గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2047 నాటికి అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారతదేశం వృద్ధి పథంలో ఉంది: మంత్రి హర్దీప్ ఎస్ పూరి


2014కి ముందు పాలసీలు పనిచేయని రోజుల నుండి పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పరివర్తన విధానాల యుగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము: హర్దీప్ ఎస్ పూరి

2014 నుండి 25 కోట్ల మందికి పైగా ప్రజలు బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారు: పూరీ

Posted On: 28 FEB 2024 3:57PM by PIB Hyderabad

మహమ్మారి యొక్క వినాశకరమైన ప్రభావాల నుండి పలు ఆర్థిక వ్యవస్థలు తిరిగి పుంజుకోవడానికి కష్టపడుతున్న సమయంలో భారతదేశం మరింత దృఢంగా ఉద్భవించిందని పెట్రోలియం & సహజ వాయువు మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. బెంగుళూరులో ఈరోజు రివా యూనివర్శిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జియోపాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రారంభోత్సవంలో సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో 7.3% వృద్ధి రేటుతో 2047 నాటికి అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశం అధిక వృద్ధి పథంలో ఉందని నిరూపిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ స్థాయిని ప్రస్తావిస్తూ దేశీయ సామాజిక ఆర్థిక విజయాలు మరియు సంక్షేమ సంస్కరణలు మన ప్రపంచ స్థాయి పెరుగుదల వెనుక ఉన్నాయని మంత్రి అన్నారు. గత పదేళ్లలో పాలనలో గొప్ప మార్పు వచ్చిందని చెప్పారు. 2014కి ముందు పాలసీ పనిచేయని రోజుల నుంచి ఇప్పుడు పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పరివర్తన విధానాల యుగాన్ని చూస్తున్నామని ఆయన అన్నారు.

గత 10 సంవత్సరాలలో దేశం సాధించిన విజయాలను వివరిస్తూ  2014 నుండి 25 కోట్ల మందికి పైగా ప్రజలు బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారని శ్రీ పూరి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ మిషన్ వంటి పథకాలతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ వంటి స్కీమ్‌ల విజయాన్ని ఆయన తెలిపారు.  గత పదేళ్లలో ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు 25% తగ్గిందని వివరించారు. 2014 నుండి 10.57 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడ్డాయి మరియు స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11 కోట్లకు పైగా గృహ మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 2.51 కోట్ల గ్రామీణ ఇళ్లు, 80 లక్షలకు పైగా పట్టణ గృహాలు నిర్మించామని చెప్పారు. తాజా బడ్జెట్‌లో ఈ పథకం పొడిగించబడిందని మరియు గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్ల ఇళ్లను మంజూరు చేస్తుందని చెప్పారు. పీఎం ముద్ర యోజన, పీఎం స్వనిధి యోజన, పీఎం ఉజ్వల పథకం కింద దేశం సాధించిన మైలురాళ్ల గురించి కూడా మంత్రి వివరించారు. నికర దిగుమతిదారు నుండి, భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా అవతరించిందని కేంద్రమంత్రి తెలిపారు.

చాలా అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్య శ్రామికశక్తి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని, అయితే భారతదేశం జనాభా పరివర్తనకు అంచున ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారతదేశ జనాభా డివిడెండ్ మనకు సాటిలేని మేధోపరమైన మూలధనాన్ని మరియు వ్యవస్థాపక మేధావిని అందిస్తుందని అన్నారు.

భారతదేశ శక్తి అన్ని ప్రజాస్వామ్యాలకు తల్లిగా మరియు ప్రపంచంలో ఏకాభిప్రాయ నిర్మాణం మరియు పరస్పర ప్రయోజనం దృష్టితో పనిచేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్త చర్యలు విశ్వానికి మేలు చేకూర్చగలవనే నమ్మకంతో భారతదేశం వసుధైవ కుటుంబం తత్వశాస్త్రం ద్వారా కొత్త ప్రపంచ దృష్టిని తీసుకువచ్చిందని ఆయన అన్నారు.

బెంగళూరులో జియోపాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం రేవా యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈరోజు ప్రారంభించారు. "ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జియోపాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రీవా యూనివర్శిటీ విద్యార్థులకు విలువైన పరిజ్ఞానాన్ని అందిస్తుందని మంత్రి అన్నారు.

21వ శతాబ్దపు గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశం యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవడం మరియు అభివృద్ధి చేయడం ఈ క్లిష్ట సమయంలో అత్యవసరమని మంత్రి అన్నారు. "ఈ కేంద్రం మేధో ఉత్సుకతను రేకెత్తించడానికి మరియు భౌగోళిక రాజకీయాలు మరియు అంతర్జాతీయ అధ్యయనాలపై మేధావులు, నిపుణులు, నిర్ణయాధికారులు మరియు వర్ధమాన నాయకులలో ఆలోచనలను రేకెత్తించే చర్చలను పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను." అని తెలిపారు.



 

***


(Release ID: 2009967) Visitor Counter : 130