024 9:38AM by PIB Hyderabad
భారత రైల్వేలకు రైల్వే రక్షణ దళం భద్రత కల్పించడం, చట్టాలను అమలు చేస్తోంది. రైల్వే ఆస్తులకు రక్షణ , భద్రత అందించడానికి 1957లో రైల్వే రక్షణ దళం ఏర్పాటయింది. తదనంతరం ప్రయాణికుల భద్రత కల్పించే బాధ్యతను రైల్వే రక్షణ దళం స్వీకరించింది.
రైల్వే రక్షణ దళంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలను ప్రేమ, సంరక్షణ, శక్తి, శాశ్వతత్వానికి చిహ్నాలుగా రైల్వే శాఖ గుర్తించింది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం 9% మహిళా సిబ్బందితో భారతదేశంలోని ఇతర సెంట్రల్ పారామిలిటరీ బలగాల తో పోలిస్తే అత్యధిక మహిళా సిబ్బంది కలిగిన వ్యవస్థగా రైల్వే రక్షణ దళం (ఆర్‌పిఎఫ్) అవతరించింది. భద్రతను అందించడానికి, ఆపదలో ఉన్న మహిళా ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించడానికి మహిళా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తున్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, మహిళా సిబ్బంది వారి విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వారి అవసరాలను తీర్చడానికి,ఆర్‌పిఎఫ్ అనేక చర్యలు అమలు చేస్తోంది.
1. మౌలిక సదుపాయాలు:
రైలు ఎస్కార్ట్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రామాణిక బ్యారక్‌లు, దుస్తులు మార్చుకోవడానికి గదులు, ఇతర సౌకర్యాలను రైల్వే శాఖ కల్పిస్తోంది.
2. నోడల్ అధికారులు నియామకం
మహిళా సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని జోన్‌లు/యూనిట్‌లలో మహిళా నోడల్ ఆఫీసర్‌లను నియమించారు. మహిళా సిబ్బంది సమయాలు, ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారానికి నోడల్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.
వివిధ కార్యకలాపాలలో వారి పాత్ర యొక్క ముఖ్య అంశాలు -
1. మహిళా భద్రత
మేరీ సహేలీ కార్యక్రమం - భారతీయ రైల్వే వ్యవస్థలో సుదూర రైళ్లలో ఒంటరిగా లేదా మైనర్‌లతో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు భద్రత,రక్షణ అందించడం ప్రధాన లక్ష్యంగా మేరీ సహేలీ కార్యక్రమంఅమలు జరుగుతోంది. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు సగటున రోజుకు 400 కి పైగా రైళ్లల్లో సగటున 230 బృందాలను మేరీ సహేలీ కార్యక్రమం కింద నియమిస్తున్నాయి.
మహిళల కోసం కేటాయించిన కంపార్ట్‌మెంట్లలో అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న బృందాలు మహిళా ప్రయాణికులకు సురక్షితంగా ప్రయాణించే వీలు కల్పిస్తున్నాయి.
2023 సంవత్సరంలో, మహిళల కోసం ప్రత్యేకించబడిన కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తున్న 77839 మంది పురుషులు చట్టపరమైన చర్యలు అనుసరించి అరెస్టు చేశారు.
2. ఆపరేషన్ మాతృశక్తి - విధులు నిర్వర్తిస్తున్నఆర్‌పిఎఫ్ సిబ్బంది మహిళా అధికారులు మానవతా దృక్పధంతో వ్యవహరిస్తూ ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రసవించడానికి గర్భిణీ స్త్రీలకు సహాయం అందిస్తున్నారు. ఒక్క 2023 సంవత్సరంలో ఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బంది 206 ప్రసవాలలో సహాయం చేసారు.
3. ఆపరేషన్ AAHT (మానవ అక్రమ రవాణా నివారణ ) - మానవ అక్రమ రవాణాకు మహిళలు, ఆడపిల్లలు ఎక్కువగా గురవుతున్నారు. మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ఆర్‌పిఎఫ్ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. 2023లో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 257 మంది ని అరెస్ట్ చేసి వారి బారి నుంచి 1048 మందిని ఆర్‌పిఎఫ్ రక్షించింది.
4. ఆపరేషన్ నాన్హే ఫరిష్టే - రైళ్లలో ప్రయాణిస్తున్న చిన్న పిల్లల సంరక్షణ, రక్షణ కోసం ఆర్‌పిఎఫ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023 సంవత్సరంలో 3973 మంది బాలికలను ఆర్‌పిఎఫ్ రక్షించింది.
5. ఆపరేషన్ డిగ్నిటీ - సంరక్షణ, రక్షణ అవసరమైన మహిళలతో సహా పెద్దలను రక్షించడంలో ఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బంది చురుగ్గా వ్యవహరిస్తున్నారు.పారిపోయి వచ్చిన , అనాధలు,, మాదకద్రవ్యాలకు బానిస అయిన వారు , నిరుపేదలు లేదా వైద్య సహాయం అవసరం వారికి ఆర్‌పిఎఫ్ సహాయం అందిస్తోంది. . 2023లో దాదాపు 3492 మందికి ఆర్‌పిఎఫ్ అండగా నిలిచింది.
ఈ కార్యకలాపాలు,కార్యక్రమాల ద్వారా, ఆర్‌పిఎఫ్ ప్రయాణీకుల భద్రతను మాత్రమే కాకుండా, అందరికీ సురక్షితమైన, మరింత కలుపుకొని రైల్వే వాతావరణాన్ని సృష్టించడంలో మహిళల అమూల్యమైన సహకారాన్ని అందిస్తోంది. ఆర్‌పిఎఫ్‌లోని మహిళలు సాధికారతకు చిహ్నాలు మాత్రమే కాదు; వారు బలం, కరుణ, అంకితభావం కి చిరునామాగా గుర్తింపు పొందారు. దీక్షతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌పిఎఫ్ సిబ్బంది రైల్వే ప్రయాణికులకు రక్షణ అందించడంలో కీలకంగా మారింది.
***
(Release ID: 2012648)
Visitor Counter : 92