రక్షణ మంత్రిత్వ శాఖ
గోవాలోని నావల్ వార్ కాలేజీలో కొత్త అడ్మినిస్ట్రేటివ్ మరియు ట్రైనింగ్ భవనాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
నౌకాదళ ఆకాంక్షలు & భారతదేశ సముద్ర శ్రేష్ఠత వారసత్వానికి ఇది చిహ్నంగా పేర్కొంది
“హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ పాత్రను ప్రభుత్వం తిరిగి ఊహించింది మరియు బలోపేతం చేసింది; మనం మొదటి ప్రతిస్పందన దారులుగా మరియు ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా ఉద్భవించాము”
“హిందూ మహాసముద్రంలో దేశాల స్వయంప్రతిపత్తి & సార్వభౌమాధికారాన్ని భారతదేశం పరిరక్షిస్తుంది; ఎవరూ ఆధిపత్యం చెలాయించకుండా చూసుకుటుంది”
"భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తి ఆధిపత్యం కోసం కాదు అది ఇండో-పసిఫిక్‌లో శాంతి మరియు శ్రేయస్సుతో నిండిన వాతావరణాన్ని సృష్టించడానికి"
Posted On:
05 MAR 2024 2:07PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మార్చి 05, 2024న గోవాలోని నావల్ వార్ కాలేజ్ (ఎన్‌డబ్ల్యూసీ)లో కొత్త అడ్మినిస్ట్రేటివ్ & ట్రైనింగ్ భవనాన్ని ప్రారంభించారు. 'చోళ' అని పేరు పెట్టబడిన ఈ ఆధునిక భవనం చోళ రాజవంశం యొక్క శక్తివంతమైన సముద్ర సామ్రాజ్యానికి నివాళులర్పించింది. రక్షణ మంత్రి తన ప్రసంగంలో ప్రపంచంలోని సముద్ర శక్తులలో భారతదేశం యొక్క స్థాయిని ప్రతిధ్వనించే ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా సౌకర్యాన్ని సృష్టించినందుకు నౌకాదళాన్ని ప్రశంసించారు.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చోళ భవన్ నావికాదళం యొక్క ఆకాంక్షలకు మరియు భారతదేశం యొక్క సముద్ర శ్రేష్ఠత వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. ఇది బానిస మనస్తత్వం నుండి బయటపడి, మన సుసంపన్నమైన చారిత్రక వారసత్వం గురించి గర్వపడే భారతదేశపు కొత్త మనస్తత్వానికి ప్రతిబింబం ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ఒక స్పష్టమైన పిలుపు అని చెప్పారాయన.
ప్రధాన మంత్రి యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ముప్పు అవగాహనను ఎదుర్కోవడంలో మార్పు గురించి కూడా రక్షణ మంత్రి మాట్లాడారు. అది ఇప్పుడు భూ ఆధారిత మరియు సముద్ర సవాళ్లను కవర్ చేస్తోంది. "ఇంతకుముందు దాదాపు అన్ని ప్రభుత్వాలు భూ సరిహద్దులను బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. కానీ సముద్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో మన విరోధుల కదలికలు మరియు ప్రాంతం యొక్క వాణిజ్య ప్రాముఖ్యత దృష్ట్యా, మన ముప్పు అవగాహనను తిరిగి అంచనా వేయడం మరియు తదనుగుణంగా మన సైనిక వనరులు & వ్యూహాత్మక దృష్టిని తిరిగి సమతుల్యం చేసుకోవడం అవసరం. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో మేము ఐఓఆర్‌లో భారతదేశం యొక్క పాత్రను తిరిగి ఊహించడమే కాకుండా దానిని బలోపేతం చేసాము. ఈ ప్రయత్నాల కారణంగా భారతదేశం నేడు ఐఓఆర్‌లో మొదటి ప్రతిస్పందనదారుగా మరియు ఇష్టపడే భద్రతా భాగస్వామిగా ఉద్భవించింది అని రక్షణమంత్రి చెప్పారు.
ఐఓఆర్‌లో నిబంధనల ఆధారిత సముద్ర క్రమాన్ని పటిష్టం చేయవచ్చని రక్షణ మంత్రి తెలిపారు. “హిందూ మహాసముద్రంలోని అన్ని పొరుగు దేశాలకు తమ స్వయంప్రతిపత్తి మరియు సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో సహాయం చేయాలని భారతదేశం భరోసా ఇస్తోంది. ఈ ప్రాంతంలో ఎవరూ ఆధిపత్యం చెలాయించకూడదని మేము నిర్ధారించాము అని ఆయన అన్నారు.
