శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సస్కట్చెవాన్ ప్రావిన్స్ ప్రధానమంత్రి స్కాట్ మో అధ్యక్షతన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలిసిన కెనడా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం


' కెనడా లో నివసిస్తున్న 23 లక్షల మంది మంది భారతీయులు రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం చేయడానికి, రెండు దేశాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు' .. డాక్టర్ జితేంద్ర సింగ్

' సుస్థిర ఇంధన సాంకేతిక రంగం, పర్యావరణహిత పరిశుద్ధ ఇంధన వనరుల రంగం, బయో ఎకానమీ వంటి రంగాల్లో కెనడాకు చెందిన ఆర్ అండ్ డీ సంస్థలతో పరిశోధన సహకారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది'... డాక్టర్ సింగ్ చెప్పారు.

'ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఆవిష్కరణ రంగానికి సహకారం'.. డాక్టర్ జితేంద్ర సింగ్

'జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం ప్రతిపాదించిన 'గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయన్స్' (జిబిఎ) వల్ల ఇంధన రంగంలో జీవ ఇంధనాల వినియోగం పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధికి సాధ్యమవుతుంది'.. డాక్టర్
సింగ్

Posted On: 21 FEB 2024 4:13PM by PIB Hyderabad

సస్కట్చెవాన్ ప్రావిన్స్ ప్రధానమంత్రి స్కాట్ మో అధ్యక్షతన  కెనడా  ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ రోజు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష సహక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలిసింది. విద్యుత్ వాహనాల ఉత్పత్తి, సైబర్ ఫిజికల్ సిస్టం, క్వాంటమ్ టెక్నాలజీ,ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్ ఇంధనం, డీప్ ఓషన్ మైనింగ్ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి గల అవకాశాలను రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. 

కెనడా ప్రతినిధి వర్గానికి స్వాగతం పలికిన డాక్టర్ జితేంద్ర సింగ్ ' కెనడా లో నివసిస్తున్న 23 లక్షల మంది  మంది భారతీయులు రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం చేయడానికి, రెండు దేశాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు' అని అన్నారు. కెనడాలో అత్యధిక సంఖ్యలో 23 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని మంత్రి తెలిపారు. కెనడా పార్లమెంట్, కెనడా మంత్రివర్గంలో భారతీయులకు స్థానం లభించడం రెండు దేశాల మధ్య ఉన్న సుస్థిర సంబంధాలకు నిదర్శనమని డాక్టర్  జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.రెండు దేశాల అభివృద్ధికి సహకరిస్తున్న కెనడా లో నివసిస్తున్న భారతీయులు రెండు దేశాల మధ్య వారధిగా ఉన్నారని మంత్రి అన్నారు. కెనడా లో ఉన్నత  విద్య అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు అని మంత్రి  అన్నారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యక్రమాలను కెనడా ప్రతినిధి బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా కృషి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు రంగం పాత్ర 60-70% వరకు ఉందన్నారు.సాంకేతిక రంగం అభివృద్ధిలో ప్రభుత్వేతర సంస్థలకు భాగస్వామ్యం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

సుస్థిర ఇంధన సాంకేతిక రంగం (ఉత్పత్తి, నిల్వ, పరివర్తన), పర్యావరణహిత పరిశుద్ధ ఇంధన వనరుల రంగం, బయో ఎకానమీ, ఆహారం,వ్యవసాయ సాంకేతిక రంగం, ఆరోగ్య సంరక్షణ (ఫార్మా, బయో మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్) వంటి రంగాల్లో కెనడాకు చెందిన  ఆర్ అండ్ డీ సంస్థలతో కలిసి పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని   డాక్టర్ సింగ్ చెప్పారు.

'జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం గత ఏడాది  ప్రతిపాదించిన  'గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయన్స్' (జిబిఎ) వల్ల ఇంధన రంగంలో  జీవ ఇంధనాల వినియోగం పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరిగి   ఆర్థిక వృద్ధికి సాధ్యమవుతుందని  డాక్టర్ సింగ్ వివరించారు. 

కర్బన ఉద్గారాలు తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం ఎక్కువ అయ్యేలా చూసేందుకు దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారని కెనడా ప్రతినిధి బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. దీనివల్ల భారతదేశం కర్బన ఉద్గారాలు  తగ్గుతాయని, ఇంధన దిగుమతు తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు. 

'వైభవ్ ఫెలోషిప్ 'కార్యక్రమం కింద సాధించిన విజయాలను కెనడా బృందానికి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 'వైభవ్ ఫెలోషిప్ 'కార్యక్రమం కింద   భారతదేశం లో ప్రధాన సంస్థల్లో పరిశోధనలు చేపట్టి దేశాభివృద్ధికి దోహదపడాలని   ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ ఆహ్వానం పలికారని ఆయన తెలిపారు. 

ఇటీవలి కాలంలో  కెనడా,  భారతదేశం మధ్య  సంబంధాలు బలపడ్డాయని స్కాట్ మో అన్నారు.రెండు దేశాలకు ప్రయోజనం కలిగే విధంగా వివిధ రంగాలలో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో శాస్త్ర, సాంకేతిక సహకారం కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు.రెండు దేశాల విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య  బలమైన బంధం ఉందన్నారు.  
 భారతదేశం, సస్కాట్చెవాన్ మధ్య సంబంధాలు బలపడ్డాయని స్కాట్ మో తెలిపారు.   ముఖ్యంగా ఢిల్లీలో తమ కార్యాలయాన్ని తెరిచిన తరువాత, భారతదేశం తో కలిసి పనిచేయడానికి, సమిష్టి వృద్ధిని సాధించడానికి అవకాశాలు మరింత పెరిగాయన్నారు. 

ఈ సమావేశంలో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ  కార్యదర్శి డాక్టర్ అభయ్ కరందీకర్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో భారతదేశ పురోగతిని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి వివరించారు.

 

***


(Release ID: 2007869) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi , Tamil