సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మణిపూర్ మరియు జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య సహకారాన్ని డీ ఏ ఆర్ పీ జీ సమన్వయం చేస్తుంది మరియు మణిపూర్‌లో ఏకీకృత సర్వీస్ డెలివరీ పోర్టల్‌ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.


ఫిబ్రవరి 19-20,2024 తేదీలలో జరిగిన డీ ఏ ఆర్ పీ జీ సీనియర్ అధికారులు, మణిపూర్ మరియు జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య 2 రోజుల సమావేశాలు

మణిపూర్ ప్రభుత్వ ఆన్‌లైన్ సర్వీస్ పోర్ట్‌ఫోలియోను మొదటి దశలో 35 నుండి 150కి గణనీయంగా విస్తరించడమే లక్ష్యం

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కి చెందిన సర్వీస్ ప్లస్ మరియు ఉమాంగ్ బృందాలకు చెందిన సీనియర్ అధికారులు సేవల ఏకీకరణ మరియు ఇప్పటికే ఉన్న ఖర్చుతో కూడుకున్న డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వినియోగంపై విలువైన అంతర్దృష్టులను అందించారు.

Posted On: 20 FEB 2024 5:36PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీ ఏ ఆర్ పీ జీ) నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్ (ఎన్ ఈ ఎస్ డీ ఏ ) భవిష్య మార్గం ఇ-సేవల సంతృప్తీకరణ మరియు ఏకీకృత సర్వీస్ డెలివరీ పోర్టల్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టింది. వారి నెలవారీ ఎన్ ఈ ఎస్ డీ ఏ వే ఫార్వర్డ్ పబ్లికేషన్ ద్వారా, డీ ఏ ఆర్ పీ జీ రాష్ట్రాలు/యూ టి లు తమ ఇ-సేవ డెలివరీ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు ఏకీకృత సర్వీస్ డెలివరీ పోర్టల్ ద్వారా ఇ-సేవలను అందించడాన్ని  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులను మరియు ప్రభుత్వాన్ని చేరువ చేసే సేవలను ప్రోత్సహిస్తుంది.

 

ఇ-గవర్నెన్స్‌లో జమ్మూ & కాశ్మీర్ యొక్క మెచ్చుకోదగిన పురోగతి, 1120 ఇ-సేవలను అందించడం మరియు వారి ఏకీకృత ఇ-ఉన్నత్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 100 శాతం సర్వీస్ డెలివరీని సాధించడం ద్వారా రుజువు  మణిపూర్‌లో ఇ-సేవలకు నమూనా గా మరియు వ్యాప్తికి మూలంగా పనిచేసింది. మణిపూర్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు, డీ ఏ ఆర్ పీ జీ ఫిబ్రవరి 19-20, 2024న మణిపూర్ ప్రభుత్వ మరియు జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వ సీనియర్ అధికారుల మధ్య మణిపూర్ యొక్క ఏకీకృత సర్వీస్ డెలివరీ పోర్టల్‌ను బలోపేతం చేయడంలో 2 రోజుల సమావేశాలను సమన్వయం చేసింది. 2 రోజుల చర్చల్లో ఎం ఈ ఐ టీ వై మరియు డీ ఏ ఆర్ పీ జీ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. విస్తృతమైన చర్చల తరువాత, మణిపూర్ ప్రభుత్వంలో ఇ-సేవల మెరుగుదల మరియు పెంపుదల కోసం మార్గదర్శిని రూపొందించబడింది. పౌర సేవల బట్వాడా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, దాని ఆన్‌లైన్ సర్వీస్ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించడానికి, రెవెన్యూ, హోమ్, ఇండస్ట్రీ & కామర్స్, సోషల్ వెల్ఫేర్, పిడబ్ల్యుడి మరియు పీ హెచ్ ఈ డీ డిపార్ట్‌మెంట్‌లను కవర్ చేస్తూ మొదటి దశలో 35 నుండి 150కి గణనీయంగా విస్తరించడానికి మణిపూర్ ప్రభుత్వం తన ఇ-గవర్నెన్స్ మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్ సేవల పరిధిని విస్తృతం చేయడం ద్వారా,  ప్రాప్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, తద్వారా ప్రభుత్వ సంస్థలతో పరస్పర చర్య చేసే పౌరులకు మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడం మణిపూర్ లక్ష్యంగా పెట్టుకుంది. మణిపూర్ మరియు జమ్మూ & కాశ్మీర్ మధ్య సహకార ప్రయత్నాలు సమగ్ర మార్గ దర్శనం అభివృద్ధికి దారితీశాయి. మణిపూర్ యొక్క ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  పరిణామంలో సామర్థ్యం, ​​ప్రాప్యత మరియు వినియోగదారు-స్నేహపూర్వకతకు మార్గ దర్శనం నిర్ధారిస్తుంది.

 

 

****



(Release ID: 2007665) Visitor Counter : 59


Read this release in: English , Urdu , Hindi