ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ ఆరోగ్య రక్షణ సేవల కోసం రూపొందించిన భారత జాతీయ ప్రమాణాలను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి


సమగ్ర ఆరోగ్య సేవలు అందించడానికి ఆయుష్, ఐసిఎంఆర్ ల ద్వారా సమిష్టి కృషి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ఆయుర్వేద రంగంలో ముగ్గురు ప్రముఖులకు ఆర్ఏవీ జీవన సాఫల్య ఆరార్డులు ప్రదానం

గత 10 సంవత్సరాల కాలంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలతో కరదీపిక విడుదల

Posted On: 04 MAR 2024 3:45PM by PIB Hyderabad

ప్రజలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి మరింత కృషి  జరగాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. భవిష్యత్తులో సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ విధానాలకు ప్రాధాన్యత పెరుగుతుందని మంత్రి అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు, ప్రగతిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ కలిసి కృషి చేస్తున్నాయన్నారు. 

దేశం వివిధ ప్రాంతాలలో ఎంపిక చేసిన ఎయిమ్స్ సంస్థల్లో నెలకొల్పిన  ఆయుష్ - ఐసీఎంఆర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ రీసెర్చ్ (ఏఐ-ఏసీఐహెచ్ఆర్) లను మంత్రి ప్రారంభించారు. రక్తహీనతపై మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్స్ ను  కూడా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఆయుష్ ఆరోగ్య రక్షణ సేవల కోసం రూపొందించిన భారత జాతీయ ప్రమాణాలను  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేశారు. రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ 27 వ  స్నాతకోత్సవం లో పాల్గొన్న డాక్టర్ మాండవీయ  'ఆయుర్వేద అమృతానం' పై ఏర్పాటైన 29 వ జాతీయ సదస్సును ప్రారంభించారు. 

డాక్టర్ మాండవియా తన ప్రసంగంలో  ఆయుష్‌లో సహకార పరిశోధన కీలకంగా ఉంటుందన్నారు. దీనివల్ల  సంప్రదాయ జ్ఞానం , ఆధునిక శాస్త్రీయ పరిశోధనల మధ్య అంతరం తగ్గి ఆరోగ్య సంరక్షణకు సమగ్ర విధానం అందుబాటులోకి వస్తుందన్నారు.  ఆయుష్ ,ఐసిఎంఆర్ మధ్య కుదిరిన  వ్యూహాత్మక సహకారం సమగ్ర ఆరోగ్య పరిశోధనను ప్రోత్థసహిస్తుందని అన్నారు.  ఆధునిక వైద్య శాస్త్రంతో సాంప్రదాయ ఆయుష్ పద్ధతుల మధ్య సమన్వయం సాధించి  సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో భారతదేశాన్ని ముందంజలో ఉంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ మాండవీయ తెలిపారు. 

" ఆయుష్‌లో సహకార పరిశోధన చాలా ముఖ్యమైనది.  ఇది సాంప్రదాయ జ్ఞానం , ఆధునిక శాస్త్రీయ పరిశోధనల మధ్య అంతరాన్ని తగ్గించి, ఆరోగ్య సంరక్షణకు సమగ్ర విధానాన్ని అందుబాటులోకి తెస్తుంది  " అని డాక్టర్ మాండవీయ తెలిపారు .  “ఆయుర్వేదం భారతదేశ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయంలో ఒక భాగం.  రోజువారీ జీవితంలో ఈ విధానాలు ఆచరణలో ఉన్నాయి. . ఈ వ్యూహాత్మక సహకారం సమగ్ర ఆరోగ్య పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం, సాంప్రదాయ ఆయుష్ పద్ధతులను ఆధునిక వైద్య శాస్త్రంతో అనుసంధానించడం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో భారతదేశాన్ని ముందంజలో ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది." అని మంత్రి వివరించారు. 

