ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

'ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించడానికి పరిశోధన ప్రాధాన్యత' అనే అంశంపై ఏర్పాటైన ప్రాంతీయ సంప్రదింపుల వర్క్ షాప్ ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ప్రజలందరికీ అవసరమైన ఔషధాలు, చికిత్స, ఆరోగ్య సౌకర్యాలు సరసమైన ధరలో లభించే అభివృద్ధి చెందిన ఆరోగ్య భారతదేశం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

'సర్వజన హితం, సర్వజన సౌఖ్యం' స్పూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు అమలు జరుగుతున్నాయి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

గత 10 సంవత్సరాల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో రిమ్స్, రిపాన్స్, ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్, అస్సాం ఎయిమ్స్ ఏర్పాటు చేసి కొత్తగా 23 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

షిల్లాంగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో బ్లిక్ హెల్త్‌లో హెల్త్ ఎకనామిక్స్ అండ్ టెక్నాలజీ అసెస్‌మెంట్‌పై మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శ్రీ మాండవీయ

Posted On: 21 FEB 2024 1:51PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు  అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు   అందించడానికి పరిశోధన ప్రాధాన్యత అంశంపై ఏర్పాటైన  ప్రాంతీయ సంప్రదింపుల  వర్క్ షాప్ ను  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ  శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. వర్క్ షాప్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ  శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మేఘాలయ  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాజెల్ అంపరీన్ లింగ్డో కూడా పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుంటుం సంక్షేమ మంత్రిత్వ శాఖ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (షిల్లాంగ్), ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ డిబ్రూగఢ్ ప్రాంతీయ కార్యాలయం కలిసి వర్క్ షాప్ నిర్వహిస్తున్నాయి. 

వర్క్ షాప్ లో మాట్లాడిన డాక్టర్ మాండవీయ'  ప్రజలందరికీ అవసరమైన ఔషధాలు, చికిత్స, ఆరోగ్య సౌకర్యాలు  సరసమైన ధరలో లభించేలా అభివృద్ధి చెందిన ఆరోగ్య భారతదేశం నిర్మాణం కోసం   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. దేశం అన్ని ప్రాంతాల్లో సరైన సమయానికి, సరైన వైద్య సౌకర్యాలు తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది" అని అన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు ప్రజలందరికీ అందించాలి అన్న లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. దీనిలో భాగంగా సర్వజన హితం, సర్వజన సౌఖ్యం స్పూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు అమలు జరుగుతున్నాయని డాక్టర్ మన్సుఖ్ మాండవీయతెలిపారు. 

ఈశాన్య భారతదేశం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ  చేశారు. ' ఈశాన్య భారతదేశాన్ని ప్రధాన జనజీవన స్రవంతి లోకి తీసుకు రావడానికి గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసింది. ఈ ప్రాంతంలో ఆరోగ్యం, రహదారులు, రైల్వే సౌకర్యం, జలమార్గాలు, రోప్ వే నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు అమలు జరిగాయి. మొట్టమొదటిసారిగా దేశాభివృద్ధిలో  ఈశాన్య ప్రాంతం భాగంగా మారింది. ఆరోగ్య సంరక్షణ సేవలు అన్ని పాటల ప్రజలకు అందుతున్నాయి' అని డాక్టర్ మాండవీయ తెలిపారు. " గత 10 సంవత్సరాల కాలంలో  ఈశాన్య రాష్ట్రాల్లో రిమ్స్, రిపాన్స్, ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్, అస్సాం ఎయిమ్స్ ఏర్పాటు చేసి  కొత్తగా 23 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాంతంలో ఐసిఎంఆర్ అనేక వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసింది  " అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వివరించారు. 

' ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డు ఉపయోగించి 31 కోట్లకు మించి ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. 50 నుంచి 80 శతం వరకు తక్కువ ధరతో ఔషధాలు అందించడానికి 11,000 జన ఔషధీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం 1.64 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. 48 బిఎస్ఎల్ పరిశోధన కేంద్రాల ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతుల పర్యవేక్షణ జరుగుతోంది" అని డాక్టర్ మాండవీయ తెలిపారు. దేశంలో 22 లక్షలకు పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారని తెలిపిన డాక్టర్ మాండవీయ పీఎంజె కింద ఆరు కోట్ల మంది వరకు వైద్య ఖర్చులు పొందుతున్నారని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేస్తున్న ఖర్చు 62.6 శతం నుంచి 47.1 శాతానికి తగ్గిందన్నారు. 

అత్యవసర ఆరోగ్య సేవల తరహాలో అత్యవసర ఆరోగ్య సాంకేతిక అమల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించిందని డాక్టర్ మాండవీయ తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో ప్రజలందరికీ  ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 

కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి షిల్లాంగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో బ్లిక్ హెల్త్‌లో హెల్త్ ఎకనామిక్స్ అండ్ టెక్నాలజీ అసెస్‌మెంట్‌పై మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను, ఒక మార్కెట్ ను ప్రారంభించారు.

కార్యక్రమంలో  ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్య పరిశోధన విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి అను నాగర్, మేఘాలయ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ సంపత్ కుమార్, కేంద్ర ప్రభుత్వం, మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 2007757) Visitor Counter : 63