నౌకాదళం యొక్క సంసిద్ధత కారణంగా సముద్రతీర దేశాలకు పూర్తి సహాయాన్ని అందించడం ద్వారా భారతదేశం ఐఓఆర్‌లో తన బాధ్యతను నిర్వర్తిస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హైలైట్ చేశారు. అపారమైన ఆర్థిక మరియు సైనిక శక్తితో ఏ దేశమూ స్నేహపూర్వక దేశాలపై ఆధిపత్యం చెలాయించడం లేదా వాటి సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లకుండా నావికాదళం భరోసా ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. నావికాదళం దేశం యొక్క మిత్రదేశాలకు అండగా నిలబడే సంసిద్ధత భారతదేశ ప్రపంచ విలువలకు గణనీయమైన బలాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
‘వసుధైవ కుటుంబం’ అనే మంత్రం ద్వారా భారతదేశం అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లే ప్రత్యేకతను ప్రపంచానికి అందించిందని రక్షణ మంత్రి సూచించారు. భారతదేశం మరింత పటిష్టంగా మారితే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధత కూడా బలపడతాయని అన్నారు.
బలమైన నౌకాదళ పారిశ్రామిక స్థావరం నేపథ్యంలో భారత నావికాదళం పెరుగుతున్న పరాక్రమాన్ని ఎత్తిచూపుతూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆలోచన ఆధిపత్యాన్ని సాధించడం కాదని, ఇండో-పసిఫిక్‌లో శాంతి మరియు శ్రేయస్సు యొక్క వాతావరణాన్ని సృష్టించడం అని ఉద్ఘాటించారు. "పెరుగుతున్న నావికా శక్తి మన శత్రువుల నుండి మనల్ని రక్షించడమే కాకుండా హిందూ మహాసముద్రంలోని ఇతర వాటాదారులకు భద్రతా వాతావరణాన్ని కూడా అందిస్తుంది" అని ఆయన అన్నారు.
రక్షణ మంత్రి తన సముద్ర పొరుగు దేశాలతో ఆర్థిక & భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రధాన మంత్రి సూచించినట్టి ఈ ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధి (సాగర్) దృష్టికి అనుగుణంగా ఉంటుందన్నారు. నావికాదళం మరింత పటిష్టంగా మారితే ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతుందని ఈ నిబద్ధతను నెరవేర్చినందుకు నౌకాదళాన్ని ఆయన అభినందించారు.
'న్యూ ఇండియా' యొక్క పరివర్తనాత్మక వ్యూహాత్మక ఆలోచనను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నొక్కి చెబుతూ "ఒకప్పుడు మనం 'సముద్ర తీరాలతో భూపరివేష్టిత దేశం' అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం 'భూ సరిహద్దులతో కూడిన ద్వీప దేశం'గా చూడవచ్చు అని నొక్కి చెప్పారు. ఈ ప్రాంతంలో లభించే వనరులు మరియు అవకాశాలు భారతదేశం యొక్క శ్రేయస్సుకు కారకాలుగా ఉంటాయని ఇది భవిష్యత్తులో భారత నౌకాదళం పాత్రను మరింత ముఖ్యమైనదిగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం దాని కేంద్రంగా ఉద్భవించడంతో చాలా వరకు సరుకుల వ్యాపారం సముద్ర మార్గం గుండా జరుగుతుందని రక్షణ మంత్రి తెలిపారు. పెరుగుతున్న వస్తు వ్యాపారం కారణంగా పైరసీ, అక్రమ రవాణా వంటి అనేక సవాళ్లు తెరపైకి వస్తున్నాయని ఆయన వివరించారు.