ఆయుర్వేదం, అల్లోపతి రెండు విభాగాల నుంచి  ఉత్తమ విధానాలను గుర్తించి వాటిని మిళితం చేసి ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య  విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తుందని  కేంద్ర ఆరోగ్య మంత్రి వివరించారు.  “కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న అవసరాలకు ప్రతిస్పందనగా నాణ్యమైన  ఆరోగ్య సంరక్షణ సేవలను  అందించడానికి కృషి చేస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ   ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (IPHS) రూపొందించింది.  ఆరోగ్య సంరక్షణ సేవల  నాణ్యతను మెరుగు పరచడానికి ఏకరీతి ప్రమాణాలను  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.  ఈ సంస్కరణలను అవలంబించడం ద్వారా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణీత ప్రమాణాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలతో ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్ వైద్య సేవల ప్రయోజనాలను ప్రజలకు పొందేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు" అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైనప్పటి నుంచి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అందించడానికి కృషి చేస్తోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  రాజేష్ కోటేచా తెలిపారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో సాక్ష్యం ఆధారిత ఆయుష్ వ్యవస్థలను ప్రజారోగ్య సంరక్షణ,  పరిశోధన, ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు.   దశాబ్ద కాలంలో సాధించిన  విజయాలను ప్రదర్శించే సమగ్ర బుక్‌లెట్‌ను ఆవిష్కరించామని ఆయన తెలిపారు.  సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అందించడానికి  మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషి, నిబద్ధతను బుక్‌లెట్‌ లో పొందుపరిచామన్నారు.  ఆరోగ్యకరమైన, శక్తివంతమైన భారతదేశం నిర్మాణానికి కృషి జరుగుతుందన్నారు. 

ఆయుష్ ఆసుపత్రులు,  ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కోసం రూపొందించిన భారత జాతీయ ప్రమాణాలను డాక్టర్ మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు.  ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, వైద్య దేవేంద్ర త్రిగుణ ప్రెసిడెంట్ గవర్నింగ్ బాడీ, రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్, న్యూఢిల్లీ, వాయిద్యాపీఠ్ వంటి ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ఎన్సిఐఎస్ఎం చైర్మన్ దేవపూజారి , ,డిజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. అతుల్ గోయెల్, , కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీమతి అను నగర్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్  డాక్టర్ ఎం. శ్రీనివాసన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో వారి వారి రంగాల్లో. అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా   వైద్య గురుదీప్ సింగ్, జామ్‌నగర్ (గుజరాత్), డాక్టర్ పి. మాధవన్‌కుట్టి వారియర్, కొట్టక్కల్ (కేరళ), మరియు వైద్య విష్ణు దత్ శ్రీకిషన్ శర్మ, అజ్మీర్ (రాజస్థాన్)  ప్రతిష్టాత్మక జీవితకాల సాఫల్య పురస్కారం తో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో 13 మంది ఆయుర్వేద పండితులను రాష్ట్రీ ఆయుర్వేద విద్యాపీఠ్ (FRAV) 'ఫెలో 'గా సత్కరించారు.

రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ (FRAV) ఫెలోస్  2023-24

1.వైద్య భవనబెన్ ముంజపరా, అహ్మదాబాద్ (గుజరాత్)
2.డా. ఈనా శర్మ, కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్)
3.డా. జి.ఎస్. . బదేశా, రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)
4. వైద్య మురళీకృష్ణ పరాశరం, తిరుపతి (ఆంధ్ర ప్రదేశ్)
5. వైద్య దత్తాత్రయ మధుకరరావు సరాఫ్, నాగ్‌పూర్ (మహారాష్ట్ర)
6. వైద్య రామావతార్ శర్మ, చురు (రాజస్థాన్)
7. వైద్య (ప్రొఫె.) శ్యామ్ సుందర్ శర్మ, భాగల్పూర్ (బీహార్)
8. ప్రొఫెసర్ (డా.) బిష్ణు ప్రసాద్ శర్మ, గౌహతి (అస్సాం)
9. వైద్య గోపాలశరణ్ గార్గ్, అలీఘర్ (ఉత్తర ప్రదేశ్)
10. డాక్టర్ యూనస్ గఫార్ సోలంకి, ముంబై (మహారాష్ట్ర)
11. వైద్య మేధా పటేల్, సూరత్ (గుజరాత్)
12. డాక్టర్ విభా ద్వివేది, బరేలీ (ఉత్తర ప్రదేశ్)
13. డాక్టర్ వైద్య సంతోష్ భగవాన్రావ్ నెవ్‌పురాకర్, ఔరంగాబాద్, మహారాష్ట్ర

 

***


(Release ID: 2011595) Visitor Counter : 137