ఆయుష్
సుప్రీంకోర్టు ఆవరణలో ఆయుష్ హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Posted On:
22 FEB 2024 1:55PM by PIB Hyderabad
సుప్రీంకోర్టు ఆవరణలో 'ఆయుష్ హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్ 'ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్ర భాయ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయుష్ హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్ ను నెలకొల్పడం, నిర్వహించడం, నిపుణుల సేవలు , అందించడం పై సుప్రీంకోర్టు, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సుప్రీంకోర్టు ఆవరణలో ఆయుష్ హోలిస్టిక్ వెల్ నెస్ సెంటర్ ను పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హర్షం వ్య్వక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ సౌకర్యం కోసం తాను కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆయుర్వేదం, సమగ్ర జీవన విధానాన్ని తానూ అనుసరిస్తున్నానని ఆయన తెలిపారు.సుప్రీమ్ కోర్టులో 2000 మందికి పైగా సిబ్బంది ఉన్నారని,తెలిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సిబ్బందికి కూడా సమగ్ర జీవన విధానాన్ని అలవరచాలని సూచించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద వైద్యులందరికీ జస్టిస్ డీవై చంద్రచూడ్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోతేచ, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజ నేసరి పాల్గొన్నారు.
శారీరక, మానసిక, భావోద్వేగ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది సమగ్ర ఆరోగ్య సంరక్షణకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్ సేవలు అందిస్తుంది.. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద క్రియాశీల భాగస్వామ్యంతో ఏర్పాటైన కేంద్రంలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు.
సుప్రీంకోర్టు నుంచి అందిన ప్రతిపాదన మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) సుప్రీం కోర్ట్‌లో ఆయుష్ వెల్‌నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. LABSNA, సఫాదర్‌జంగ్, IIT, మొదలైన అనేక ప్రదేశాలలో ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద తన కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదే విధంగా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు సుప్రీంకోర్టు, సిబ్బంది కోసం సమగ్ర, సమీకృత వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
***
(Release ID: 2008072)
Visitor Counter : 147