చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హమారా సంవిధాన్, హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమం రేపు బికనీర్‌లో జరగనుంది


ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు

భారతదేశంలోని 500 ఆకాంక్షాత్మక బ్లాక్‌లలో “న్యాయ సహాయక్” కార్యక్రమం ప్రారంభించబడుతుంది

“జన్ సేవా జంట కే ద్వార్”(ప్రజల ఇంటి వద్ద ప్రజా సేవ): పౌరులు ఒకే చోట అన్ని సేవలను పొందేందుకు వీలుగా న్యాయ శాఖ స్టాల్స్‌తో పాటు పౌర కేంద్రీకృత విభాగాల ద్వారా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

Posted On: 08 MAR 2024 9:55AM by PIB Hyderabad

భారతదేశం గణతంత్ర రాజ్యంగా 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని హమారా సంవిధాన్, హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమం రేపు రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరగనుంది. అంతకుముందు, జనవరి 24, 2024న, న్యాయ శాఖ న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది, ఈ సందర్భంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి 'హమారా సంవిధాన్, హమారా సమ్మాన్' పేరుతో ప్రతి పౌరునికి సాధికారత కల్పించే లక్ష్యంతో ఒక సంవత్సరం పాటు రాజ్యాంగం మరియు వారి చట్టపరమైన హక్కులు మరియు విధుల గురించి అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.  అవగాహన ప్రచారాన్ని సమాజంలోని ప్రతి మూల మూలకు చేరుకోవడానికి మరియు చొచ్చుకుపోయేలా ఏడాది పొడవునా నిర్ణీత వ్యవధిలో ప్రాంతీయ/రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే తరహాలో రేపు రాజస్థాన్‌లోని బికనీర్‌లోని మహారాజా గంగా సింగ్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ (ఐ /సీ ) మంత్రిత్వ శాఖ; డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, భారత ప్రధాన న్యాయమూర్తి; జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు రాజస్థాన్ న్యాయ మంత్రి శ్రీ జోగారామ్ పటేల్ లతోపాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, దిశ పథకం కింద టెలి లా ప్రోగ్రామ్ యొక్క ఫీల్డ్ లెవల్ ఫంక్షనరీలు, పోలీసు అధికారులు, న్యాయ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

'హమారా సంవిధాన్, హమారా సమ్మాన్' ప్రచారం యొక్క ఆశయాలు మరియు లక్ష్యాలను మరింత హైలైట్ చేయడానికి వివిధ ప్రముఖులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమంనిర్వహించాలని భావించారు. దీనికి అనుగుణంగా, రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది, తద్వారా ఇది ఇతర రాష్ట్రాలు/యుటిలు అనుసరించడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది.

 

ఈ కార్యక్రమం భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలకు మన సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడం మరియు మన దేశాన్ని ఐక్యంగా ఉంచే భాగస్వామ్య విలువలను పెంపొందించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పౌరులు మన ప్రజాస్వామ్య ప్రయాణంలో అర్థవంతంగా పాల్గొనడానికి మరియు వారి హక్కులు మరియు విధుల గురించి వారికి అవగాహన కల్పించడానికి అవకాశాన్ని అందిస్తుంది.

 

ఈ కార్యక్రమం భారతదేశంలోని 500 ఆకాంక్షాత్మక బ్లాక్‌లలో “న్యాయ సహాయక్” కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది.  ఆకాంక్షాత్మక బ్లాక్‌లు & జిల్లాల్లో డీ ఓ జే యొక్క న్యాయ సేవలు మరియు పరిష్కారాలపై ఇంటింటికీ అవగాహన కల్పించడానికి కమ్యూనిటీ ఆధారిత మెసెంజర్‌లుగా న్యాయ సహాయక్ వ్యవహరిస్తారు. ఈ న్యాయ సహాయకులు న్యాయ సేవలను గడప గడపకు  అందించడం మరియు నిర్ధారించడానికి బాధ్యత వహిస్తారు, అక్కడ వారు ఉచిత న్యాయ సలహా కోసం లేదా కేసు ప్రాతినిధ్యం కోసం లబ్ధిదారుల కేసుల నమోదును సులభతరం చేస్తారు మరియు బ్లాక్ స్థాయి అధికారి నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వంతో గ్రామం లేదా బ్లాక్ స్థాయి లో న్యాయ అవగాహన మరియు చట్టపరమైన అక్షరాస్యత “విధి బైఠక్” నిర్వహించడం చేస్తారు.

 

పౌరులకు పౌర కేంద్రీకృత సేవలను అందించడం మరియు సమగ్ర అభివృద్ధి మరియు సాధికారత కోసం మా నిబద్ధత యొక్క సారాంశాన్ని పొందుపరిచే “జన్ సేవా జంట కే ద్వార్” (“ప్రజల ఇంటి వద్ద ప్రజా సేవ”) ఈవెంట్ యొక్క ముఖ్య ఆకర్షణ. పౌరులు ఒకే చోట అన్ని సేవలను పొందేందుకు వీలుగా న్యాయ శాఖ యొక్క స్టాల్స్‌తో పాటు పౌర కేంద్రీకృత విభాగాల ద్వారా అనేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది జిల్లా పరిపాలనతో క్రియాశీల సహకారంతో చేపట్టిన కార్యక్రమం. రాష్ట్ర స్థాయి టెలి-లా వర్క్‌షాప్ కమ్ మేళా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు మా సామూహిక అనుభవాల నుండి అంతర్దృష్టులను సేకరించడానికి, ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి మరియు మరింత ప్రతిస్పందించేలా చేయడానికి మా ప్రయత్నాలు మరియు చొరవ కోసం ఒక కోర్సును రూపొందించడానికి మా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లను కలుపుకుని  నిరంతర అభివృద్ధి పునరావృతం చేయడం ఆవిష్కరణల కోసం ప్రయత్నించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.  రాజస్థాన్ రాష్ట్ర బుక్‌లెట్‌ని విడుదల చేయడం, ఇది రాష్ట్రంలోని ముఖ్యమైన పథకాలు మరియు టెలి లా ప్రోగ్రామ్ గురించి సమాచారాన్ని ప్రదర్శించటం ఈ కార్యక్రమం యొక్క ఇతర ముఖ్యాంశాలు.

 

నారీ-భాగిదారి అభియాన్ ప్రచారానికి బలమైన మద్దతుగా, టెలి లా ప్రోగ్రామ్ కింద మహిళా లబ్ధిదారులకు చట్టపరమైన చర్యలు మరియు సాధికారత గురించి 75 బలమైన కథనాలను కలిగి ఉన్న ‘లబ్దిదారుల వాణి’ ప్రత్యేక మహిళా ఎడిషన్ విడుదల చేయబడుతుంది. ఈ బుక్‌లెట్ ఇతర మహిళలు వారి చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకునేందుకు మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సేవలు మరియు పరిష్కారాలను పొందడం ద్వారా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రేరణగా పనిచేస్తుంది.

 

ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన అంశాలలో ఒకటైన ఫీల్డ్ ఫంక్షనరీలు-వీ ఎల్ ఈ లు సంవత్సర కాలం పాటు ప్రవేశికను చదవడం మరియు సబ్కో న్యాయ్ హర్ ఘర్ న్యాయ్ సబ్‌థీమ్ కింద పంచప్రాన్ ప్రతిజ్ఞ తీసుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ పౌరుల భాగస్వామ్యం నిర్ధారించబడుతుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సత్కరిస్తారు.

****


(Release ID: 2012632) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi , Tamil