విద్యుత్తు మంత్రిత్వ శాఖ

నిరంతర పునరుత్పాదక ఇందన సరఫరా కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ల విస్తరణ వ్యవస్థకు ఆమోదం తెలిపిన కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి


నిరంతర పునరుత్పాదక ఇందన సరఫరా కోసం బిఈఎస్ఎస్ సామర్థ్యం పెరగాలి.. మంత్రి శ్రీ. ఆర్. కె. సింగ్

Posted On: 25 FEB 2024 6:09PM by PIB Hyderabad

నిరంతర పునరుత్పాదక ఇందన సరఫరా కోసం  బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ల విస్తరణ వ్యవస్థకు  కేంద్ర విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖ  మంత్రి శ్రీ. ఆర్. కె. సింగ్ ఆమోదం తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కింద 4,000 మెగావాట్ల (MWh) సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ అభివృద్ధిపై మంత్రి 2024 ఫిబ్రవరి 22న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి  విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రిడ్ ఇండియా ఎన్టీపీసీ  విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (NVVN)  సీనియర్ అధికారులు హాజరయ్యారు. 

సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడిన  విద్యుత్,నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఇటీవలి సంవత్సరాలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ( బిఈఎస్ఎస్ ) ధర తగ్గిందని అన్నారు. వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ఇంధన పరివర్తన అవసరాలను తీర్చడానికి  బిఈఎస్ఎస్ సామర్థ్యాన్ని ఎక్కువ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని   ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పగటిపూట అదనపు సౌరశక్తి, సాయంత్రం అదనపు పవన శక్తిని వినియోగించాల్సి ఉంటుందన్నారు. తగిన నిల్వ వ్యవస్థను ఏర్పాటు కానీ పక్షంలో ఇంధన వనరులు  వృధా అవుతాయన్నారు. ఇంధన వనరులను నిల్వ చేసి అవసరమైనప్పుడు వాటిని  వినియోగించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడులు రావడానికి వీలుగా తగిన వ్యవస్థను రూపొందించాల్సి ఉంటుందన్నారు. సమీప భవిష్యత్తులో వ్యవస్థ అమలు లోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సంవత్సరం పొందవున్న అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు.  

గ్రిడ్‌ను స్థిరీకరించడంతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో  విద్యుత్‌ను పంపిణీ చేయడానికి బిఈఎస్ఎస్ ను ఏ విధంగా వినియోగించాలి అన్న అంశంపై సమావేశంలో చర్చించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో వివిధ మార్కెట్ విభాగాల ద్వారా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు.  పునరుత్పాదక వనరులుగా ఉన్న  సౌర, పవన వనరులను ఉపయోగించి  ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను ఉపయోగించి  బిఈఎస్ఎస్ ఛార్జింగ్ అవుతుంది. 

ఇంధన ఒప్పందాలు మరియు సామర్థ్య ఒప్పందాల ఆధారంగా బిఈఎస్ఎస్   కొనుగోలు కోసం వివిధ నమూనాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నమూనాల  లాభాలు, నష్టాలు వాటి అమలుకు సంబంధించిన సమస్యలను సమావేశంలో చర్చించారు. బిఈఎస్ఎస్ ఏర్పాటుకు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాలను సమావేశం సమీక్షించింది. నిల్వ వ్యవస్థ నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి, పునరుత్పాదక శక్తి సమృద్ధిగా ఉన్న రాష్ట్రాల్లో వివిధ కేంద్రాలను సమావేశం గుర్తించింది. 

వీటిని కూడా చదవండి:

 

 

***



(Release ID: 2009021) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Hindi