రక్షణ మంత్రిత్వ శాఖ
మినికాయ్ దీవిలో (లక్షద్వీప్) ఐఎన్ఎస్ జటాయు ప్రారంభంతో తన కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంపొందించుకోనున్న భారత నావికాదళం
Posted On:
02 MAR 2024 4:11PM by PIB Hyderabad
భారతీయ నావికాదళం చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ (నావికాదళాధిపతి) అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో మినికాయ్ దీవిలో ఐఎన్ఎస్ జటాయు నావికాదళ యూనిట్ ను (నావల్ డిటాచ్‌మెంట్) మార్చి 06, 2024న ప్రారంభించనుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన లక్షద్వీప్ దీవులలో భద్రతా మౌలికసదుపాయాలను మరింతగా పెంపొందించాలనే నావికాదళ సంకల్పంలో ఈ ఘటన ఒక కీలక మైలురాయిని సూచిస్తుంది.
కమాండ్ ఆఫ్ నావల్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి (లక్షద్వీప్) నిర్వహణ కింద మినికాయ్ నావికాదళ యూనిట్ ను 1980నాటికే ఏర్పాటు చేశారు. లక్షద్వీప్‌కు దక్షిణాన ఉన్న ద్వీపం మినికాయ్. ఇది కీలకమైన సీలైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ (ఎస్ఎల్ఒసిఎస్- ప్రాథమిక సముద్ర మార్గాల సమాచారం)ని అందిస్తుంది. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులతో ఒక స్వతంత్ర నావికాదళ స్థావరం ఏర్పాటు అన్నది దీవులలో భారత నావికాదళ సంపూర్ణ కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. పశ్చిమ అరేబియా సముద్రంలో సముద్ర దొంగతనాలను, మాదక ద్రవ్య కార్యకలాపాలను నిరోధించేందుకు బారత నావికాదళ కార్యచారణ కృషిని సులభతరం చేయడమే కాక, కార్యాచరణ పరిధిని ఈ స్థావరం మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో తొలి ప్రతిస్పందనదారుగా భారత నావికాదళ సామర్ధ్యాన్ని పెంపొందించడంతో పాటుగా ప్రధాన భూభాగం లేదా దీవితో అనుసంధానతను పెంచుతుంది. దీవుల సమగ్ర అభివృద్ధి దిశగా భారత ప్రభుత్వం పెడుతున్న దృష్టికి అనుగుణంగా నావికాదళ స్థావర ఏర్పాటు జరిగింది.
కవరత్తి దీవులలో ఐఎన్ఎస్ ద్వీప్ర్‌రక్షక్ తర్వాత లక్షద్వీప్‌లో ఏర్పాటు చేస్తున్న రెండవ నావికాదళ స్థావరం ఐఎన్ఎస్ జటాయు. ఐఎన్ఎస్ జటాయు ప్రారంభంతో భారత నావికాదళం లక్షద్వీప్ దీవులలో తన పట్టును బలోపేతం చేయడంతో పాటుగా కార్యచరణ నిఘా విస్తరణ, సామీప్యతతో పాటు నిలదొక్కుకుని కొనసాగుతుంది.ఇది సామర్ధ్య నిర్మాణంతో పాటు ద్వీప ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో నూతన శకానికి నాంది పలుకుతుంది. .
***
(Release ID: 2010989)
Visitor Counter : 228