రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

న్యూజిలాండ్ నౌకాదళాధిపతి, రియర్‌ అడ్మిరల్‌ డేవిడ్ ప్రోక్టర్ భారతదేశ పర్యటన

प्रविष्टि तिथि: 20 FEB 2024 5:40PM by PIB Hyderabad

న్యూజిలాండ్ నౌకాదళాధిపతి, రియర్‌ అడ్మిరల్‌ డేవిడ్ ప్రోక్టర్ ఈ నెల 19-27 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ రోజు, భారత నౌకాదళాధిపతి, అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌తో న్యూదిల్లీలో సమావేశమయ్యారు. సౌత్ బ్లాక్‌లో, సైనిక గౌరవ వందనం నడుమ ఆయనకు స్వాగతం లభించింది.

సముద్ర రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై నౌకాదళాధిపతులిద్దరు చర్చించారు. ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు, శిక్షణలు, సమాచార మార్పిడి వంటివి కూడా చర్చకు వచ్చాయి. రియర్‌ అడ్మిరల్‌ డేవిడ్ ప్రోక్టర్, విశాఖపట్నంలో జరిగే మిలాన్‌ 24 విన్యాసాల్లో పాల్గొంటారు. పశ్చిమ నౌకాదళ స్థావరంలో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరుపుతారు.

అక్టోబర్ 22న, భారత నౌకాదళాధిపతి న్యూజిలాండ్‌లో పర్యటించినప్పటి నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సముద్ర రంగ సహకారం గణనీయంగా పెరిగింది. ఆ పర్యటనలో. సముద్ర రవాణాలో సమాచార మార్పిడి యంత్రాంగం కోసం ఒక సాంకేతిక ఏర్పాటు ఒప్పందం ఖరారైంది. రెండు నౌకాదళాలకు చెందిన యుద్ధనౌకలు పరస్పరం రెండు దేశాల ఓడరేవులను సందర్శిస్తున్నాయి. చివరిసారిగా, ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి ఆక్లాండ్, వెల్లింగ్‌టన్‌లో సెప్టెంబర్‌లో పర్యటించాయి. ఆ సమయంలో టాస్మాన్ సముద్రంలో విన్యాసాలు కూడా చేపట్టాయి.

***


(रिलीज़ आईडी: 2007535) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil