సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర అవశేషాలను ప్రతిష్టించిన సనమ్‌లుయాంగ్ పెవిలియన్‌లో మఖాబుచా వేడుక
పవిత్ర అవశేషాలకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ప్రజలు
“బుద్ధుడి నుంచి ఇప్పటి వరకు థాయ్-భారత్ స్నేహం” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం
Posted On:
24 FEB 2024 7:28PM by PIB Hyderabad
థాయిలాండ్‌లోని బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ఐదు పవిత్ర కార్యక్రమంల్లో ఒకటైన మఖాబుచా (మాఘ పూజ) వేడుకను బౌద్ధ గురువు సోమ్‌దేత్, ఇతర బౌద్ధ సన్యాసులు ఘనంగా నిర్వహించారు. భారత్ నుంచి తీసుకువచ్చిన బుద్ధ భగవానుడు, ఆయన అతని ఇద్దరు శిష్యుల పవిత్ర శరీర అవశేషాలు ప్రతిష్టించిన వేదిక వద్ద ఈ వేడుక జరిగింది.
మఖాబుచా అనేది దినోత్సవం బుద్ధ భగవానుడు తన శిష్యులకు చేసిన బోధలను గుర్తు చేసే ఒక మతపరమైన వేడుక. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, మూడో చంద్ర నెల పౌర్ణమి రోజున ఈ వేడుకను జరుపుకుంటారు. మఖా అనే పదం పాలిలోని "మాఘ" అనే పదం నుంచి వచ్చింది. బుచా అనే పదాన్ని "పూజ చేయడం" అని చెప్పుకోవచ్చు. ఈ రెండు పదాలు బౌద్ధ గ్రంధంలో ఉపయోగించే పాళీ భాష నుంచి ఉద్భవించాయి.
బౌద్ధ క్యాలెండర్‌లో మొదటి ముఖ్య పండుగ అయిన మఖాబుచా వేడుకలను థాయిలాండ్, లావోస్, కంబోడియా సహా వివిధ దేశాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ ఎక్కువ మంది బౌద్ధులు థెరవాడ బౌద్ధమతాన్ని అనుసరిస్తారు, దీనిని "దక్షిణ బౌద్ధమతం" అని కూడా పిలుస్తారు.
ఈ వేడుక సందర్భంగా, థాయ్‌లాండ్‌లో 26 రోజుల పాటు బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను ప్రదర్శనకు ఉంచుతారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పెవిలియన్‌ను సందర్శించి, బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాల వద్ద ప్రార్థనలు చేస్తారు.
"బుద్ధుడి నుంచి ఇప్పటి వరకు థాయ్-భారత్ స్నేహం" అనే అంశంపై, ఈ రోజు, సనమ్‌లుయాంగ్ పెవిలియన్‌లో డా.సుపచై వీరఫుచాంగ్ ప్రత్యేక ప్రసంగం కూడా చేశారు.
***
(Release ID: 2008935)
Visitor Counter : 87