జౌళి మంత్రిత్వ శాఖ

భారతదేశపు అతి పెద్ద అంతర్జాతీయ టెక్స్టైల్ మెగా ఈవెంట్ కానున్న భారత్ టెక్స్ 2024: టెక్స్టైల్ సెక్రటరీ.


భారత్ టెక్స్ , భారత వస్త్రపరిశ్రమకు సంబంధించిన కథ., సమష్టి సహకారానికి ఇది గొప్ప ఉదాహరణ.

ఈ ఈవెంట్ 22 లక్షల చదరపు అడుగుల ఎగ్జిబిషన్ ఏరియాలో ఏర్పాటవుతుంది. వంద దేశాలు పాల్గొంటున్నాయి. 3000 మందికి పైగా వాణిజ్య కొనుగోలుదారులు, 100 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటారు.

ఈ ఈవెంట్ సందర్భంగా, అంతర్జాతీయ భాగస్వామ్యాలతోపాటు 46 అవగాహనా ఒప్పందాలు కుదరనున్నాయి.

భవిష్యత్కు సంబంధించి ఈ రంగంలో పర్యావరణ హితకర, వృధాలు లేని పరిష్కారాల సాధనకు టెక్స్టైల్స్ గ్రాండ్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు.

Posted On: 23 FEB 2024 12:18PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఫిబ్రవరి 26 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న భారత్ టెక్స్ 2024 ఈవెంట్ టెక్స్టైల్ రంగంలో భారతదేశానికి సంబంధించి అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్. 22 లక్షల చదరపు అడుగులలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. భారత్ మండపమ్యశోభూమిలలో ఈ మెగా ఎగ్జిబిషన్ జరుగుతుంది. వందకు పైగా దేశాలు పాల్గొంటాయి. వందమంది అంతర్జాతీయ వక్తలు భారత్ టెక్స్లో పాల్గొననున్నారు.

 


ఈ విషయాన్నిటెక్స్టైల్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26న ప్రారంభిస్తారు.
11 టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ప ప్రమోషన్ కౌన్సిళ్ల కన్సార్టియం ఆధ్వర్యంలోటెక్స్టైల్ మంత్రిత్వశాఖ మద్దతుతో దీనిని నిర్వహిస్తున్నారు. వాణిజ్యంపెట్టుబడులు అనే రెండు ప్రధానాంశాలు స్తంభాలుగా దీని నిర్వహణ జరగనుంది.  సరఫరా చెయిన్ పై ప్రధాన దృష్టి పెట్టడం దీని ప్రత్యేకత. నాలుగు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్ వస్త్ర పరిశ్రమ రంగంలో గల గొప్ప సంప్రదయాంసాంకేతికతఆకర్షణీయత,అన్నింటి కలబోతగా ఉంటుంది. ఇందులో విధాన నిర్ణేతలు,అంతర్జాతీయ సంస్థల సిఇఒలువందకు పైగా దేశాలనుంచి 3,500 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఈ ఎగ్జిబిషన్ను 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో టెక్స్టైల్ రంగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలూ ఉంటాయి. మొత్తం భారతీయ టెక్స్టైల్ రంగానికి చెందిన వాల్యూ చెయిన్ ఇందులో ఉంటుంది. భారతీయ టెక్స్టైల్ రంగం అంతర్జాతీయ పవర్ హౌస్గా తీర్చిదిద్దడానికి ఇది ఉపకరిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికత ప్రేరణ అయిన 5ఎఫ్ కింద ఈ ఈవెంట్ యూనిఫైడ్ ఫామ్ నుంచి ఫ్యాషన్ పై దృష్టిపెట్టడంతోపాటు మొత్తం వాల్యూ చెయిన్పై దృష్టిపెడుతుంది. భారత్ టెక్స్ అనేది 2 మిలియన్ చదరపు అడుగులలో ఏర్పాటవుతున్న అతిపెద్ద ఎగ్జిబిసన్ మాత్రమే కాకఒకే సారి రెండు ప్రదేశాలలో అంటే భారత్ మండపం, యశోభూమిలలో ఏర్పాటు చేస్తుండడం ప్రత్యేకమైనదని శ్రీమతి షా అన్నారు. ఈ ఈవెంట్ తోపాటు వస్త్ర పరిశ్రమ రంగానికి చెందిన అన్ని విలువ ఆధారిత గొలుసులోని విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తాయి.. భారత్ టెక్స్ ఎగ్జిబిషన్లో దుస్తులుగృహ అలంకరణలు, ఫ్లోర్ కవరింగ్లు, ఫైబర్లు, నూలు, వస్త్రాలు, కార్పెట్లు, సిల్క్ వస్త్రాలు, చేనేత వస్త్రాలు , టెక్నికల్ టెక్స్టైల్స్ ఇంకా ఎన్నోరకాల వస్త్ర రకాలు ప్రదర్శనలో ఉంటాయి. ఇక్కడే రిటైల్ విభాగం ఉంటుంది. ఫ్యాషన్ రిటైల్ మార్కెట్లో అవకాశాలనూ తెలియజేస్తారు. పానిపట్, తిరుపూర్ , సూరత్లలోని పరిశ్రమలు రీసైక్లింగ్, సుస్థిర విధానాలకు సంబంధించి సాగించిన కృషిపై పెవిలియన్లు ఉంటాయి..భారత సంప్రదాయ హస్తకళా రంగానికి సంబంధించి ఇండియా హాత్ ఏర్పాటవుతుంది. చేనేత వస్త్రాలుపదికి పైగా ఫ్యాషన్షోలను ఈ నాలుగు రోజులలో నిర్వహిస్తారు. ఇందులో భారతీయ వారసత్వ వస్త్రాలంకరణనుంచి అంతర్జాతీయ డిజైన్లవరకు ప్రదర్శిస్తారు. భారత్ టెక్స్లో అధ్బుత చేనేత కళాకారుల నేత ప్రదర్శనలుసంభాషణలు,ఫ్యాబ్రిక్టెస్టింగ్ జోన్లు, ఉత్పత్తుల ప్రదర్శన, అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్లకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి.. 

