ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారతదేశంలోని వివిధ రంగాలలో తొమ్మిది ప్రాజెక్టుల కోసం జపనీస్ యెన్ (జెపివై) 232.209 బిలియన్ల అధికారిక అభివృద్ధి సహాయ రుణాన్ని (ఒడిఎ) అందించేందుకు అంగీకరించిన జపాన్
Posted On:
20 FEB 2024 1:07PM by PIB Hyderabad
వివిధ రంగాలలో తొమ్మిది ప్రాజెక్టుల కోసం జెపివై 232.209 బిలియన్ల అధికారిక అభివవృద్ధి సహాయ రుణాన్ని (అఫిషియల్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (ఒడిఎ)లోన్) అందించేందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన పత్రాలను మంగళవారం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన విత్త వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ వికాస్ షీల్, భారత్‌కు జపాన్ రాయబారి శ్రీ సుజుకి హిరోషీ ఇచ్చిపుచ్చుకున్నారు.
ఒడిఎ రుణ సహాయాన్ని దిగువన పేర్కొన్న ప్రాజెక్టులకు అందించనున్నారుః
ఈశాన్య రహదారి నెట్‌వర్క్ అనుసంధానత మెరుగుపరిచే ప్రాజెక్టు (దశ 3) (రెండవ విడత)ః ధుబ్రి -ఫూల్‌బరీ బ్రిడ్జి (జెపివై 34.54 బిలియన్లు)
ఈశాన్య రహదారి నెట్‌వర్క్ అనుసంధానత మెరుగుపరిచే ప్రాజెక్టు (దశ 7) ః ఎన్‌హెచ్ 127బి (ఫూల్‌బరీ -జియోరాగర్ సెక్షన్) (జెపివై 15.56 బిలియన్లు)
తెలంగాణలో స్టార్టప్ & ఆవిష్కరణను ప్రోత్సహించే ప్రాజెక్టు (జెపివై 23.7 బిలియన్లు)
చెన్నై సీమాంత రింగ్ రోడ్డు (దశ 2) (జెపివై 49.85 బిలియన్లు)
హర్యానాలో నిలకడైన తోటల పెంపకాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టు (మొదటి విడత) (జెపివై 16.21 బిలియన్లు)
రాజస్థాన్‌లో పర్యావరణ మార్పు ప్రతిస్పందన & పర్యావరణ వ్యవస్థ సేవల పెంపు ప్రాజెక్టుకు (జెపివై 26.13 బిలియన్లు)
కోహిమాలోని నాగాలాండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో వైద్య కళాశాల ఆసుపత్రి ఏర్పాటు ప్రాజెక్టుకు (జెపివై 10 బిలియన్లు)
ఉత్తరాఖండ్‌లో పట్టణ నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల ప్రాజెక్టుకు (జెపివై 16.21 బిలియన్లు); డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ ప్రాజెక్టు (దశ 1) (విడత 5) (జెపివై 40 బిలియన్లు) .
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నది రహదారి నెట్‌వర్క్ అనుసంధానత ప్రాజెక్టుల లక్ష్యం కాగా, చెన్నై సీమాంత రింగ్ రోడ్ రద్దీని తగ్గించి, రాష్ట్ర దక్షిణ ప్రాంతాలకు అనుసంధానతను బలోపేతం చేయడం ధ్యేయం. నాగాలాండ్ ప్రాజెక్టు లక్ష్యం ద్వితీయ శ్రేణి వైద్య సేవల బట్వాడా ద్వారా వైద్యకళాశాల, ఆసుపత్రి అభివృద్ధి సార్వత్రిక ఆరోగ్య కవరేజీకి దోహదం చేయడం. తెలంగాణకు చెందిన ప్రత్యేక ప్రాజెక్టు మహిళలు, గ్రామీణ జనాభాలోని వ్యవస్థాపక నైపుణ్యాలను గుర్తించి, ఎంఎస్ఎంఇల వ్యాపార విస్తరణకు సహాయపడటం. హర్యానాలో నిలకడైన తోటల పెంపకాన్న, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరచడమే కాక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రాజెక్టు పని చేస్తుంది. రాజస్థాన్‌లో అటవీ ప్రాజెక్టు అడవుల పెంపకం, అటవీ, జీవవైవిధ్య పరిరక్షణ ద్వారా పర్యావరణ వ్యవస్థ సేవలను పెంచడం లక్ష్యంగా పని చేస్తుంది. పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో పట్టణాలకు, నగరాలకు నిలకడైన నీటి సరఫరా అందించడంపై ప్రాజెక్టు దృష్టి పెడుతుంది. డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ ప్రాజెక్టు ఐదవ విడత నూతన డెడికేటెడ్ ఫ్రీట్ రైల్వే వ్యవస్థ నిర్మాణంలో తోడ్పడి, పెరిగిన సరుకురవాణా రద్దీని నిర్వహించేందుకు తోడ్పడే ఇంటర్ మోడల్ లాజిస్టక్స్ వ్యవస్థను ఆధునీకరిస్తుంది.
భారత్, జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక అభివృద్ధి సహకారంలో ఫలవంతమైన, సుదీర్ఘ చరిత్ర 1958 నుంచి ఉంది. భారత్- జపాన్ సంబంధాలలో కీలక స్తంభమైన ఆర్థిక భాగస్వామ్యం గత కొద్ది సంవత్సరాలలో పురోగమించింది. ఈ ముఖ్య ప్రాజెక్టులకు పత్రాలు ఇచ్చిపుచ్చుకోవడం భారత్, జపాన్‌ల మధ్య వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
****
(Release ID: 2007545)
Visitor Counter : 108