విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఉత్పత్తిలో 100 మిలియన్ మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటిన ఎన్‌టిపిసి బొగ్గు మైనింగ్
Posted On:
26 FEB 2024 4:51PM by PIB Hyderabad
ఎన్‌టిపిసి మైనింగ్ లిమిటెడ్ (ఎన్ ఎంఎల్) ద్వారా భారతదేశంలో అగ్ర సమగ్ర విద్యుత్ వినియోగ ఎన్‌టిపిసి లిమిటెడ్ కిరీటంలో మరొక మాణిక్యాన్ని జోడించుకుంది. ఎన్‌టిపిసి బొగ్గు మైనింగ్ అనుబంధ పరిశ్రమ అయిన ఎన్ఎంఎల్ 100 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటి) మైలురాయికి మించి బొగ్గు ఉత్పాదన ద్వారా దీనిని సాధించింది.
ఈ మైలురాయిని ఫిబ్రవరి 25, 2024న సాధించారు, ఆ రోజున ఎన్‌టిపిసి మైనింగ్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన బొగ్గు సంచిత పరిమాణం 1 జనవరి 2017 నుంచి తన తొలి బొగ్గు గని పక్రి బర్వాదిహ్లో బొగ్గు ఉత్పాదన ప్రారంభించి 100.04 ఎంఎంటికి చేరుకుంది.
ముఖ్యంగా, మొదటి 50 ఎంఎంటి బొగ్గు ఉత్పత్తిని 1,995 రోజుల్లో, 19 జూన్, 2022న సాధించగా, తర్వాతి 50 ఎంఎంటి బొగ్గు ఉత్పత్తిని కేవలం 617 రోజుల్లోనే మూడింట ఒక వంతు కంటే తక్కువ సమయంలో సాధించడం జరిగింది.
ఈ అత్యుత్తమ పని తీరు దీని క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడం పట్ల ఎన్‌టిపిసి మైనింగ్ తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబింపచేస్తూ, తద్వారా ఎన్‌టిపిసి ఇంధన భద్రతకు దోహదం చేయడంతో పాటుగా దేశపు ఇంధన అవసరాలను తీర్చేందుకు సమర్ధవంతమైన సరఫరాను నిర్ధారిస్తుంది.
ప్రస్తుతం ఎన్‌టిపిసి మైనింగ్ లిమిటెడ్‌కు జార్ఖండ్‌లో పక్రి బర్వాదిచ చట్టి బరియాతు, కేరందరి బొగ్గు గనులు, ఒడిశాలోని దులంగా బొగ్గు గనులు, ఛత్తీస్‌గఢ్‌లో తలైపల్లి బొగ్గు గనులుఅనే ఐదు క్యాప్టివ్ బొగ్గులలో కార్యకలాపాలు సాగుతున్నాయి.
బొగ్గు ఉత్పత్తిలో నిలకడైన వృద్ధిని సాధించడం కోసం ఎన్‌టిపిసి పలు వ్యూహాలను, సాంకేతికతలను అమలు చేసింది. కఠినమైన భద్రతా చర్యలు, మెరుగైన గని ప్రణాళిక, పరికరాల ఆటోమెషన్, సిబ్బందికి శిక్షణ, నిరంతర పర్యవేక్షణ, విశ్లేషన వ్యవస్థల అమలు చేసింది.
2030 నాటికి ఏడాదికి 100 ఎంటిల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఎన్ఎంఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2009344)
Visitor Counter : 126