వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

లాజిస్టిక్స్ పరిశ్రమలలో 12 మేటి సంస్థలను గుర్తించి లీప్స్ వాలెడిక్టరీ సెషన్‌ నిర్వహించిన డీపీఐఐటీ

Posted On: 05 MAR 2024 3:25PM by PIB Hyderabad

వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీనిన్న న్యూఢిల్లీలో లీప్స్ (లాజిస్టిక్స్ ఎక్సలెన్స్అడ్వాన్స్మెంట్ మరియు పెర్ఫార్మెన్స్ షీల్డ్వాలెడిక్టరీ సెషన్ను నిర్వహించిందిడీపీఐఐటీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ వివిధ విభాగాలలో 12 మంది లాజిస్టిక్స్ సంస్థలను ఈ సందర్భంగా సత్కరించారు కార్యక్రమంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులులీప్స్ విజేతలు (కోర్ లాజిస్టిక్స్వేర్హౌస్ & ప్యాకేజింగ్ఎంఎస్ఎంఈలుస్టార్టప్లువివిధ సంస్థలు మరియు భద్రతకలుపుగోలుత & వైవిధ్యం మరియు ఈఎస్జీ ప్రాక్టీస్ ప్రత్యేక విభాగాలు), ఎన్పీజీ సభ్యులుపరిశ్రమ అసోసియేషన్లునాలెడ్జ్ భాగస్వాములునేషనల్ లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ అవార్డులో పాల్గొనేవారు మరియు జ్యూరీ సభ్యులు కూడిన 100 కంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   సందర్భంగా డీపీఐఐటీ కార్యదర్శి మాట్లాడుతూ.. వాయురోడ్డుసముద్ర,  రైలు సరుకు రవాణాఅలాగే ప్యాకేజింగ్, గిడ్డంగులు మరియు మల్టీమోడల్ రవాణా వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలతో సహా లాజిస్టిక్స్ పరిశ్రమలోని వివిధ రంగాలలో అత్యుత్తమ నాయకత్వాన్ని మరియు వినూత్న ప్రయత్నాలను గుర్తించడానికి లీప్స్ అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. గౌరవప్రదమైన జ్యూరీ సభ్యులు.. విలువైన నాలెడ్జ్ భాగస్వాములను గుర్తించడం, వారు సమర్పణలను నిశితంగా విశ్లేషించడం మరియు లాజిస్టిక్స్ పరిశ్రమలో వారి అత్యుత్తమ విజయాలు మరియు ఆవిష్కరణలకు అత్యంత అర్హులైన పాల్గొనేవారు గుర్తింపు పొందారని నిర్ధారించారు. డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ, శ్రీ ఇ. శ్రీనివాస్, విజేతలందరినీ అభినందించారు. లాజిస్టిక్స్ రంగంలో.. తమ నైపుణ్యాన్ని సాధించడంలో ఆదర్శప్రాయమైన అంకితభావం, ఆవిష్కరణ మరియు స్థితిస్థాపకతను ప్రదర్శించిన అన్ని ఎంటర్‌ప్రైజెస్, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు మరియు ఎకోసిస్టమ్ ఎనేబుల్లర్‌లను అభినందించారు. లాజిస్టిక్స్ ఎక్సలెన్స్, అడ్వాన్స్‌మెంట్ మరియు పెర్ఫార్మెన్స్ షీల్డ్ (లీప్స్) 2023 విజేతలను డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి శ్రీ ఇ. శ్రీనివాస్ సమక్షంలో డీపీఐఐటీ కార్యదర్శి డీజీఐఐటీ జాయింట్ సెక్రటరీ శ్రీ సురేంద్ర కుమార్ అహిర్వార్లు సత్కరించారు.

విజేతల జాబితాలో ఇలా ఉంది..

1. కోర్ లాజిస్టిక్స్ - ఎయిర్ ఫ్రైట్ సర్వీస్ ప్రొవైడర్: డీఎస్వీ ఎయిర్ అండ్ సీ ప్రైవేట్ లిమిటెడ్

2. కోర్ లాజిస్టిక్స్ - మారిటైమ్ ఫ్రైట్ సర్వీస్ ప్రొవైడర్: కెర్రీ ఇండేవ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

3. కోర్ లాజిస్టిక్స్ - మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు (ఎంటీఓస్)/ 3 పీఎల్ సర్వీస్ ప్రొవైడర్: అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్

4. కోర్ లాజిస్టిక్స్ - రైల్ ఫ్రైట్ సర్వీస్ ప్రొవైడర్: ప్రిస్టైన్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్

5. కోర్ లాజిస్టిక్స్ - రోడ్ ఫ్రైట్ సర్వీస్ ప్రొవైడర్: సేఫ్‌ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్

6. కోర్ లాజిస్టిక్స్ - వేర్‌హౌస్ సర్వీస్ ప్రొవైడర్ (పారిశ్రామిక మరియు వినియోగ వస్తువులు): డీపీ వరల్డ్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

7. సంస్థలు - లాజిస్టిక్స్ విభాగంలో విద్య మరియు నైపుణ్యాభివృద్ధి: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఎం, ముంబై)

8.ఎంఎస్ఎంఈలు - లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్: మ్యాచ్‌లాగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

9. ప్రత్యేక ప్రాంతాలు - లాజిస్టిక్స్‌లో ఇ.ఎస్.జి ఎక్సర్సైజెస్ విజేతలు : పారాదీప్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ ప్రయివేట్ లిమిటెడ్

10. ప్రత్యేక ప్రాంతాలు - లాజిస్టిక్స్ కార్యకలాపాలలో భద్రత యొక్క ఛాంపియన్స్ : డీహెచ్ఎల్

11. స్టార్టప్‌లు - లాజిస్టిక్స్ కార్యకలాపాలు: క్యాట్‌బస్ ఇన్ఫోలాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్లోహార్న్)

12. స్టార్టప్‌లు - లాజిస్టిక్స్ టెక్నాలజీ: షిప్‌డిలైట్

నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి అనుగుణంగా లాజిస్టిక్స్ రంగంలో మెరుగ్గా సేవలను అందిస్తున్న సంస్థలను గుర్తించడమే కాకుండా లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థ ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు మరియు లాజిస్టిక్స్ సెక్టార్ ఎనేబుల్ చేసేవారికి వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించాలని లీప్స్ లక్ష్యంగా పెట్టుకుంది. లీప్స్ అనేది లాజిస్టిక్స్ పరిశ్రమలోని ఉత్తమ అభ్యాసాలు మరియు ఆవిష్కరణలను గుర్తించి మరియు వాటిని విస్తృతం అమలు చేసేలా చూసేందుకు  డీపీఐఐటీ ద్వారా రూపొందించబడిన ఫ్లాగ్‌షిప్ చొరవ. 12 కేటగిరీలలో 171 ఎంట్రీలతో, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అర్హత కలిగిన దరఖాస్తులను గుర్తించడం చేశారు. వర్గీకరించడం మరియు ఎంపిక చేయడంలో పారదర్శకమైన మరియు న్యాయమైన సాంకేతికతను ఉపయోగించింది. 14 మంది విభిన్న నిపుణులతో కూడిన నిపుణుల స్క్రీనింగ్ కమిటీ మరియు మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, పరిశ్రమల సంఘాలు మరియు ప్రైవేట్ ప్లేయర్‌ల నుండి 13 మంది సీనియర్ ప్రముఖులతో కూడిన జాతీయ జ్యూరీ మూల్యాంకన ప్రక్రియలో పాలుపంచుకొంది. 

***



(Release ID: 2011908) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Hindi