శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బసోలి హెరిటేజ్ టౌన్ భవిష్యత్తులో అరోమా అంకుర సంస్థల గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్


తద్వారా జమ్మూ-కశ్మీర్ ఉపాధి కేంద్రం - టూరిజం సర్క్యూట్‌ గా మారనుంది : డాక్టర్ జితేంద్ర సింగ్


గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా బసోలిలో ఇప్పటికీ అభివృద్ధి లోటు స్పష్టంగా కనిపిస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 25 FEB 2024 6:59PM by PIB Hyderabad

ఈ రోజు మాట్లాడుతూ, జమ్మూ-కశ్మీర్ లోని కతువా జిల్లాలోని బసోలిని రాబోయే సంవత్సరాల్లో హెరిటేజ్ టౌన్, అరోమా అంకురసంస్థల గమ్యస్థానంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ ల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బసోలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.  

 

 

ఈ సందర్భంగా లావెండర్‌ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

 

బసోలిని గత ప్రభుత్వాలు ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురిచేశాయని, అందువల్ల ఈ కంది ప్రాంతంలో ఇప్పటికీ అభివృద్ధి లోటు కనిపిస్తోందనీ, డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

 

వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ- కశ్మీర్‌ ను రూపొందించాలనే భారత ప్రధానమంత్రి దార్శనికతను డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటిస్తూ, పేదలు, రైతులు, యువత, నారీ శక్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలియజేశారు.  ఈ ప్రభుత్వం ‘సబ్‌-కా-సాత్‌, సబ్‌-కా-వికాస్‌’ మంత్రాన్ని విశ్వసిస్తున్నందున పేదలు, రైతులు, యువత, నారీ శక్తి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సాధికారత పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

రోడ్డు, రహదారుల అభివృద్ధి గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉత్తర భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్-బ్రిడ్జ్ అటల్ సేతు, కీరియన్-గాంద్యాల్ వద్ద జమ్మూ-కశ్మీర్ కు చెందిన మొదటి అంతర్-రాష్ట్ర వంతెన మొదలైనవి ఎవ్వరూ ఊహించని అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచాయని పేర్కొన్నారు. 

 

శ్రీ నరేంద్ర మోదీ 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి కాకపోతే, గత 70 ఏళ్లుగా నిలిచిపోయిన షాపూర్-కంది ప్రాజెక్టు మళ్లీ ప్రారంభించబడేది కాదని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  అనేక విధాలుగా ఈ ప్రాంతానికి జీవనాడి అయినందున, ఈ ప్రాంతంలోని 4000 ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించే అవకాశం ఉన్నందున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

 

అరోమా మిషన్‌ ను మన పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ లు ప్రారంభించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.   ఈ నియోజకవర్గం భారతదేశంలో పర్పుల్ విప్లవానికి పుట్టినిల్లు అయినందున, బసోహ్లి ఇక్కడ లావెండర్ సాగును ప్రారంభించటానికి వెనుకాడకూడదు, ఇది ఈ ప్రాంత వ్యవసాయదారుల ఆదాయాన్ని అనేక రెట్లు పెంచుతుందని ఆయన వివరించారు. 

 

****



(Release ID: 2009020) Visitor Counter : 91


Read this release in: English , Urdu , Hindi