విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప‌ర్యావ‌ర‌ణ చ‌ర్య కోసం ఉప‌జాతీయ మిశ్ర‌మ పెట్టుబ‌డి/ రుణ సౌక‌ర్యానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచిన గోవాప్ర‌భుత్వం, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌

Posted On: 20 FEB 2024 7:05PM by PIB Hyderabad

విద్యుత్ రంగంలో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌, అగ్ర ఎన్‌బిఎఫ్‌సి, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ (పిఎఫ్‌సి) భార‌త‌దేశంలోని అతిపెద్ద పున‌రావృత ఇంధ‌న రంగ పెట్టుబ‌డిదారు గోవా రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ ఆకాంక్ష‌లు, ల‌క్ష్యాల‌కు తోడ్పాటును అందించేందుకు అవ‌గాహ‌నా ఒప్పందం (ఎంఒయు)పై సంత‌కాలు చేసింది. ప్ర‌పంచ బ్యాంకు భాగ‌స్వామ్యంతో గోవా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న మిశ్ర‌మ ఆర్ధిక సౌక‌ర్యం (బ్లెండెడ్ ఫైనాన్స్ ఫెసిలిటీ)  కింద  త‌క్కువ క‌ర్బ‌న‌, ప‌ర్యావ‌ర‌ణ స్థితిస్థాప‌క‌త అభివృద్ధిని పెంపొందించే ల‌క్ష్యంతో ఈ మ‌ద్ద‌తును అందించ‌నున్నారు.
ఎంఒయు కింద పునరావృత ఇంధ‌నం, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల హైడ్రొజెన్‌, విద్యుత్ వాహ‌నాలు, వృధా నుంచి సంప‌ద సాంకేతిక‌త‌, ప్ర‌కృతి ఆధారిత ప‌రిష్కారాల వంటి  కీల‌క ప‌ర్యావ‌ర‌ణ ప్రాజెక్టుల‌కు న‌వీన మిశ్ర‌మ ఆర్ధిక యంత్రాంగాల‌ను పిఎఫ్‌సి వినియోగించుకుని ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌కు దోహ‌దం చేస్తుంది.  ప‌ర్యావ‌ర‌ణ ప్రాజెక్టుల‌ను గుర్తించి, వ‌రుస‌గా వాటిని అభివృద్ధి చేయ‌డం ద్వారా ఈ సౌక‌ర్యాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేసే సౌల‌భ్యాన్ని, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను ప్రోత్స‌హించ‌డం, ఈ ప్రాజెక్టుల‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు భాగ‌స్వాముల‌తో స‌హ‌కారాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డాన్ని గోవా ప్ర‌భుత్వం చేయ‌నుంది. నిల‌క‌డైన వృద్ధిని ముందుకు తీసుకువెళ్ళే ల‌క్ష్యంతో పిఎఫ్‌సి, గోవా ప్ర‌భుత్వం వ‌న‌రుల‌ను, నైపుణ్యాల‌ను సంచ‌య‌నం చేస్తాయి. ఈ ఒప్పందం భార‌త‌దేశంలో మిశ్ర‌మ పెట్టుబ‌డుల సౌక‌ర్యానికి మార్గ‌ద‌ర్శిగా ఉంటూ, ప‌ర్యావ‌ర‌ణ చొర‌వ‌ల‌లో ప్రైవేటు రంగ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించడం ద్వారా భార‌త్ పెట్టుకున్న ప్ర‌తిష్ఠాత్మ‌క నిక‌ర సున్నా ల‌క్ష్యాల‌ను సాధించేందుకు దోహ‌దం చేస్తుంది. 
ఈ ఒప్పందంపై గోవాలో నేడు, ఫిబ్ర‌వ‌రి 20, 2024న జ‌రిగిన భార‌త్ ప‌ర్యావ‌ర‌ణ & అభివృద్ది భాగ‌స్వాముల స‌మావేశంలో, గోవా ముఖ్య‌మంత్రి డా. ప్ర‌మోద్ సావంత్ స‌మ‌క్షంలో సంత‌కాలు చేశారు.

