జల శక్తి మంత్రిత్వ శాఖ

ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్ (ఐసిఈడీ) ఏర్పాటు కోసం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న జలశక్తి మంత్రిత్వ శాఖ


శాస్త్రీయ పరిశోధన ద్వారా డ్యామ్ భద్రతలో తలెత్తుతున్న సవాళ్లకు పరిష్కారాలు అందించనున్న ఐసిఈడీ
జల్ శక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక విభాగంగా పని చేసి భారతీయ, విదేశీ డ్యామ్ నిర్వహణకు ప్రత్యేక సాంకేతిక సహకారం అందించనున్న ఐసిఈడీ

Posted On: 06 MAR 2024 1:29PM by PIB Hyderabad

 ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్  డ్యామ్ (ఐసిఈడీ) ఏర్పాటు కోసం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో  జలశక్తి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. 

ప్రపంచ సంస్థలతో సమానంగా సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించుకుని  డ్యామ్ భద్రతలో 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో జాతీయ సంస్థలకు   సాధికారత కల్పించడానికికేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్  డ్యామ్ (ఐసిఈడీ) ఏర్పాటు కోసం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో  జలశక్తి మంత్రిత్వ శాఖ,  సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), జలవనరుల శాఖ, గంగా నది అభివృద్ధి  గంగా పునరుజ్జీవన విభాగం, ఒప్పందం కుదుర్చుకున్నాయి.  డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (DRIP) ఫేజ్-II ఫేజ్- III కింద ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్ (ICED) కు సహకారం అందుతుంది. సంతకం చేసిన తేదీ నుంచి  ఒప్పందం పది సంవత్సరాలు లేదా  డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు జరిగే వరకు (ఏది ముందు అయితే అది) 

ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు, ఐసిఈడీ సహకరిస్తుందని జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, . దేబాశ్రీ ముఖర్జీ తెలిపారు. డ్యామ్ భద్రతా రంగంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలకు అవసరమైన సమాచారం, సహకారం ఐసిఈడీ  చెప్పారు.  

జలశక్తి మంత్రిత్వ శాఖ  సాంకేతిక విభాగంగా పని చేసే  ఐసిఈడీ దేశ, విదేశాలలో డ్యామ్ ల నిర్వహణకు అవసరమైన  పరిశోధనలు, మోడలింగ్, పరిశోధన , ఆవిష్కరణలు, సాంకేతిక సహాయ సేవలు ప్రత్యేక సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. . శాస్త్రీయ పరిశోధనల ద్వారా డ్యామ్ భద్రతలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది.   ఆనకట్ట భద్రతపై  మంత్రిత్వ శాఖకు  కేంద్రం సలహాలు సూచనలు అందిస్తుంది.  నిర్దిష్ట విద్యా కోర్సులను (శిక్షణ కార్యక్రమాలు మరియు వర్క్‌షాప్‌లతో సహా) కూడా కేంద్రం  అందిస్తుంది, స్థానిక, ప్రాంతీయ, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో డ్యామ్ భద్రతా నిర్వహణలో అనువర్తిత పరిశోధన, సాంకేతిక బదిలీ జరిగేలా కృషి చేస్తుంది. 

 (i) అధునాతన నిర్మాణం, పునరావాస సామగ్రి , ఆనకట్టల కోసం మెటీరియల్ టెస్టింగ్  (ii) డ్యామ్‌ల  సమగ్ర (బహుళ-ప్రమాదం) ప్రమాద అంచనా నివేదికల తయారీపై ఐసిఈడీ పరిశోధనలు చేపడుతుంది.  . సెంట్రల్ వాటర్ కమిషన్,జలశక్తి మంత్రిత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు అందినప్పుడు ఒప్పందంలో   డ్యామ్ భద్రత కు సంబంధించిన అంశాలను  పరస్పర చర్చల ద్వారా  ఒప్పందంలో చేరుస్తారు. గ్రాంట్‌గావస్తువుల సేకరణ, కొత్త ప్రయోగశాలల స్థాపన కోసం యంత్రాలు,  ఇప్పటికే ఉన్న ప్రయోగశాలల బలోపేతం , పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించడం, ఐసిఈడీ ఏర్పాటు, పని ప్రారంభించడానికి అవసరమైన  మౌలిక సదుపాయాల నిర్మాణం/ఆధునీకరణ, ఉత్తమ ప్రపంచ సంస్థలను సందర్శించడం లాంటి అవసరాల కోసం జలశక్తి మంత్రిత్వ శాఖ 118.05 కోట్ల రూపాయలను గ్రాంట్‌గా అందిస్తుంది. 

 ఆధునిక పరిశోధన , సాంకేతిక అభివృద్ధి ద్వారా పురాతన, నూతనఆనకట్టలకు  భద్రత కల్పించడానికి అమలు చేయాల్సిన చర్యలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌సూచిస్తుంది. భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఇంజనీర్లకుఎం.టెక్ అందిస్తుంది.  వర్క్‌షాప్‌లు ,శిక్షణా కార్యక్రమాల ద్వారా; డ్యామ్ భద్రతలో వివిధ సవాళ్లకు త్వరిత ,సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తుంది. కేంద్రీకృత ప్రాంతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం  ఐసిఈడీ  బృందం తగిన మార్గదర్శకత్వం అందించి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. 

 డ్యామ్ ఇంజినీరింగ్‌పై అభివృద్ధి చేసిన జ్ఞానం, సామర్థ్యం ద్వారా ఆదాయ మార్గాలను గుర్తించి  10 సంవత్సరాలలోఆర్థికంగా  స్వయం సమృద్ధి స్థాయికి చేరుకోవడానికి  ఐసిఈడీ ప్రయత్నిస్తుంది.  అధునాతన నిర్మాణం,పునరావాస సామగ్రి , సమగ్ర ప్రమాద అంచనా లాంటి అంశాల ద్వారా ఆదాయ వనరులను గుర్తించడానికి  ఐసిఈడీ కృషి చేస్తుంది.  కన్సల్టెన్సీ ఛార్జీలు, స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు ,ఏదైనా ఇతర ఆదాయాన్ని ఆర్జించే కార్యకలాపాలలో కొంత భాగం ఈ ఫండ్‌కు అందించబడుతుంది.

రాబోయే కాలంలో ప్రపంచ సంస్థలతో సమానంగా సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం  జాతీయ ప్రఖ్యాత సంస్థల సహకారంతో కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏర్పాటు కానున్న  ఐసిఈడీ  కేంద్రం  ఆధునిక పరిశోధనలు చేపట్టడం , సాంకేతికతలు, అప్లికేషన్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా డ్యామ్ భద్రతలో 'మేక్ ఇన్ ఇండియా' కు సాధన కోసం సహకారం అందిస్తుంది.  ఆనకట్ట భద్రతలో ఎదురవుతున్న  వివిధ సవాళ్లకు అత్యంత సముచితమైన పరిష్కారాలను అందించడానికి వేగవంతమైన ఆవిష్కరణలు, అత్యాధునిక సైద్ధాంతిక, ఆచరణాత్మక పరిజ్ఞానంతో కూడిన డ్యామ్ నిర్వహణ కోసం  ఏజెన్సీలు, పరిశ్రమలకు సమర్ధ మానవ వనరులను అందించడానికి  ఐసిఈడీ  ద్వారా కృషి జరుగుతుంది.  2023 ఫిబ్రవరి లో కుదిరిన ఒప్పందంలో భాగంగా   ఐఐటీ T రూర్కీలో మొదటి ఐసిఈడీ కేంద్రం ఏర్పాటయింది. 

 

 

***



(Release ID: 2012076) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi , Tamil