శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ ‘వికసిత్ భారత్’ సాకారం కావడానికి మొట్టమొదటి "సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్" దోహదం చేస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ యువతకు, సమర్థత కలిగిన స్టార్టప్ లకు అంకితం: డాక్టర్ జితేంద్ర సింగ్
సిఎస్ఐఆర్-ఐఐసిటి హైదరాబాద్ ఆవరణలో మొట్టమొదటి "సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్;, ప్రత్యేక ;బయోఫ్యూయల్ సెంటర్; కు శంకుస్థాపన చేసిన మంత్రి .
Posted On:
04 MAR 2024 6:57PM by PIB Hyderabad
మొట్టమొదటి సారిగా ఏర్పాటుచేసిన "సైన్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్" ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ దార్శనికతను సాకారం చేయడానికి దోహదపడుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా), పిఎంఒ. ,పీపీ/డీవోపీటీ, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సహాయమంత్రి, సి ఎస్ ఐ ఆర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. యువ మేధావులకు, సంభావ్య స్టార్టప్ లకు ఈ సెంటర్ ను అంకితం చేశారు.
సీఎస్ఐఆర్-ఐఐసీటీ హైదరాబాద్ ఆవరణలో మొట్టమొదటి 'సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్', ప్రత్యేక 'బయోఫ్యూయల్ సెంటర్'కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సైన్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఖచ్చితంగా మన దేశంలోని యువ మనస్సులను ప్రేరేపిస్తుందని , స్టార్టప్ ల కోసం వినూత్న ఆలోచనలతో ముందుకు రావడానికి వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు. సైన్స్ లేకుండా సంస్కృతి కదలదని, సంస్కృతి లేకుండా సైన్స్ పూర్తిగా సాధించదని ఆయన అన్నారు.
సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రధానంగా ప్రదర్శనలు / ఎగ్జిబిషన్ / గ్యాలరీలు మొదలైన వాటిని అభివృద్ధి చేయడం ద్వారా 'కమ్యూనికేటింగ్ సైన్స్ టు ఎంపవర్ పీపుల్' అనే నినాదంతో సమాజంలో ముఖ్యంగా విద్యార్థులలో సైన్స్ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో దోహదపడుతుంది. ఇంకా ఇంటరాక్టివ్ సైన్స్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. మరోవైపు 8000 మంది ఎస్ అండ్ టీ సిబ్బందితో అతిపెద్ద సైంటిఫిక్ ఆర్ అండ్ డీ ఆర్గనైజేషన్ సీఎస్ఐఆర్ దేశ ఇన్నోవేటివ్ చోదకంగా ఉందని ఆయన అన్నారు.
సిఎస్ఐఆర్, ఎన్ సిఎస్ఎం లు తమ తమ రంగాల్లో నిరూపితమైన నైపుణ్యంతో, సైన్స్ ను ఒక సంస్కృతిగా ప్రోత్సహించడానికి పరస్పర లక్ష్యాలను కలిగి ఉండటం, రెండూ కలసి హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్-ఐఐసిటి ప్రాంగణంలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం దేశానికి ఎంతో అవసరమన్నారు.
సిఎస్ఐఆర్ తన సృజనాత్మక పరిశోధన, బలమైన ప్రాథమిక శాస్త్రం, పరిశ్రమ భాగస్వామ్యాలు, వ్యవస్థాపకత, అనువాద పరిశోధన, సామర్థ్య నిర్మాణం , విధాన రూపకల్పన ద్వారా జాతీయ అవసరాలను తీరుస్తుందని మంత్రి చెప్పారు. పైలట్ శిక్షణ కోసం స్వదేశీ రెండు సీట్ల హంసా-ఎన్జీ విమానం అభివృద్ధి, సుస్థిర విమానయానం కోసం బయో-జెట్ ఇంధనం, భారతదేశ స్వంత పాదరక్షల సైజింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భూకంప జోన్ 4 , 5 కోసం భూకంప నిరోధక నిర్మాణాలు, భారతదేశ మొట్టమొదటి ఫ్యూయల్ సెల్ ఆధారిత ఆటోమోటివ్ గత దశాబ్దంలో సిఎస్ఐఆర్ అందించిన కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణలు అని ఆయన అన్నారు. ఈ రంగాలలో మార్గదర్శక కృషితో పాటు, సిఎస్ఐఆర్ నేడు మహిళలతో సహా అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకునే, అరోమా మిషన్, సముద్రపు కలుపు పెంపకం, హీంగ్ సాగు మొట్టమొదటి ప్రదర్శన, జమ్మూ కాశ్మీర్లో పర్పుల్ విప్లవం వంటి అనేక సామాజిక ప్రయోజన కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు.
దేశంలో సైన్స్ సంస్కృతి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మహమ్మారి వంటి సంఘటనలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే నొక్కి చెప్పాయని, అయితే సైన్స్, సైన్స్ ఆలోచనల కోసం సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంలో కరోనాపై పోరాటంలో సీఎస్ఐఆర్ కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ కు సహాయక ఔషధాన్ని అభివృద్ధి చేయడంలో సీఎస్ఐఆర్-ఐఐసీటీ పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. అనుభవం ఆధారిత అభ్యసనను భారత్ ప్రోత్సహిస్తోందని, సీఎస్ ఐఆర్ ఇందులో ముందంజలో ఉందన్నారు.
హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్ పీసీ) హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ అని, ఫార్మా పరిశ్రమలకు ఆర్ అండ్ డీ, మాన్యుఫ్యాక్చరింగ్ కు పెద్దపీట వేశామని, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈ క్లస్టర్ ను భారత ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)గా గుర్తించిందని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఫార్మా సిటీ ఫార్మాస్యూటికల్ వాల్యూ చైన్ లో సహజీవనానికి నిజమైన విలువను అందిపుచ్చుకుంటుందని తెలిపారు.
సిఎస్ఐఆర్-ఐఐసిటి అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానమే భారత్లో ఆగ్రోకెమికల్ పరిశ్రమ అభివృద్ధికి నాంది పలికిందన్న వాస్తవాన్ని ఆగ్రోకెమికల్ పరిశ్రమ విస్తృతంగా అంగీకరిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్ మెంట్ (ఐపీఎం)లో మానిటరింగ్, సర్వైలెన్స్ టూల్ గా ఫెరోమోన్ అప్లికేషన్ టెక్నాలజీ (పీఏటీ)ని ఉపయోగించవచ్చని సిఎస్ఐఆర్ - ఐఐసిటి నిరూపించింది.
ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేయడానికి సుస్థిర పరిష్కారాలను అభివృద్ధి చేయడం ద్వారా సృజనాత్మక సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా పోటీ ఆర్ అండ్ డి ద్వారా భారత పౌరుల జీవన నాణ్యతను పెంపొందించడంపై సిఎస్ఐఆర్ CSIR@2030 విజన్ ను కలిగి ఉంది. సిఎస్ఐఆర్ ఈ దార్శనికత రాబోయే 25 సంవత్సరాల 'అమృత్ కాల్ ' అంటే భారత స్వాతంత్య్రానికి వందేళ్ల నాటికి భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న దార్శనికతకు అనుగుణంగా ఉంది.
ఈ ప్రయత్నంలో, దేశంలో సైన్స్ సెంటర్లు, సైన్స్ సిటీల ఏర్పాటు కూడా దేశంలోని భావి శాస్త్రవేత్తలను పెంపొందించడానికి పునాది అవుతుంది.
****
(Release ID: 2011450)
Visitor Counter : 206