బొగ్గు మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరి 2024లో మొత్తం బొగ్గు ఉత్పత్తి, పంపిణీలో గణనీయమైన పెరుగుదల
Posted On:
05 MAR 2024 11:08AM by PIB Hyderabad
ఫిబ్రవరి 2024 నెలలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలతో 96.60 మిలియన్ టన్నుల (ఎంటి) (తాత్కాలిక) బొగ్గు ఉత్పత్తిని సాధించింది. గత సంవత్సరం ఇదే నెలలో సాధించిన 86.38 ఎంటి గణాంకాలను అధిగమించి, దాదాపు 11.83% వృద్ధిని సాధించింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఫిబ్రవరి 2023లో సాధించిన 68.78 ఎంటిల కన్నా 8.69% వృద్ధితో 74.76 ఎంటిలు( తాత్కాలిక) ఉత్పత్తిని సాధించింది. సంచిత బొగ్గు ఉత్పత్తి (ఫిబ్రవరి 2024వరకు) ఆర్ధిక సంవత్సరంలో అదే కాలంలో చేసిన 785.39 ఎంటీల ఉత్పత్తితో పోలిస్తే 12.41% వృద్ధితో 2023-34లో 880.72 ఎంటిల( తాత్కాలిక) ఉత్పత్తిని సాధించింది.
అదనంగా, బొగ్గు పంపిణీ లో ఫిబ్రవరి 2024లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇది 13.63% వృద్ధి రేటుతో ఫిబ్రవరి 2023లో నమోదైన 74.61 ఎంటిలతో పోలిస్తే చెప్పుకోదగ్గ పురోగతిని ప్రదర్శించి, ఆకట్టుకునే 84.78 ఎంటిల (తాత్కాలిక)కు చేరుకుంది.
అదే సమయంలో, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) బట్వాడా ఫిబ్రవరి 2024లో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించి 65.3 ఎంటి (తాత్కాలిక) చేరుకుంది. ఫిబ్రవరి 2023లో సాధించిన 58.28లతో పోలిస్తే ఇది 12.05% వృద్ధిని సూచిస్తుంది.
సంచిత బొగ్గు పంపిణీ (ఫిబ్రవరి 2024వరకు) లో గణనీయమైన పెరుగుదలతో ఫిబ్రవరి 23-24లో 882.44 ఎంటి(తాత్కాలిక)లుగా ఉంది. ఇది ఆర్ధిక సంవత్సరం 22-23లో సాధించన 794.41 ఎంటిలకన్నా 11.08% వృద్ధిని సూచిస్తుంది.
ఈ విశేషమైన విజయాలు ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు మద్దతుగా స్థిరమైన బొగ్గు సరఫరాను నిర్ధారించడంలో వాటాదారులందరి సంఘటిత ప్రయత్నాలను పట్టి చూపుతున్నాయి. దేశం స్వావలంబన, స్థిరమైన అభివృద్ధి దృష్టిని అనుసరిస్తున్నందున, బొగ్గు పరిశ్రమ వృద్ధిని, శ్రేయస్సును మరింత పురోగమింపచేయాలన్న నిబద్ధతకు కట్టుబడి ఉంది.
***
(Release ID: 2011912)