పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
హెచ్‌పిసిఎల్ గ్యాస్ నెట్‌వర్క్‌కు శంకుస్థాపన: జార్ఖండ్‌లో చారిత్రక మైలురాయి:
ఇండియన్ ఆయిల్‌కు చెందిన పిఎన్‌జి ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబడింది
ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక శ్రేయస్సుకు ఉపయోగకరం
Posted On:
25 FEB 2024 2:47PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి పిఎన్‌జీ మరియు సీఎన్‌జీ కోసం గొడ్డ-దుమ్కా భౌగోళిక ప్రాంతం (జీఏ)లో హెచ్‌పిసిఎల్‌కు చెందిన గ్యాస్ నెట్‌వర్క్‌కు శంకుస్థాపన చేసారు మరియు ఇండియన్ ఆయిల్ యొక్క పిఎన్‌జీను ప్రారంభించారు. జార్ఖండ్‌లోని డియోఘర్‌లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కింద ఇది ఏర్పాటు చేయబడింది. లోక్‌సభ సభ్యుడు శ్రీ నిషికాంత్ దూబే కూడా జార్ఖండ్‌లోని గొడ్డా నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గొడ్డ-దుమ్కా జీఏలో హెచ్‌పిసిఎల్ యొక్క దూరదృష్టి గల గ్యాస్ నెట్‌వర్క్ ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది 14507 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు 14 లక్షల కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ. 1750 కోట్లు. ఈ ప్రాజెక్ట్ గొడ్డా, దుమ్కా, పోరియాహత్, షికారిపరా, జర్ముండి, మహాగామా, పథర్గామా, జమ్తారా, మిహిజాం, పాకుర్, లితిపరా మరియు సాహిబ్‌గంజ్ వంటి ప్రాంతాలకు జీవం పోస్తుంది. 370 కి.మీ ఉక్కు మరియు పుష్కలమైన ఎండిపిఈతో కూడిన బలమైన గ్యాస్ నెట్‌వర్క్ గృహాలకు క్రమక్రమంగా పైపుల గ్యాస్ కనెక్షన్‌లను అందిస్తుంది. స్థిరమైన రవాణా పరిష్కారాల యొక్క కొత్త శకానికి నాంది పలికేందుకు 100 సిఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటు ప్రణాళికలు ఉన్నాయి.
దియోఘర్‌లో ఇండియన్ ఆయిల్ పిఎన్‌జీ ప్రాజెక్ట్ 6264 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మూడు జిల్లాల్లో ఉంది. ఇది 6 లక్షల కంటే ఎక్కువ గృహాలకు చేరువైంది. రూ. 303 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమం 2027 నాటికి 30,000 కుటుంబాలను 350 కి.మీ ఎండిపీఈ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేయడం ద్వారా అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉంది. దియోఘర్ వాన్‌గార్డ్‌గా ఇది ప్రారంభమయింది. సంతాల్ పరగణా డివిజన్‌లో పిఎన్‌జీని స్వీకరించిన మొదటి జిల్లాగా అవతరించింది. ఇంధన సదుపాయం మరియు సుస్థిరత దిశగా మార్పును ఇది తెలియజేస్తుంది.
ఈ ప్రాజెక్టులు నివాసితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు మరియు వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలలో వృద్ధిని ఉత్ప్రేరకపరుస్తాయి. ఒక్క డియోఘర్‌లోని 30,000 కుటుంబాలు మరియు 100 వాణిజ్య/పారిశ్రామిక సంస్థలు పిఎన్‌జీ కనెక్షన్‌ల నుండి ప్రయోజనం పొందుతాయి. అవాంతరాలు లేని మరియు ఆర్థిక ఇంధనానికి ప్రాప్యతను అందిస్తాయి. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) ప్రయోజనాలను 2 లక్షల కుటుంబాలు మరియు వాణిజ్య/పారిశ్రామిక సంస్థలకు విస్తరింపజేస్తుంది. ఇది గొడ్డ-దుమ్కా వద్ద పర్యావరణ అనుకూలమైన, విశ్వసనీయమైన మరియు నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారిస్తుంది. ఈ కార్యక్రమాలు కస్టమర్ అనుభవానికి ప్రాధాన్యతనిస్తాయి. వంట ఇంధనాన్ని నేరుగా వంటశాలలలో అందుబాటులో ఉంచడంతో పాటు సమయాన్ని మరియు ఖర్చును ఆదా చేస్తాయి. అంతేకాకుండా గణనీయమైన ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతటా సామాజిక-ఆర్థిక శ్రేయస్సుకు ఈ కార్యక్రమం తోడ్పాటును అందిస్తుంది.
పిఎన్‌జీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం మరియు ప్రారంభోత్సవం జార్ఖండ్ నివాసితులకు స్వచ్ఛమైన మరియు స్థిరమైన ఇంధన పరిష్కారాలను అందించే దృక్పథాన్ని సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది.
***
(Release ID: 2009002)
Visitor Counter : 104