ఫోటో కాప్ష‌న్ః గోవా ముఖ్య‌మంత్రి డా. ప్ర‌మోద్ సావంత్‌, పిఎఫ్‌సి సిఎండి శ్రీ‌మ‌తి ప‌ర్మీంద‌ర్ చోప్రా, పిఎఫ్‌సి డైరెక్ట‌ర్ (ప్రాజెక్ట్స్‌) శ్రీ రాజీవ్ రంజ‌న్ ఝా, గోవా ప్ర‌భుత్వ , ప్ర‌పంచ బ్యాంకు, ఎస్ఐడిబిఐ, నాబార్డ్ అధికారుల స‌మ‌క్షంలో ఎంఒయు పై సంత‌కాల కార్య‌క్ర‌మం

ఎంఒయు గురించి మాట్లాడుతూ, భార‌త్ 2070 నాటికి పంచామృత్‌, నిక‌ర సున్నా ఉద్గారాల‌ను సాధించేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌ని పిఎఫ్‌సి సిఎండి శ్రీ‌మ‌తి ప‌ర్మీంద‌ర్ చోప్రా అన్నారు. ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌ను సాధించ‌డం కోసం మిశ్ర‌మ పెట్టుబ‌డి రంగంలో ఈ మైలు రాయి చొర‌వ ద్వారా నిక‌ర సున్నా సాధించాల‌న్న ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు అనుగుణంగా పిఎఫ్‌సి కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని ఆమె పేర్కొన్నారు. 
గోవా ప్ర‌భుత్వం, పిఎఫ్‌సి మ‌ధ్య స‌హకారం అన్న‌ది ప‌ర్యావ‌ర‌ణ అనుకూల పెట్టుబ‌డుల‌లో ఒక చారిత్రిక మైలురాయిని సూచిస్తుంది. దీని కింద ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక‌తల‌ద్వారా ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌కు ఉత్ప్రేర‌ణ చేసేందుకు పిఎఫ్‌సి త‌న ఆర్ధిక నైపుణ్యాల‌ను అందిస్తుంది. ఈ చొర‌వ ఒక‌వైపు గోవా ప్ర‌భుత్వం, ప్ర‌పంచ బ్యాంకు మ‌ధ్య ఒక వినూత్న భాగ‌స్వామ్యం కాగా మ‌రోవైపు ప్ర‌ముఖ ఆర్థిక సంస్థ‌లు పిఎఫ్‌సి, ఎస్ఐడిబిఐ, నాబార్డ్ ప‌ర్యావ‌ర‌ణ చ‌ర్య‌ల ప్రాధాన్య‌త‌ల‌కు ఆర్ధిక తోడ్పాటును అందిస్తుంది. 

అద‌నంగాః
బ్లెండెడ్ ఫైనాన్స్ ఫెసిలిటీ (బిఎఫ్ఎఫ్‌- మిశ్ర‌మ పెట్టుబ‌డి సౌక‌ర్యం)ః
ప‌ర్యావ‌ర‌ణ చ‌ర్య కోసం రాయితీ రుణాలు/  పెట్టుబ‌డుల గురించి మీరు తెలుసుకోవ‌ల‌సిన‌ది కేంద్ర బ‌డ్జెట్ 2022-23 లో ప్ర‌క‌టించిన ప‌ర్యావ‌ర‌ణ చ‌ర్య కోసం సావ‌రిన్ బాండ్‌లు,   ప్ర‌తిపాదికా పూర్వ‌క ఇతివృత్త నిధుల కోసం మిశ్ర‌మ పెట్టుబ‌డి.


****



(Release ID: 2007667) Visitor Counter : 57


Read this release in: English , Urdu , Hindi