ఈ ఈవెంట్ సందర్భంగా 350 మందికి పైగా వక్తలువివిధ అంశాలపై తమ అనుభవాలను పంచుకుంటారు. అలాగే అంతర్జాతీయంగా టెక్స్టైల్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో భారత్కుగల సమర్థతను తెలియజేస్తారు.40 శాతంపైగా ఈ సెషన్లు సుస్థిరతవాల్యూచెయిన్ను బలోపేతం చేయడం, అంతర్జాతీయ టెక్స్టైల్ రంగంలో భారత్ను పవర్ హౌస్గా నిలపడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెడతారు.

ఈ ఈవెంట్ సందర్భంగా మూడు కంట్రీ సెషన్లను , 5 స్టేట్ సెషన్ లు ఉంటాయి. ఇవి టెక్స్టైల్ రంగానికి సంబంధించి అవకాశాలు, పెట్టుబడులు, వాణిజ్యం  తోపాటు అంతర్జాతీయ ట్రెండ్లు, భవిష్యత్ టెక్స్టైల్ పరిశ్రమ, భవిష్యత్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ, ఈ రంగంలో కృత్రిమ మేథ,బ్లాక్ చెయిన్ ఆధారిత స్మార్ట్ తయారీ వంటి అంశాలకు సంబంధించినవి.

టెక్స్టైల్ రంగానికి సంబంధించి మెగా వినూత్న ఆవిష్కరణల ఛాలెంజ్ని ,ఆవిష్కరణల అవకాశాలను గుర్తించి , భవిష్యత్ అవకాశాలను ఈ సందర్భంగా చర్చిస్తారు. భారత టెక్స్టైల్ రంగానికి గల అవకాశాలను ప్రదర్శిస్తారు. భారత్ టెక్స్లో ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేస్తారు. గతం నుంచి వర్తమానానికి , అటు నుంచి భవిష్యత్ భారత వస్త్ర పరిశ్రమకు సంబంధించి వస్త్ర పరిశ్రమ ప్రగతిని ఈ పెవిలియన్లో కల్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. 

ఈ ఈవెంట్కు అంతర్జాతీయ టెక్స్టైల్ కంపెనీలైన కోచ్టామీహిల్ఫిగర్, కాల్విన్ క్లెయిన్, వెరో మోడా, కోట్స్, టోరే, హెచ్ అండ్ ఎం, గ్యాప్, టార్గెట్, లీవిస్, కోల్స్ కంపెనీలనుంచి అద్భుత స్పందన వచ్చింది. అవి ఈ ఈ వెంట్లో పాల్గొననున్నట్టు ప్రకటించాయి. దీనికితోడు కీలక టెక్స్టైల్ హబ్ లు అయిన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్, బహుళపక్ష వ్యవస్థలు,అంతర్జాతీయ టెక్స్టైల్ సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నాయి. దీనికితోడు ,  అమెరికా, బ్రిటన్,ఆస్ట్రేలియా, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, అలాగే బహుళ పక్ష సంస్థలు, అంతర్జాతీయ టెక్స్టైల్ అసోసియేషన్లనుంచి ,కీలక టెక్స్టైల్ హబ్లనుంచి వ్యాపార ప్రతినిధులు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. 11 ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల వాల్యూ చెయిన్లోని అన్ని సంస్థల సమన్వయంతో ఈ ఈవెంట్ చోటుచేసుకుంటోంది. కేవలం ఇసిసిలు మాత్రమే కాకుండా ఇతర సంస్థలైన సిఎంఎఐసిఐటిఐ, ఎస్ఐఎంఎ, ఎస్జిసిసిఐ, టిఇఎ, జిఇఎంఎ, వైఇఎస్ ఎస్, ఐటిఎంఎఫ్, ఐటిఎంఇ, ఎటిఎంఎలు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. వస్త్ర పరిశ్రమకు సంబంధించి కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు ప్రత్యే పెవిలియన్లు ఏర్పాటు చేయడంతోపాటు ఆయా ప్రభుత్వాల ప్రాతినిధ్యం కూడా ఉంటోంది.(Release ID: 2008745) Visitor Counter : 77


Read this release in: English , Urdu , Hindi , Tamil