శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ఆరోగ్య పరీక్ష శిబిరం - ఫినోమ్ ఇండియాను నిర్వహించిన సిఎస్ ఐఆర్ - ఎన్ఐఎస్‌సిపిఆర్
Posted On:
07 MAR 2024 12:34PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్ కుటుంబం కోసం ఫినోమ్ ఇండియా (PI-CHeCK -పిఐ-చెక్) పేరుతో ప్రత్యేక ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ప్రారంభించింది. ఆరోగ్య, సంక్షేమ పరీక్షల ద్వారా స్వాస్థ్య భారత్ వికసిత్ భారత్‌ను ఖరారు చేయడం సిఎస్ఐఆర్ చొరవకు సంబంధించిన కీలక లక్ష్యాలు. భారతదేశంలోని అతపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థలలో సిఎస్ఐఆర్ ఒకటి. దేశవ్యాప్తంగా వ్యాపించిన 137 ప్రయోగశాలల నెట్‌వర్క్ ఇది.
కాగా, న్యూఢిల్లీలోని తన పూసా ఆవరణలో 3-5 మార్చి 2024వరకు పిఐ-చెక్ ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని సిఎస్ఐఆర్‌కు చెందిన ప్రయోగశాలల్లో ఒకటి అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్‌సిపిఆర్) నిర్వహించింది.
సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ ఆరోగ్య పరీక్షా శిబిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన కొన్ని అంశాలు
సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్, సిఎస్ఐఆర్-ఐజిఐబి ప్రధాన శాస్త్రవేత్త డా. శంతను సేన్‌గుప్తా ఆరోగ్య పరీక్షా శిబిరాన్నిప్రారంభించారు. సిఎస్ఐఆర్ కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఈ మార్గదర్శక చొరవ కట్టుబడి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని డా. కనికా మాలిక్, డా. నరేంద్ర కుమార్ సాహూ, డా. అర్వింద్ మీనా, శ్రీ నరేంద్ర పాల్, శ్రీ కైలాస్ చందర్ పరేవాలు సమర్ధవంతంగా సమన్వయం చేశారు. ముఖ్యంగా, పిఐ- చెక్ ఆరోగ్య పరీక్షా శిబిరాలకు మంచి ఉత్సాహవంతమైన స్పందన వచ్చింది. సంస్థలోని దాదాపు 98మంది సభ్యులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫినోమ్ ఇండియా అనేది కేవలం ఆరోగ్య పరీక్షా శిబిరమే కాదు, మన జాతి ప్రత్యేక ఆరోగ్య పరిదృశ్యాన్ని అర్థం చేసుకునే దిశగా ఒక మార్గదర్శక అడుగు. పిఐ-చెక్ ద్వారా వైవిధ్యమైన డేటాను సేకరించడం ద్వారా ప్రతి వ్యక్తికీ వారి శరీరానికి తగ్గట్టుగా తగిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలకు మార్గాన్ని సుగమం చేయడం ద్వారా అత్యాధునిక వైద్య పరిజ్ఞాన్ని పెంపొందించడానికి గణనీయంగా దోహదపడాలని సిఎస్ఐఆర్ కోరుకుంటోంది.
ఫినోమ్ ఇండియా- సిఎస్ఐఆర్ హెల్త్ కోహోర్ట్ నాలెడ్జ్ బేస్ (పిఐ-సిహెచ్ఇసికె ) అన్నది నిర్ధిష్టంగా భారత్‌కు సంబంధించి కార్డియో మెటాబాలిక్ (హృదయ జీవకోశ సంబంధ) వ్యాధుల, ప్రమాదకారకాలను గుర్తించడానికి సిఎస్ఐఆర్ రూపొందించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.
దేశంలోని వివిధ సిఎస్ఐఆర్ ప్రయోగశాలల నుంచి నిపుణులు, భాగస్వాముల సహకారంతో నిర్వహించిన ఈ సంచలనాత్మక అధ్యయనం, వ్యక్తిగతీకరించిన, ఖచ్చితమైన వైద్యం దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తూ విలువైన శాస్త్రీయ అంతర్దృష్టులను అందించేందుకు ప్రయత్నిస్తుంది.
విభిన్నమైన, వైవిధ్య భారత జనాభాను ఆవరించే లక్ష్యంతో సిఎస్ఐఆర్ ప్రారంభించిన దీర్ఘకాలిక సమన్వయ అధ్యయనమే పిఐ-చెక్. దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల నుంచి ప్రాతినిధ్యం కలిగిన ఈ ఆరోగ్య సమన్వయ అధ్యయనం చికిత్సా సంబంధ ప్రశ్నాపత్రాలు, జీవనశైలిక, ౠమార అలవాట్లు, శరీర కూర్పు, కొలతలు, స్కానింగ్ ఆధారిత అంచనాలు, రక్త జీవరసాయన శాస్త్రం, మాలిక్యులార్ ఆస్సే ఆధారిత డేటాతో సహా సమగ్ర డేటాను సేకరిస్తుంది.
శాస్త్రీయ సమాచారాన్ని, రుజువుల ఆధారిత శాస్త్రీయ సాంకేతికతను, ఆవిష్కరణ విధాన పరిశోధనను, ప్రజలలో శాస్త్రీయ అవగాహనను ప్రోత్సహించేందుకు కట్టుబడిన సంస్థ సిఎస్ఐఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ ఐఆర్ - ఎన్ఐఎస్‌సిపిఆర్). నవీన చొరవలు, సమన్వయ కృషితో శాస్త్రీయ సమాజానికి, సాధారణ ప్రజలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు సిఎస్ ఐఆర్ - ఎన్ఐఎస్‌సిపిఆర్ ప్రయత్నిస్తుంది.
***
(Release ID: 2012395)
Visitor Counter : 172