నావికాదళం ఈ ప్రాంతంలో భద్రతా వాతావరణాన్ని పటిష్టం చేయడంతోపాటు సద్భావనను పెంపొందించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. యాంటి-పైరసీ మరియు యాంటీ-ట్రాఫికింగ్ కార్యకలాపాల ద్వారా గ్లోబల్ కాన్వాస్‌పై భారత నావికాదళం సత్వరమే ఈ ఘటనలు తగ్గాయని, అయితే సవాళ్లు విస్మరించలేమని ఆయన పేర్కొన్నారు. సముద్రగర్భ కేబుల్స్‌పై ఇటీవల జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు, ఇటువంటి సంఘటనలు వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి నేవీ సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
గోవాలోని ఎన్‌డబ్ల్యుసిలో నూతన భవనం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత నావికాదళం యొక్క అభివృద్ధి మరియు కీలక పాత్రపై అధికారులకు శిక్షణనిచ్చేందుకు ఎంతో దోహదపడుతుందని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌డబ్ల్యుసి తన వినూత్న శిక్షణ ద్వారా ట్రైనీల సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, కొత్త దృక్పథంపై వారికి అవగాహన కల్పించి దేశ ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్వార్‌లోని నేవల్ బేస్‌లో రెండు ప్రధాన పీర్లను శ్రీ రాజ్‌నాథ్ సింగ్, అడ్మిరల్ ఆర్ హరి కుమార్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మరియు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పీర్ రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను మరియు ఒక ల్యాండింగ్ షిప్ ట్యాంక్ (పెద్దది) ఏకకాలంలో బెర్త్ చేయగలదు. సహాయక నౌక పీర్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్ మరియు ఆక్సిలరీ క్రాఫ్ట్‌లను హోస్ట్ చేస్తుంది. నౌకలకు విద్యుత్తు, తాగునీరు, ఎయిర్ కండిషనింగ్ కోసం చల్లబడిన నీరు మరియు ఇతర దేశీయ సేవల వంటి వివిధ తీర ఆధారిత సేవలను కూడా పైర్లు అందిస్తాయి.
ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్ సీబర్డ్ యొక్క కొనసాగుతున్న దశలో భాగం. ఇందులో 32 నౌకలు/సబ్‌మెరైన్‌లు, 23 యార్డ్‌క్రాఫ్ట్‌లు, డ్యూయల్ యూజ్ నేవల్ ఎయిర్ స్టేషన్, పూర్తి నేవల్ డాక్‌యార్డ్, నాలుగు కవర్ డ్రై బెర్త్‌లు మరియు ఓడలు/విమానాల కోసం లాజిస్టిక్‌లు ఉంటాయి. ఇది దాదాపు 10,000 మంది యూనిఫాం ధరించిన మరియు పౌర సిబ్బందిని కుటుంబాలతో కలిగి ఉంటుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థ మరియు పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా పెంచుతుంది. సివిల్ ఎన్‌క్లేవ్‌తో కూడిన నావల్ ఎయిర్ స్టేషన్ ఉత్తర కర్ణాటక మరియు దక్షిణ గోవాలో పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది. కొనసాగుతున్న నిర్మాణం 7,000 ప్రత్యక్ష మరియు 20,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది. ప్రాజెక్ట్ 'ఆత్మనిర్భర్ భారత్'తో సమలేఖనం చేయబడింది, దేశీయంగా 90% పైగా మెటీరియల్‌లను సోర్సింగ్ చేస్తుంది.
దేశంలోనే అతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సీబర్డ్ భారత నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. రెండు పీర్లు దేశ పశ్చిమ తీరంలో వ్యూహాత్మక ఉనికిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముఖ్యోపన్యాసం చేస్తూ..ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో ఏర్పడుతున్న భద్రతా సవాళ్లను వివరించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉన్నత సైనిక విద్య యొక్క అనివార్య పాత్రను ఆయన ఎత్తిచూపారు. కొత్త శిక్షణా కేంద్రం భారత బలగాల అధికారులకు మాత్రమే కాకుండా సముద్రపు పొరుగువారికి కూడా సముద్ర దృక్పథాలను నేర్చుకోవడానికి మరియు పంచుకోవడానికి గురుకుల్‌గా పనిచేయడం ద్వారా సముద్ర శక్తిగా దేశం యొక్క పునరుజ్జీవనానికి చిహ్నంగా ఉపయోగపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రక్షణ మంత్రి ప్రాజెక్ట్ అమలులో పాల్గొన్న సిబ్బందితో కూడా సంభాషించారు మరియు వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ప్రారంభోత్సవ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. చోళ భవనాన్ని సాయుధ దళాలకు అంకితం చేసే ముందు గార్డ్ ఆఫ్ ఆనర్‌ను పరిశీలించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర పర్యాటక & ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మరియు పశ్చిమ & దక్షిణ నావికా కమాండ్స్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్లు కూడా పాల్గొన్నారు. . ఈ కార్యక్రమం ఎన్‌డబ్ల్యూసి చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తించబడింది. సైనిక విద్యలో నైపుణ్యం మరియు సముద్ర ఆలోచనలను పెంపొందించడంలో దాని నిబద్ధతను బలోపేతం చేసింది.
***
(Release ID: 2011917)
Visitor Counter : 119