వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

హాని క‌లిగించగ‌ల విఘాత డిజిట‌ల్ వినియోగం స‌హ‌జాతోద్వేగ ప్ర‌వ‌ర్త‌నా ప‌ద్ధ‌తుల నియంత్ర‌ణ‌పై బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్‌హాన్స్‌) స‌హ‌కారంతో ప‌రిశోధ‌న చేప‌ట్టడానికి స‌మావేశం నిర్వ‌హించిన భార‌త వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ (డిఒసిఎ)

ఆన్‌లైన్ గేమింగ్ కు సంబంధించి ఇంట‌ర్నెట్‌పై పెరుగుతున్న డిజిట‌ల్ వినియోగ‌దారుల ప‌రిర‌క్ష‌ణ‌కు ముంద‌స్తు, పూర్వ‌చ‌ర్య తీసుకోగ‌ల న‌మూనా నిర్మాణ‌మే ల‌క్ష్యం

ఆన్‌లైన్ గేమింగ్‌లో వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకే కాక హానిని త‌గ్గించేందుకు సాంకేతిక‌త‌ను వాంఛ‌నీయ ద‌శ‌లో వినియోగించే ప్ర‌వ‌ర్త‌న‌ను ప‌రిశ్ర‌మ నిర్ధారించేలా విధానాన్ని రూపొందించడానికి అవ‌స‌ర‌మైన ఇన్‌పుట్ల‌ను అందించ‌నున్న ప‌రిశోధ‌నా ఫ‌లితాలు

Posted On: 04 MAR 2024 6:37PM by PIB Hyderabad

హాని క‌లిగించగ‌ల విఘాత డిజిట‌ల్ వినియోగం స‌హ‌జాతోద్వేగ ప్ర‌వ‌ర్త‌నా ప‌ద్ధ‌తుల నియంత్ర‌ణ‌పై బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్‌హాన్స్‌) స‌హ‌కారంతో భార‌త వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ (డిఒసిఎ) ప‌రిశోధ‌న చేప‌ట్టాల‌ని ప్ర‌తిపాదించింది.  
ఈ విష‌య‌మై, 4.3.24న వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల విభాగం కార్య‌ద‌ర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి వినియోగ‌దారుల విభాగం సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ అనుప‌మ్ మిశ్రా, నిమ్‌హాన్స్ డైరెక్ట‌ర్ డా. ప్ర‌తిమా మూర్తి, నిమ్‌హాన్స్ లో క్లినిక‌ల్ సైకాల‌జీ ప్రొఫెస‌ర్ డా. మ‌నోజ్ శ‌ర్మ పాల్గొన్నారు. 
ఆన్‌లైన్ గేమింగ్ కు బానిస కావ‌డం అన్న‌ది సామాజిక ఒంట‌రిత‌నానికి, వాస్త‌వ జీవిత బాధ్య‌త‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డానికి దారితీస్తుంద‌ని, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల విభాగ కార్య‌ద‌ర్శి పేర్కొన్నారు.  ఇది త‌ర‌చుగా ఆపలేని గేమింగ్ ప్ర‌వ‌ర్త‌న‌ను క‌లిగి ఉండ‌ట‌మే కాక మాన‌సిక‌, భౌతిక ఆరోగ్య‌క‌ర‌మైన జీవితంపై హానిక‌ర‌మైన ప్ర‌భావాల‌ను క‌లిగి ఉంటుంది. ఆన్‌లైన్ గేమింగ్ అన్న‌ది గ‌ణ‌నీయ‌మైన స‌మ‌యాన్ని, డ‌బ్బును దుర్వినియోగం అవ‌డమే కాక ఇత‌ర ముఖ్య కార్య‌క‌లాపాల నిర్ల‌క్ష్యానికి, ఆర్థిక ఇబ్బందుల‌కు దారి తీస్తుంది. 
అధ్య‌య‌న ల‌క్ష్యాన్ని వివ‌రిస్తూ, ఇది జ్ఞానం, వినియోగం, అభ్యాసాల ఆధారిత డిజిట‌ల్ వినియోగ న‌మూనాను నిర్మించ‌డంపై ద‌ష్టి పెట్ట‌డ‌మ‌ని, ప్ర‌స్తుతం ఆ దృష్టి ఆన్‌లైన్ గేమింగ్ పైనే ఉన్న‌ప్ప‌టికీ, అనంత‌రం దానిని డిజిట‌ల్ సోష‌ల్ మీడియా లేదా ఇత‌ర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల‌కు వ‌ర్తింప‌చేస్తూ దానిని వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి పెంచ‌వ‌చ్చ‌న్నారు. అంతేకాకుండా, ఈ అధ్య‌య‌నం ఆన్‌లైన్ విష‌యాంశాల‌ను అతిగా వినియోగానికి బాధ్య‌త‌మైన అంత‌ర్లీన కార‌ణాల‌ను గుర్తించి, ఈ అంశాలను ప‌రీక్షించి, దాని ఆధారంగా ముంద‌స్తుగా చెప్పేందుకు, అప్ర‌మ‌త్తం చేసేందుకు, త‌గిన త‌ట్టుకునేందుకు అవ‌స‌ర‌మైన విధానాల‌తో జోక్యం చేసుకునేందుకు ఒక చ‌ట్రాన్ని సృష్టించ‌వ్చ‌న్నారు. ఈ అధ్య‌య‌నం వినియోగ‌దారులు సాంకేతిక‌త వాంఛ‌నీయ వినియోగాన్ని నిర్ధారిస్తూ,ఆర్థిక‌, భౌతిక హానిని త‌గ్గించేందుకు ఈ అధ్య‌య‌నం మార్గ‌ద‌ర్శ‌నాన్ని అందిస్తుంది. 
డేటాను సేక‌రించేందుకు, దానిని వ‌ర్గాల వారీగా, అంటే వ‌యోవ‌ర్గాలు, వినియోగ‌దారుల సామాజిక‌- ఆర్థిక స్త‌రం విశ్లేషించేందుకు, ఉనికిలో ఉన్న జోక్యాల గురించి, అతిగా వినియోగం చేసే దిశ‌గా పురోగ‌మించ‌కుండా నివారించేందుకు అవ‌స‌ర‌మైన త‌ట్టుకునే మెకానిజాలు త‌దిత‌రాల‌కు సంబంధించి  వివిధ సంస్థ‌లు/ సంఘాలు/  ప్రాధిక‌ర‌ణ సంస్థ‌లతో స‌హ‌కార, స‌మ‌న్వ‌యాల అవ‌స‌రాన్ని నిమ్‌హాన్స్ డైరెక్ట‌ర్ వివ‌రించారు. అంతేకాకుండా, అతి వినిమ‌యాన్ని నిరోధించేందుకు ఆరోగ్య‌వంత‌మైన డిజిట‌ల్ అల‌వాట్ల‌ను ప్రోత్స‌హించేందుకు కొన్ని విధానాల‌ను రూపొందించాల‌న్నారు. ప్ర‌స్తుత కాలానికి అవ‌స‌ర‌మైన ప్రాజెక్టు ఇది అని నిమ్‌హాన్స్ డైరెక్ట‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. 
ఈ ప‌రిశోధ‌నా ఫ‌లితాలు, ఆన్‌లైన్ గేమింగ్‌లో వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకే కాక హానిని త‌గ్గించేందుకు సాంకేతిక‌త‌ను వాంఛ‌నీయ ద‌శ‌లో వినియోగించే ప్ర‌వ‌ర్త‌న‌ను ప‌రిశ్ర‌మ నిర్ధారించేలా విధానాన్ని రూపొందించడానికి అవ‌స‌ర‌మైన ఇన్‌పుట్ల‌ను అందిస్తుంది. 

 

***
 



(Release ID: 2011597) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Marathi